Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 13/06/2021 08:58 IST

Top Ten News @ 9 AM

1. Corona: గబ్బిలాల్లో కొత్తరకం కరోనా వైరస్‌లు

గబ్బిలాల్లో కరోనా వైరస్‌లకు సంబంధించిన ఒక కొత్త బ్యాచ్‌ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో ఒక రకానికి కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తో జన్యుపరంగా అత్యంత ఎక్కువ సారూప్యత ఉందని తేల్చారు. నైరుతి చైనాలో వీటిని గుర్తించారు. గబ్బిలాల్లో ఇంకా గుర్తించని కరోనా వైరస్‌లు, వాటిలో మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్న రకాలపై ఒక అంచనాకు రావడానికి తమ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలోని షాండాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Corona: మూడో ఉద్ధృతి పిల్లలకు ముప్పుపై ఆధారాల్లేవు

కరోనా మూడో ఉద్ధృతి (థర్డ్‌ వేవ్‌)లో పిల్లలకు బాగా ముప్పు ఉంటుందంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చు. ఇలా చెప్పడానికి తగిన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. ‘ద లాన్సెట్‌’ జర్నల్‌ ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘భారత్‌లో చిన్న పిల్లలకు కొవిడ్‌ ముప్పు’ పేరుతో ‘ద లాన్సెట్‌ కొవిడ్‌-19 కమిషన్‌ ఇండియన్‌ టాస్క్‌ఫోర్స్‌’లో భాగంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వివిధ అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Covid: వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌.. భవిష్యత్‌లో ఎలా?

3. రాజ్‌ చెప్పాడనే ‘ఫ్యామిలీమ్యాన్‌’ చేశా!

పెళ్లయ్యాక ఎంతో బిజీ అయ్యానని చెప్పే నటి ప్రియమణి‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌సిరీన్‌తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దాంతోపాటూ మరికొన్ని వెబ్‌సిరీస్‌, రియాలిటీ షోలల్లో మెరిసిన ఈ బెంగళూరు భామ తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా... మా ఆయన ముస్తఫా రాజ్‌ ఈవెంట్‌ ఆర్గనైజర్‌. ఫ్యామిలీమ్యాన్‌ వెబ్‌సిరీస్‌ అవకాశం వచ్చినప్పుడు కూడా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో... తనే ‘ఆ టీం నీతో అంతసేపు మాట్లాడిందంటే నువ్వు నటించాలని వాళ్లు అనుకుంటున్నారు. కాబట్టి ఓకే చెప్పేయ్‌’ అన్నాడు. రాజ్‌ అలా చెప్పడం వల్లే ఆ సిరీస్‌ చేశా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బెయిలిస్తే పారిపోయే అవకాశం

భారత్‌ నుంచి పారిపోయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. బెయిలిస్తే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. డొమినికాలో చోక్సీకి ఎలాంటి మూలాలు లేవని, దేశం విడిచి వెళ్లకుండా అతనిపై షరతులు విధించలేమని, అందువల్ల బెయిలివ్వడం కుదరదని స్పష్టంచేసింది. తన సోదరుడితో కలిసి హోటల్లో ఉంటానన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. హోటల్‌ చిరునామాను నమ్మి బెయిలివ్వడం కుదరదని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చైనా గూఢచారి.. పదేళ్లుగా భారత్‌లోనే!

5. Covaxin: సమర్థత, భద్రతలో కొవాగ్జిన్‌ మేటి

కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా శాస్త్రీయ ప్రమాణాలు, డేటా పారదర్శకంగా ఉన్నాయని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ప్రభావశీలత, భద్రతలో కొవాగ్జిన్‌కు తిరుగులేదని, ఈ విషయాన్ని తొమ్మిది జర్నల్స్‌ శాస్త్రీయంగా సమీక్ష (పీర్‌-రివ్యూ) చేశాయని, ఇందులో లాన్సెట్‌, సెల్‌ప్రెస్‌ లాంటి అంతర్జాతీయ జర్నల్స్‌ ఉన్నాయని పేర్కొంది ‘‘టీకా సమర్థత, భద్రతపై 12 నెలల వ్యవధిలో తొమ్మిది పరిశోధన అధ్యయనాలు వెలువడ్డాయి’’ అని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 48 ఏళ్ల తర్వాత తిరిగిచ్చాడు!

హాయో లైబ్రరీకి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఒక పార్శిల్‌ కవరొచ్చింది. తెరిచి చూస్తే అందులో అమెరికన్‌ సింగర్‌ బాబ్‌ డైలాన్‌ రికార్డు, దాంతోపాటు ఒక ఉత్తరం కనిపించాయి. అది చదివి లైబ్రరీ వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారట. ఎందుకంటే పార్శిల్‌లో వచ్చిన పుస్తకాన్ని హోవార్డ్‌ సైమన్‌ అనే ఆయన 1973లో విద్యార్థిగా ఉన్నప్పుడు తీసుకుని లైబ్రరీకి తిరిగివ్వలేదు. 48 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు... సైమన్‌ ఆ రికార్డును పంపి, ‘ఇన్నాళ్లూ పనిలో పడి ఇవ్వడం మరిచిపోయా’ అని ఉత్తరంలో రాసి దాంతో పాటు జరిమానా కింద 175 డాలర్లు పంపాడట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఎదురు నిలిచారు పులిట్జర్‌ గెలిచారు

7. కింగ్‌ కాదు.. జోకర్‌

జకోవిచ్‌తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీస్‌లో నాదల్‌ తొలి సెట్‌ గెలిచేసరికి రాత్రి 11:30 గంటలు దాటింది. అప్పటికే అర్ధరాత్రి అవుతుండడంతో.. ఎలాగో నాదలే కదా మ్యాచ్‌ గెలిచేదని భావించి చాలామంది టీవీ కట్టేసి నిద్రపోయారు! కానీ తెల్లారాక నాదల్‌ ఎంత తేడాతో గెలిచాడోనని చూసిన అభిమానులకు షాక్‌! ఎందుకంటే గెలిచింది.. జకోవిచ్‌ మరి!  ఫ్రెంచ్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నాదల్‌కు బ్రేక్‌ పడింది. సెమీస్‌లో టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ 3-6, 6-3, 7-6 (7-4), 6-2 తేడాతో మూడో సీడ్‌ నాదల్‌ను ఓడించాడు. ఇప్పటికే 13 సార్లు ట్రోఫీని ముద్దాడి.. సెమీస్‌ చేరిన ప్రతిసారీ విజేతగా నిలిచిన నాదల్‌ జైత్రయాత్రకు ముగింపు పలికిన అసాధారణ విజయమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వేల మంది పెట్టిన పుత్రభిక్ష ఇది

పుట్టుకతోనే అరుదైన వ్యాధి... మూడేళ్లు వచ్చినా, సరిగా నిలుచోలేడు. కూర్చోలేడు. ఏమీ తినలేడు. క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇదీ హైదరాబాద్‌కు చెందిన బాలుడు అయాన్ష్‌ గుప్తా పరిస్థితి. కుమారుడి పరిస్థితి చూసి రెండేళ్లపాటు ఆ తల్లిదండ్రులు ఎంతో యాతన అనుభవించారు. చికిత్సకు ఏకంగా రూ.22 కోట్లు సమకూర్చుకునేందుకు వారు పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రి నుంచి బాధిత బాలుడు అయాన్ష్‌గుప్తాను డిశ్చార్జి చేయించి, ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఆ ఉద్విగ్న భావాల్ని తల్లిదండ్రులు యోగేష్‌ గుప్తా, రూపాల్‌ ‘ఈనాడు’తో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సోనూసూద్‌.. ఇది నీకే సంభవం

9. అయినా... పొట్ట తగ్గలేదు

నాకు ప్రసవమయ్యి పదినెలలు అయ్యింది. సిజేరియన్‌. కానీ ఇప్పటికీ పొట్ట, స్ట్రెచ్‌ మార్క్స్‌ తగ్గలేదు. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి? తొమ్మిదేళ్ల కిందట థైరాయిడ్‌ ఆపరేషన్‌ జరిగింది. ప్రెగ్నెన్సీ టైమ్‌లో టైర్‌ మెడిసిన్‌ వాడా..? జవాబు: కాన్పు తర్వాత పొట్ట పెరగడానికి, స్ట్రెచ్‌ మార్క్స్‌ రావడానికి కారణాలు తెలుసుకుంటే.. అవి తగ్గడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు పొట్టలోని కండరాలు, చర్మం అన్నీ సాగి వదులై, పటుత్వాన్ని కోల్పోతాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10.  ఆటో డెబిట్‌ ఆగుతోంది

కుమార్‌ ఒక చిన్న పరిశ్రమ నిర్వహిస్తూ, మూడేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ వ్యాపారం సరిగా సాగకపోవడంతో గృహరుణానికి నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, గత ఏడాది ఆర్‌బీఐ ఆరు నెలల పాటు రుణ మారటోరియం ప్రకటించడంతో ఎలాగో గండం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత వ్యాపారం కాస్త కుదుటపడటంతో.. ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొవిడ్‌-19 రెండో దశ విజృంభించడంతో మళ్లీ ఆదాయం తగ్గింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఫేమ్‌-2 రాయితీల పెంపు గొప్ప నిర్ణయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని