Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 28/07/2021 08:58 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. వ్యాపారం ఇక్కడ.. జీఎస్టీ అక్కడ!

తెలంగాణకు రావాల్సిన వందల కోట్ల రూపాయల జీఎస్టీ (వస్తు సేవాపన్ను) ఇతర రాష్ట్రాల ఖాతాల్లోకి చేరుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంతో రాష్ట్రం వందల కోట్ల రూపాయలను నష్టపోతోంది. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో చేస్తున్న వ్యాపారం, అందిస్తున్న సేవలకు సంబంధించిన కోట్ల రూపాయల పన్ను ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఖజానాల్లో పడుతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉత్పాదక రాష్ట్రానికి కాకుండా వినియోగ రాష్ట్రానికి పన్ను జమ అయ్యేలా జీఎస్టీ చట్టంలో మార్పులు చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే కొత్త పన్నులు

2. Covid Vaccine: అతి త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకా!

 పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం తెలిపారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడించారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 18, అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. కాగా 12-18 ఏళ్ల వారికి జులై ఆఖరు లేదా ఆగస్టులో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావచ్చని ఇటీవల కొవిడ్‌-19 జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.ఆరోడా తెలిపిన సంగతి తెలిసిందే.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇదట.. ఆలియా రహస్యం!

3. రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నా!

‘‘ఒక నటి ముందడుగు వేయడానికి కాస్త ప్రోత్సాహం చాలు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు నాపైన ఎంతో ప్రేమని ప్రదర్శిస్తుంటారు. హైదరాబాద్‌ ఎప్పుడూ నా రెండో ఇల్లు అని భావిస్తుంటా’’ అంటోంది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌.   కన్నుకొట్టే వీడియోతో సంచలనం సృష్టించిన ఆమె ప్రపంచం మొత్తానికీ  పరిచయం. తెలుగులో ‘లవర్స్‌డే’, ‘చెక్‌’ చిత్రాలతో సందడి చేసింది. ఇటీవల ‘ఇష్క్‌’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. RS Praveen kumar: బహుజన్‌ సమాజ్‌ పార్టీలోకి ప్రవీణ్‌కుమార్‌!

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బహుజన్‌ సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. వచ్చే నెల 8న నల్గొండలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో ఆయన పార్టీలో చేరతారు. కార్యక్రమానికి గురుకులాల మాజీ విద్యార్థులు (స్వేరోస్‌), మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం ఆయన స్వేరోస్‌తో పాటు ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చిన్న దేశం.. పెద్ద పతకం

ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే.. మన నగరాల కంటే తక్కువ జనాభా ఉన్న కొన్ని దేశాలు మాత్రం బంగారు పతకాలు పట్టేస్తున్నాయి. టోక్యో క్రీడల్లో పతకాలతో సత్తాచాటుతున్నాయి. ఒలింపిక్స్‌లో తొలి పసిడి పతకంతో బెర్ముడా  మెరిసింది. ఇస్తోనియా కూడా మంగళవారం పోడియంపై స్వర్ణంతో సగర్వంగా నిలబడింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ ఒలింపిక్స్‌ ప్రత్యేకం!

6. Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌ ప్రాంతంలో లఖ్‌నవూ- అయోధ్య జాతీయ రహదారిపై డబుల్‌ డెక్కర్‌ బస్‌-ట్రక్కు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి  ఈ ఘటన చోటు చేసుకొంది. హరియాణా నుంచి బిహార్‌ వెళ్తున్న బస్సులో ఉన్న 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన వివరాలు తెలియాల్సి ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎగతాళిని ఎదిరించి.. ఎదిగింది!

పదేళ్ల వరకూ ఆ అమ్మాయీ అందరిలానే ఉంది. ఆడుతూ పాడుతూ సాగుతున్న బాల్యంలో మార్పులు మొదలయ్యాయి. దాంతో కుంగుబాటుకు గురైంది. కానీ ఆమె అంతటితో ఆగిపోలేదు. అవరోధంగా భావించిన దాన్నే గుర్తింపుగా మార్చుకుంది. ఇంతకీ ఎవరామె? ఏమా కథ? హర్విందర్‌ కౌర్‌ నాలుగో తరగతి వరకూ తోటి పిల్లతోపాటుగానే ఎదిగింది. ఆపై ఎత్తు పెరగడం ఆగిపోయింది. స్కూల్లో అందరూ ఏడిపించడం ప్రారంభించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సారూ.. మేమెక్కడ చదువుకోవాలి?

8. అర్ధరాత్రి దేవినేని ఉమా అరెస్టు

కృష్ణా జిల్లాలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లింది. ఈ దాడిలో ఓ తెదేపా నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉమా కారు అద్దాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ తెదేపా ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బుద్ధి మారని డ్రాగన్‌

భారత్‌-చైనా సంబంధాల్లో అపనమ్మకం పెరిగిపోయింది. కేవలం ప్రత్యర్థి చేతులు కట్టేసి లబ్ధి పొందేందుకే ఒప్పందాలు చేసుకొన్నట్లు డ్రాగన్‌ ప్రవర్తిస్తోంది. ఈ తీరుతో వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సరిహద్దు వివాదాన్ని బూచిగా చూపించి భవిష్యత్తులో భారత్‌ను లొంగదీసుకోవాలనే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. ఫలితంగా లద్దాఖ్‌ వద్ద కమ్ముకొన్న యుద్ధమేఘాలు ఏడాది దాటినా వీగిపోలేదు. ఈ సంక్షోభం రెండో శీతాకాలాన్ని చూసేందుకు సిద్ధమవుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఈ పాపం బ్రిటిష్‌ పుణ్యమే!

10. అంకురాలకు భారీగా రాయితీలు

తెలంగాణలో ఆవిష్కరణల విధానం (ఇన్నోవేషన్‌ పాలసీ) కింద అంకుర పరిశ్రమలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలకు, మహిళల నాయకత్వంలోని వాటికి కూడా ఇవి వర్తిస్తాయి. రాష్ట్ర ఆవిష్కరణల విభాగం దీనికి నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ‘‘అంకుర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ఇక్కడే ప్రారంభం కావాలి. ఉద్యోగాల్లో 50 శాతం మంది స్థానికులు ఉండాలి. ఆవిర్భావం నుంచి సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.వంద కోట్లకు మించరాదు’’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని