Top Ten News @ 9 AM
close

తాజా వార్తలు

Published : 22/07/2021 08:57 IST

Top Ten News @ 9 AM

1. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా కేంద్రం!

డేటా కేంద్రాలను హైదరాబాద్‌ పెద్దఎత్తున ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఒక పెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు, అదే బాటలో మరో మూడు ఐటీ కంపెనీలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా రూ.15,000 కోట్ల పెట్టుబడితో దీనిని నెలకొల్పనుందని, సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సాగిస్తున్న సంప్రదింపులు తుది దశకు చేరాయని తెలుస్తోంది.

వరంగల్‌కు ఎగిరిపోవచ్చు

2. AP News: నేడు కోస్తాలో భారీ వర్షాలు!

వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ- 7.6 కి.మీ మధ్య విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల 23న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 

3. నేటి నుంచి కొత్త రుసుములు

రాష్ట్రంలో పెరిగిన భూముల విలువ, కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం నుంచి పెరిగిన విలువలు, ఛార్జీల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్లు చేసేలా ‘కార్డ్‌’ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కొత్త విధానం అమలుపై ఉన్నతాధికారులు సమీక్షించారు. మొదటి రోజు నుంచీ ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు.

4. ప్రైవేటుకు పంపిణీ

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా? లాభాలు తెచ్చిపెట్టే పరిశ్రమలు, వాణిజ్య కేటగిరి, పట్టణ ప్రాంతాల్లోని కనెక్షన్లను ఫ్రాంచైజీలకు అప్పగించనుందా? నష్టాలను మిగిల్చే గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డిస్కంల చేతిలో ఉంచనుందా? కొద్ది రోజులుగా ఇదే పంథాలో కేంద్రం తీసుకుంటున్న చర్యలన్నీ ప్రైవేటీకరణకు సంకేతాలుగా చెబుతున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలు. డిస్కంలను కాపాడుకునేందకు ఆందోళనలకూ సిద్ధమవుతున్నారు.

5. భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

బర్డ్‌ ఫ్లూతో భారత్‌లో తొలి మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో సంబంధిత వైద్యులు, సిబ్బంది స్వీయ ఏకాంతానికి వెళ్లారు. బర్డ్‌ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం దేశంలో ఇదే తొలిసారి. హరియాణాకు చెందిన సుశీల్‌ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా సమస్యలతో ఈ నెల 2న దిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది.

6. వైద్యం, న్యాయశాస్త్రాలు మాతృభాషల్లో బోధించే రోజులు రావాలి

ఇంజినీరింగ్‌, వైద్య, న్యాయశాస్త్రాలను మాతృభాషల్లో బోధించే రోజులు రావాలన్నదే తన కల అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మాతృభాషల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు ప్రారంభించిన 8 రాష్ట్రాల్లోని 14 కాలేజీలకు ఆయన అభినందనలు తెలిపారు. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సులు నిర్వహించే మరిన్ని కళాశాలలు ఈ దిశలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయభాషల్లో ఇలాంటి కోర్సులు నిర్వహించడం విద్యార్థుల పాలిట వరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

7. మరణాలు తగ్గినా... జాగ్రత్తలు మరవొద్దు

దేశంలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టినా, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. కొవిడ్‌ టీకాలను విస్తృతంగా అందిస్తుండటంతో గత ఆరు నెలల్లో మరణాలు 90% తగ్గాయన్నారు. అయితే... శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

8. బెంజ్‌ కారు కావాలా నాయనా..

ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు వరుస కట్టడంతో, బాగా పనిచేసే నిపుణులను అట్టేపెట్టుకునేందుకు కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో, ఇంటి నుంచి పనిచేసే వారే అత్యధికంగా ఉన్నందున, వారిని అనుక్షణం కనిపెట్టుకుని ఉండటమే కాక, కంపెనీని వీడకుండా చూడటంలో మానవ వనరుల విభాగాలు శ్రమిస్తున్నాయి. ప్రతిభావంతులకు హెచ్‌సీఎల్‌ టెక్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఇస్తామంటుంటే, వేతన పెంపు, పదోన్నతులు, బోనస్‌లను టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో ప్రకటించాయి.

9. కథలు.. కథలుగా చెప్పాలని..!

‘సూటిగా చెప్పు.. సుత్తి లేకుండా’.. - సినిమాల విషయంలో చిత్ర పరిశ్రమ అనాదిగా అనుసరిస్తున్న సూత్రమిది. ఏ మాత్రం నిడివి పెరిగినా.. ఎడిటర్లు తమ కత్తెరకు పని చెప్పి చిత్రాల్ని కుదించేవారు. అయితే ‘బాహుబలి’ రెండు భాగాల ట్రెండ్‌కు ఊపిరిలూదింది. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఆసక్తికర కథల్ని ఇప్పుడు భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్మాతలకూ లాభదాయకంగా ఉండటంతో.. చిత్రసీమలో ఈ ఫార్ములాకి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది.

Sarpatta Review: రివ్యూ: సార్పట్ట

10. సింధు స్వర్ణం సాధించొచ్చు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తుందని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆశాభావం వ్యక్తంజేశాడు. బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం ఫేవరెట్లలో ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు కచ్చితంగా ఒకరని గోపీచంద్‌ అన్నాడు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్‌, ధ్యాన సంస్థలు.. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు మెడిటేషన్‌ ద్వారా మానసిక ఒత్తిడిని జయించడం, భావోద్వేగాలను అదుపు చేయడంపై సహకారం అందించనున్నట్లు బుధవారం వర్చువల్‌ కార్యక్రమంలో ప్రకటించాయి. 

ఆ సందడి లేకుండానే..
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని