Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 26/07/2021 08:59 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రూ.2 వేల కోట్లిస్తే ఎమ్మెల్యే సీటు వదులుకుంటా

మునుగోడు నియోజకవర్గానికి రూ.2,000 కోట్లు ఇస్తానంటే తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం ప్రకటించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు పథకం వర్తింపజేస్తామని తొలుత చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లో మాత్రం రూ.2 వేల కోట్లు వెచ్చించి ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామంటున్నారు. కేసీఆర్‌కు రాజకీయమే ముఖ్యం’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇది మామూలు వంతెన కాదు!

ది ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్‌ స్టీల్‌ వంతెన. నెదర్లాండ్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డాంలో ఉన్న పురాతన కాలువ మీద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వంతెనను నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సంస్థ జులై 18న అందుబాటులోకి తీసుకు వచ్చింది. అన్నట్టు 4500 కిలోల బరువు, 12 మీటర్ల పొడవుండే ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేశాయి. దీన్ని చేయడానికి 6 నెలలు పట్టిందట. ఆ తర్వాత పడవ సాయంతో తీసుకువచ్చి, క్రేన్‌తో ఈ కాలువ మీద ఉంచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు పిలుపు

 కొవిడ్‌-19 రెండోదశ తగ్గుతుండటంతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ నియామకాల సందడి మొదలైంది. నియామకాలపై ఈ ఏడాది మొదట్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా.. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. విప్రో సంస్థ గతంలో పరీక్ష రాసి, అర్హత సాధించిన వారిని ఇప్పుడు మౌఖిక పరీక్షలకు పిలిచింది. మానవవనరుల అవసరాలు పెరగడంతో గతంలో పరీక్షలో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూలకు పిలిచింది. టీసీఎస్‌ రెండో జాబితాను విడుదల చేసి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శిల్పాలు నాట్యమాడెనిచట..

ఇక్కడి శిల్పాలు రాగాలు వినిపిస్తాయి.. వాటి సోయగాలు వలపులు కురిపిస్తాయి. రుద్రేశ్వరాలయం అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ రామప్ప గుడి అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎవరైనా! సాధారణంగా ఎక్కడైనా ఆలయాలు వాటిలో కొలువైన దేవుడి పేరుతోనే ప్రాచుర్యం పొందుతాయి. ఈ ఆలయం మాత్రం శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందడానికి ఆయన గొప్పతనమే కారణం. గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించాడు. దక్షిణ భారత దేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఏకైక ఆలయం ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రికార్డు బ్రేక్‌

ఆదివారం మహిళల 4×100మీ.  ఫ్రీస్టైల్‌ రిలే ఈత పోటీల్లో ఆస్ట్రేలియా బృందం స్వర్ణం గెలుచుకుంది. కరోనా కారణంగా అథ్లెట్లు ఎవరి పతకాలు వాళ్లే మెడలో వేసుకుంటుండగా.. ఈ ఈవెంట్‌లో భిన్నంగా జరిగింది. స్వర్ణాలు తీసుకున్న కేట్‌ క్యాంప్‌బెల్‌, బ్రాంటె క్యాంప్‌బెల్‌ పరస్పరం ఒకరి మెడలో మరొకరు వేసుకున్నారు. ఇందుక్కారణం వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కావడమే. ఈ స్విమ్మింగ్‌ సిస్టర్స్‌ కలిసి తమ దేశానికి పసిడి రావడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు జీవితకాలం గుర్తుండిపోయే ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తుపాకీ.. ఎంత పని చేశావ్‌!

6. మెరిసేదంతా విషం కావచ్చు!

తాజాగా.. మంచి రంగులో మెరిసిపోతున్న కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారా? అయితే అవి నిజంగా తాజాగా ఉన్నాయా... లేదా రసాయనాలతో నిండిపోయాయా అని ఒక్కసారి ఆలోచించండి! సాధారణంగా ప్రతి మనిషి రోజుకు 350 గ్రాముల కాయగూరలు, వంద గ్రాముల పండ్లు తినాలని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే పండ్లను కార్బైడ్‌ వంటి వాటితో మాగబెడుతున్నారు. తాజాగా కాయగూరల విషయంలోనూ రసాయనాల వినియోగం పెరుగుతుండటంతో ఏం తినాలన్నా ఒకింత ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మిత్రుడే సామాజిక శత్రువు

ఐటీ కొలువు చేస్తూ కూకట్‌పల్లిలో అద్దెకు ఉండే యువతికి ఆమె చిన్ననాటి స్నేహితుడు ఫోన్‌చేసి, తనకు ఉద్యోగం పోయిందని కొద్దిరోజులు ఉండేందుకు ఆశ్రయం కావాలని అభ్యర్థించాడు. ఒకే గ్రామానికి చెందిన వాళ్లు కావటం వల్ల సరేనంది. అతడు స్నేహితురాలు దుస్తులు మార్చుకొనే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేసింది. చుట్టుపక్కల వారు గమనించటంతో ప్రాణాలతో బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ శరణార్థులకు.. సొంత దేశం లేదు.. సాధించే సత్తా ఉంది!

యుద్ధం, మతపరమైన ఆంక్షలు.. ఇలా ఎన్నో కారణాలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు. పక్కదేశంలో తలదాచుకున్నారు. మనుగడే ప్రశ్నార్థకమైన చోట ఆటను ఆసరాగా చేసుకున్నారు. వారంతా శరణార్థి బృందంగా (రెఫ్యూజీ టీమ్‌) ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమూ దక్కించుకున్నారు. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ. కష్టాలను పక్కనపెట్టి చరిత్రలో తమకంటూ ఒక పేజీ లిఖించుకోవడానికి ప్రయత్నిస్తోన్న వారిలో కొందరి స్ఫూర్తి కథనాలివీ! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Tirumala darshan tickets: తిరుమల శ్రీవారి టికెట్లతో వ్యాపారం

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయించి వ్యాపారం చేసిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌పై కేసు నమోదైంది. తితిదే నిఘా అధికారుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన రేవతి ట్రావెల్స్‌ అధిక ధరలకు శ్రీవారి టికెట్లను భక్తులకు అమ్మినట్లు తితిదేకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై తితిదే విజిలెన్స్‌ అధికారుల ఫిర్యాదుమేరకు తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గుణించాలా?తీసివేస్తే సరి!

బ్యాంకు నియామక పరీక్షల్లో, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఏవైనా సంఖ్యలను ‘9’ లేదా ‘99’ తో గుణించమని తరచుగా అడుగుతుంటారు. స్పీడ్‌ మ్యాథ్స్‌ పద్ధతులను నేర్చుకుంటే ఇలాంటి హెచ్చవేతలను వేగంగా, సులువుగా చేయొచ్చు. అలాంటి గుణకార పద్ధతులను ఈ వారం తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని