Top Ten News @ 9 AM

తాజా వార్తలు

Updated : 26/06/2021 09:23 IST

Top Ten News @ 9 AM

1. డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

దేశంలో ప్రస్తుతం అత్యధికంగా సంక్రమిస్తున్న డెల్టా రకం కరోనా వైరస్‌తోపాటు ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపైనా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. ‘డెల్టా ప్లస్‌’ రకం వైరస్‌పై వీటి ప్రభావం విషయమై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. దిల్లీలో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల పనితీరును వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమెరికా వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు

అమెరికాలో పైచదువుల కోసం వెళ్లే విద్యార్థులకు వెసులుబాటు లభించింది. వర్సిటీల్లో చేరే గడువు పొడిగించటంతో పాటు జులై వీసా కోటా విడుదల కావటం ఇందుకు నేపథ్యమవుతోంది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు వచ్చే జులై, మరికొన్ని ఆగస్టు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జులై నెలలో హాజరు కావాల్సిన వారి గడువు మరో 25 రోజుల పాటు పొడిగిస్తూ అమెరికా వర్సిటీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఒకరు శుక్రవారం ధ్రువీకరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అమెరికాలోనే నివసించనివ్వండి!

3. కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు

 ‘ఆ స్వామీజీ నా కలల్లోకి వచ్చి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు.. చనిపోయిన నా కుమారుడు నన్ను రక్షించాడు’ అంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో ఔరంగాబాద్‌ జిల్లా పోలీసులకు నోట మాట రాలేదు. లిఖిత పూర్వకంగా మహిళ చేసిన ఫిర్యాదు కావడంతో ఇక తప్పదని సమన్లు పంపి స్వామీజీని రప్పించారు. విచారణలో సరైన ఆధారాలు కనిపించకపోవడంతో విడిచి పెట్టేశారు. ఇంతకూ జరిగిందేమిటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చైనా చెప్పినదానికన్నా ముందే మహమ్మారి ఆరంభం!

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత 2019 డిసెంబరు ఉత్పన్నమైందని చైనా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే దానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి వ్యాప్తి ఆరంభమై ఉండొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ మూలాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 2019 డిసెంబరు మొదట్లో అధికారికంగా మొదటి కేసు నమోదైంది. దానికి ముందే ఈ మహమ్మారి విజృంభణ మొదలై ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మానవ కణాల్లో చురుగ్గా చొరబడేలా..

5. ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారికి 22.5 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో సంచలనం సృష్టించిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు కారణమైన పోలీసు అధికారి డెరిక్‌ చౌవిన్‌కు 270 నెలల(సుమారు ఇరవై రెండున్నర సంవత్సరాలు) జైలు శిక్ష విధిస్తూ అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇప్పటికే చౌవిన్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఈ తీర్పును వెల్లడించింది. గతేడాది మే 25న పోలీసు అధికారి డెరిక్‌ చౌవిన్‌.. జార్జిఫ్లాయిడ్‌ మెడపై మోకాలు మోపి కర్కశంగా హింసించి అతని మరణానికి కారణమైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గృహ యోగం సాకారమిలా..!

అందుబాటు ధరలో ఉన్న ఇళ్లు ఒక పట్టాన నచ్చవు.. నచ్చే వాటి ధరలేమో అందుకునేలా ఉండవు.. ఆదాయం పెరిగాక చూద్దాంలే అనుకుంటే.. ఇళ్ల ధరలు అంతకంటే పైకెక్కి కూర్చుంటాయి. ఎప్పటికైనా సొంతిల్లు కొనగలమా అనే సందేహం వేధిస్తుంటుంది. అదే సమయంలో తక్కువ ఆదాయంతోనూ సొంతింటి కలను నెరవేర్చుకున్నవారిని చూసినప్పుడు మనమూ కొనగలమని ధీమా వస్తుంది. ఒకే ఆదాయం ఉండి కొనగలిగిన వారిలో, కొనలేకపోతున్న వారిలో తేడాలను గమనించి..  పొరపాట్లను సరిచేసుకుంటే సొంతింటి కల సాకారం సాధ్యమే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అల్మారాలు ఏ దిక్కులో ఉండాలి

7. వదలొద్దు అని.. వదిలెళ్లిపోయింది

ఓ సాయంత్రం.. కంప్యూటర్‌ సెంటర్‌కి వెళ్తుంటే అమ్మాయిల గుంపు ఎదురైంది. అందులో ఒకరిపై నా చూపు ఆగింది. విశాలమైన కళ్లు.. నవ్వినప్పుడు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయి. రెప్ప వేయడం మర్చిపోయి తననే చూస్తుండిపోయా. వాళ్లు నన్ను దాటుకొని వెళ్లిపోయినా ఆమె రూపం నా గుండెలో నిలిచింది. పదేపదే గుర్తొస్తుంటే ఆరోజు రాత్రి నా కంటికి నిద్రే కరువైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొవిడ్‌ మృతుల్లో 99% టీకా పొందనివారే

కొవిడ్‌-19 కట్టడికి టీకాలే సమర్థ సాధనాలని మరోసారి రుజువైంది. గత నెలలో అమెరికాలో మరణించిన కరోనా బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్లు పొందనివారేనని తాజా నివేదిక సూచిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) డేటాను విశ్లేషించినప్పుడు ఇది వెల్లడైంది. మే నెలలో అమెరికాలో 18వేలకుపైగా కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయని, అందులో పూర్తిస్థాయిలో టీకా పొందినవారు 150 మంది మాత్రమే ఉన్నారని సదరు నివేదిక పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది!

9. సాధ్యం కాదు

ఎప్పుడో మార్చిలో టెస్టు క్రికెట్‌ ఆడింది టీమ్‌ఇండియా. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో మునిగిపోయారు. ఆ టోర్నీ మధ్యలో ఆగిపోగా.. పెద్దగా ప్రాక్టీస్‌ లేకుండానే న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడాల్సి వచ్చింది. ఈ ప్రాక్టీస్‌ లేమే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ను దెబ్బ తీసిందన్నది స్పష్టం. అయితే కనీసం ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ ముంగిట అయినా భారత్‌కు వార్మప్‌ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మరణమే ఇక శాసనమని..!

చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న ఆ యువతికి తండ్రి, మేనమామలే అమ్మయ్యారు.. ఏలోటూ లేకుండా పెంచి పెద్దదాన్ని చేశారు.. ఓ అయ్యచేతిలో పెట్టి ఇల్లాలిని చేశారు.. ఆ బిడ్డ మరోబిడ్డకు జన్మనిచ్చిందని సంబరపడ్డారు.. కానీ ఆమె కలహాల కాపురంలో నలిగిపోతుందని అనుకోలేదు.. నిత్యం నరకయాతన అనుభవించింది.. బాధలను పంటి బిగువున భరించింది.. గొడవలతో మానసికంగా కుంగిపోయింది.. ఈ కూపం నుంచి బయటపడాలంటే మరణమే ఇక శాసనమని భావించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నా భర్తది ఆత్మహత్య కాదు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని