Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 20/06/2021 08:59 IST

Top Ten News @ 9 AM

1. Corona: కండల వీరుడికీ కరోనా దెబ్బ

‘నేను యువకుడిని.. ఆరోగ్యంగా ఉన్నాను.. నన్ను కరోనా ఏమీ చేయలేదు’ లాంటి అభిప్రాయాలున్నవారు తక్షణం మార్చుకోవాల్సిందే. వైరస్‌ ఎవరినీ ఉపేక్షించదని ఇప్పటికే ఎన్నో ఉదంతాలు తేటతెల్లం చేశాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ బాడీబిల్డర్‌ కరోనా కారణంగా మృత్యుముఖం వరకు వెళ్లి సుదీర్ఘ చికిత్సతో కోలుకున్నారు. ఆ వివరాలను యశోద ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరకంటి శనివారం మీడియాకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిద్రే దివ్యౌషధం!

2. ముంగిట్లో ముంపు ముప్పు

ప్రతిపాదనలకే పరిమితమైన ప్రణాళికలు.. నిధులున్నా పనులు చేయని ఉదాసీనత.. టెండర్లు పూర్తయి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించని నిర్లక్ష్యం.. ఇతరాలకు నిధుల మళ్లింపు.. వాననీటి కాలువలు, వాగులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. వెరసి వానాకాలం వస్తుందంటేనే పట్టణాలు, నగరాల ప్రజలు ముంపు ముప్పుతో వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.. గత ఏడాది హైదరాబాద్, వరంగల్‌లలో వరదల అనుభవం కళ్ల ముందే కదలాడుతున్నా.. అధికారయంత్రాంగంలో మాత్రం అదే ఉదాసీనత కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇక ఉపేక్షించం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తాను స్నేహ హస్తం చాచినా, తెలంగాణ న్యాయబద్ధంగా వెళ్తున్నా... దానికి విరుద్ధంగా ఆ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. శనివారం మంత్రిమండలిలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీరుపై సీఎం మాట్లాడినట్లు సమాచారం. దీనిపై ఇక ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొనట్లు తెలిసింది. పలువురు మంత్రులు కూడా తమ ప్రాంతాల్లోని రైతుల మనోభావాలను వివరించగా, వారితో సీఎం ఏకీభవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అవి అక్రమ ప్రాజెక్టులు

4. Organic Acer: సేంద్రియ పంటలతో... ఏటా మూడున్నర కోట్లు!

వ్యవసాయం అంటే అప్పులూ నష్టాలూ అనుకునే రోజులివి. గట్టిగా వర్షం వచ్చినా అసలు రాకున్నా కూడా రైతుకి మిగిలేవి కన్నీళ్లే. ఒకవేళ సకాలంలో వర్షాలు కురిసి, పంట బాగా పండి, ధర బాగా పలికినప్పుడూ లాభం లక్షల రూపాయలు దాటదు. కానీ దిల్లీకి చెందిన ఇద్దరు యువకులు తమదైన పద్ధతిలో సాగు చేస్తూ ఏటా మూడున్నర కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అదెలానో చూద్దామా..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో 19,230 ఉద్యోగాలిస్తాం

భారత్‌లో 19,230 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా తమ సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని పేర్కొన్నారు. క్లయింట్ల నుంచి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా భారత్‌ వెలుపల 1,941 మందిని తీసుకోనున్నట్లు ఆయన   వివరించారు. ‘2022 కల్లా అమెరికాలో 25,000 మందిని నియమించుకుంటాం. అదనంగా 12,000 కొత్త ఉద్యోగాలివ్వడం ద్వారా అమెరికా నియామకాలను విస్తరిస్తున్నామ’ని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* డిపాజిట్‌ రేట్లను తగ్గిస్తున్నాయ్‌

6. గ్యాస్‌ చేసిన గాయం

విశాఖలో ఏడాది క్రితం జరిగిన ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన అనేక మంది జీవితాల్లో చీకటి నింపింది. లీకైన స్టైరీన్‌ గ్యాస్‌తో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరైతే శరీరంలోని అవయవాలు చెడిపోయి మంచానికే పరిమితమయ్యారు. ఆ బాధితుల్లో ఒకరు వెంకటాద్రి గార్డెన్స్‌కు చెందిన బీవీ కమలాకర్‌ (33). ప్రమాద సమయంలో   స్టైరీన్‌ గ్యాస్‌ను అధికంగా పీల్చడంతో క్రమేణా అది శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెన్నుపూస నుంచి కాళ్లకు వెళ్లే నరాల వ్యవస్థ దెబ్బతింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Corona: కొవిడ్‌తో మెదడులో ‘మ్యాటర్‌’ తగ్గుతోంది

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో మెదడులో గ్రే మ్యాటర్‌ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి స్కాన్లను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ కేవలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కాదని, కొందరిలో ఇది మెదడుపైనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. పక్షవాతం, డిమెన్షియా వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చని అధ్యయనాలు తేల్చాయి. తాజాగా గ్రే మ్యాటర్‌ కూడా తగ్గిపోతోందని వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పొంచి ఉన్న జీవాయుధ ముప్పు

8. ఔరా! మేడ్‌ ఇన్‌ చైనా 

చైనాకు చెందిన ప్రముఖ భవననిర్మాణ సంస్థ ‘బ్రాడ్‌ గ్రూప్‌’ చాంగ్షా నగరంలో కేవలం 28 గంటల 45 నిమిషాల్లో పదంతస్తుల భవనాన్ని చకచకా కట్టేసి అందర్నీ అబ్బురపరిచింది. ఈ నిర్మాణానికి సంబంధించిన అయిదు నిమిషాల నిడివిగల వీడియోను తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ నెల 13న పెట్టింది. నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ పూర్తి అయ్యేవరకు వారు చేసిన పనులు తెలిపేలా ఈ వీడియో రూపొందించారు. ‘అతి తక్కువ సమయంలో భవన నిర్మాణం చేయాలని అనుకున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* స్విస్‌లో 20,700 కోట్లకుపైగా భారతీయుల డబ్బు

9. పరీక్షలకు పచ్చజెండా! 

రాష్ట్రంలోని విద్యాసంస్థలను జులై ఒకటో తేదీ నుంచి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించడంతో పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు సిద్ధమవుతున్నాయి. జేఎన్‌టీయూ, ఉస్మానియా పరిధిలో యూజీ, పీజీ చివరి ఏడాది పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు పూర్తయితే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇబ్బందులు తీరనున్నాయి. విదేశాల్లో ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపు పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించేందుకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సవాలుకు నిలిచారు

సౌథాంప్టన్‌లో టీమ్‌ఇండియాకు సానుకూల ఆరంభం. ప్రతికూల పరిస్థితుల్లో కోహ్లీసేన అచ్చమైన టెస్టు బ్యాటింగ్‌ను చూపించింది. పరిస్థితులకు తనకు తాను గొప్పగా అన్వయించుకుంటూ పదునైన కివీస్‌ పేస్‌కు  ఎదురొడ్డి.. మెరుగైన స్కోరుకు బాటలు వేసుకుంది. న్యూజిలాండేమీ వెనుకబడలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగానికి కళ్లెం వేసిన ఆ జట్టు.. మూడు కీలక వికెట్లు చేజిక్కించుకుంది. మొత్తం మీద మేటి జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగానే మొదలైంది. రెండు జట్లూ గట్టిగానే పోటీలో ఉన్నాయి. మూడో రోజు ఆటే మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత అథ్లెటిక్స్‌లో చిరన్‌జీవి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని