Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 27/07/2021 09:00 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Tokyo olympics : భారత హాకీ జట్టు ఘన విజయం

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది.  మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. నాలుగో క్వార్టర్‌లో మూడో గోల్‌ చేసి విజయాన్ని అందుకుంది. రూపిందర్‌ పాల్‌ రెండు గోల్స్‌(15 ని, 51 ని)తో అదరగొట్టగా.. 14 వ నిమిషంలో సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మరో గోల్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో భారత్‌కునిరాశ

2. కృష్ణా నదిలో భూప్రకంపనలు

నల్లమల అటవీ ప్రాంతం సోమవారం వేకువజామున ఉలిక్కిపడింది. ఐదు గంటల ప్రాంతంలో నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం సంభవించింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కి.మీ దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కి.మీ దూరంలో కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) వెల్లడించింది. నల్లమల అడవుల్లో 7 కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా ఇంట్లో పనివారంతా గంగిరెడ్డికి తెలుసు

మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి ఇంటి వద్ద పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎర్రగంగిరెడ్డికి తెలుసని ఈ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వివేకా మాజీ డ్రైవరు దస్తగిరి తెలిపారు. పులివెందులలోని తన నివాసంలో దస్తగిరి సోమవారం ‘ఈనాడు’తో మాట్లాడారు. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు త్వరలో పూర్తవుతుందని, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆపాలంటూ కోర్టును ఆశ్రయిస్తారా అని అడగ్గా.. తనను ఎందుకు జైలుకు పంపిస్తారని ఎదురు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Vijay Mallya: విజయ్‌ మాల్యా దివాలాదారే.. లండన్‌ హైకోర్టు తీర్పు

4. లైసెన్స్‌ ఉంది.. డ్రైవింగే తెలియదు

లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరం. లైసెన్స్‌ ఉండీ వాహనాన్ని ఎలా నడపాలో తెలియకపోవడం ఘోరం. అదే ఇప్పుడు ప్రాణాంతకమవుతోంది. వాహనం నడపడంపై సరైన అవగాహన లేకుండానే రోడ్డెక్కుతున్న వారు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాష్ట్రంలో ఏడాదికి సగటున 20 వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా దాదాపు 7 వేల మంది వరకూ మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహన చోదకులకు డ్రైవింగ్‌పై ఉన్న అవగాహన గురించి తెలుసుకునేందుకు పోలీస్‌ శాఖ నడుం బిగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికా కాదు కెనడా!

దేశీ చదువులకు భారతీయ విద్యార్థుల తొలి గమ్యస్థానం ఏది? అని అడిగితే అమెరికా అని ఠక్కున సమాధానం ఇవ్వకండి. ఇప్పుడు ఆ స్థానాన్ని కెనడా ఆక్రమించింది మరి.. కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు అదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకూ అమెరికాలో భారతీయ విద్యార్థులు 2,11,930 మంది ఉండగా.. కెనడాలో ఆ సంఖ్య 2,15,720గా ఉన్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Engineering seats: 5.62 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు హుష్‌

6. ఎగిరే యంత్రాలతో ఎన్నో లాభాలు

గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటివచ్చే డ్రోన్లతో దేశభద్రతకు ప్రమాదం పొంచి ఉందన్నది నిర్వివాదాంశం. అటువంటి వాటిని కచ్చితంగా అడ్డుకోవాల్సిందే. అదే సమయంలో సామాజిక అవసరాల కోసం ఆ ఎగిరే బుల్లి యంత్రాలను సద్వినియోగం చేసుకోవడమూ అంతే అవసరం. కరోనా మహమ్మారితో అన్ని రంగాలూ దెబ్బతిన్న పరిస్థితుల్లో వస్తు రవాణా, వైద్య సేవలకు డ్రోన్ల సాంకేతికత బాగా అక్కరకొస్తుంది. వీటిని సమర్థంగా వినియోగించుకోవడంపై సౌదీ అరేబియా వంటి దేశాలు దృష్టి సారించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాలేయానికి వైరస్‌ ఘాతం

హెపటైటిస్‌కు కాలాలు, దేశాలు, పరిస్థితులు.. దేనితోనూ నిమిత్తం లేదు.  తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎవరికైనా సంక్రమిస్తుంది. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ ప్రతి 30 సెకండ్లకు ఒకరు హెపటైటిస్‌ సంబంధ జబ్బుతో మరణిస్తున్నారు! కాబట్టే ‘హెపటైటిస్‌ కాంట్‌ వెయిట్‌’ అని వరల్డ్‌ హెపటైటిస్‌ డే నినదిస్తోంది. దీన్ని ఎదుర్కోవటానికి ఏమాత్రం ఆలస్యం తగదని అప్రమత్తం చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏంటీ గుండె దడ?

8. Corona: ఎన్ని కరోనాలున్నా.. ఒకటే మందు

అన్ని రకాల కరోనా వైరస్‌లపై పనిచేసే ఔషధాల తయారీ దిశగా కెనడా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వైరస్‌ ప్రొటీన్‌లలో కాలపరీక్షలకు తట్టుకొని నిలబడ్డ ‘డ్రగ్‌ బైండింగ్‌ పాకెట్ల’ను వారు గుర్తించారు. వీటిని లక్ష్యంగా చేసుకుంటూ మందులను ప్రయోగించొచ్చని తెలిపారు. టీకాలను తట్టుకొని నిలబడే వైరస్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందువల్ల కరోనాలోని అన్ని రకాలపై పనిచేసే చికిత్సలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యంగా మారింది. 27 కరోనా వైరస్‌ జాతులు, కొవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన వేల నమూనాల్లోని వైరల్‌ ప్రొటీన్లను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. AP News: తొలి రాత్రి నుంచి వింత ప్రవర్తన, విచిత్ర ధోరణి

 చూడటానికి చక్కగా ఉన్నాడు. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అంటూ మాయ మాటలు చెప్పి సంసారానికి పనికిరాని వ్యక్తితో వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ బాధిత యువతి సోమవారం పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన ఓ మహిళ తాడేపల్లిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తోంది. తన కుమారుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన యువతితో మే 26న వివాహం జరిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చస్తేనే పరిహారం ఇస్తారా?

10. ఆ బాణాలకు తిరుగుండదు

ఒలింపిక్స్‌లో ఆధునిక ఆర్చరీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ దేశానిదే ఆధిపత్యం.. విశ్వ క్రీడల్లో ఆ ఆర్చర్లు అడుగుపెడుతున్నారంటే ఇక ప్రత్యర్థులు పసిడిపై ఆశ వదులుకోవాల్సిందే! ఆ బాణాలకు ఎదురుండదు.. వాళ్ల గురికి తిరుగుండదు.. ఎప్పుడు ఒలింపిక్స్‌ వచ్చినా వాళ్లదే జోరు. వాళ్లే.. దక్షిణ కొరియా ఆర్చర్లు. విలువిద్యలో పతకాల పంట పండించడమే వాళ్ల అలవాటు. ఇప్పుడు టోక్యో క్రీడల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని