Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 17/09/2021 09:16 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కలవరపెడుతున్న మరో ఉపద్రవం

ణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు... ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్‌ సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో ఒకటి కావచ్చనే అనుమానాలు ఓ పక్క పీడిస్తున్నాయి. ఇంకోపక్క మరో కొత్త విపత్తు పొంచి ఉందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ‘హవానా సిండ్రోమ్‌’ పేరిట వెలుగులోకి వచ్చిన కొత్త తరహా రుగ్మత అందరిలో ఆందోళన పెంచుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎందుకీ నిర్ణయం

కోహ్లి వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. ఇటీవల ఒక రోజంతా జోరుగా ప్రచారం సాగిన వార్త ఇది. కానీ ఆ వదంతుల్ని బీసీసీఐ కొట్టి పారేసింది. కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు కోహ్లి. మరి విరాట్‌ ఈ నిర్ణయానికి ఎందుకొచ్చాడు..? ఇప్పుడే ఎందుకీ నిర్ణయాన్ని ప్రకటించాడు..?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Saidabad: పారిపోయేందుకు ఆటో చోరీచేద్దామనుకున్నా..

నిందితుడు రాజు ఎల్బీనగర్‌లో ఓ ఆటోను దొంగిలించి అందులోనే పారిపోవాలని భావించాడు. టీ తాగేందుకు వెళ్లిన ఆటో యజమాని రావడంతో పథకం పారలేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈనెల 11న రాజు పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఆటోలో వెనుక భాగంలో కూర్చున్నట్లు గుర్తించారు. యజమాని లేకపోవడంతో ముందుకొచ్చి ఆటోను స్టార్ట్‌ చేసేందుకు యత్నించినట్లు కనిపించింది. అది చూసిన యజమాని అక్కడికొచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీసి రాజు దగ్గరున్న సంచిని పరిశీలించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భయం.. ఒత్తిడి.. ఆత్మహత్య...

4. ఐఫోన్‌ 13పై ఇన్‌గ్రామ్‌ మైక్రో ఆఫర్లు

యాపిల్‌ ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లపై అధీకృత రిటైలర్‌ ఇన్‌గ్రామ్‌ మైక్రో రాయితీలు ప్రకటించింది. దేశీయంగా ఐఫోన్‌ 13 ముందస్తు బుకింగ్‌లు శుక్రవారం (ఈ నెల 17న) ప్రారంభం కానున్నాయి. రిటైల్‌ విక్రయాలు 24 నుంచి మొదలవుతాయి. తాజా ఉత్పత్తులపై ఆఫర్లు అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇతర భాగస్వాములతో ఇన్‌గ్రామ్‌ మైక్రో జట్టు కట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఈఎంఐ లావాదేవీలు లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో సాధారణ కొనుగోళ్ల ద్వారా ..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. శ్రీవారి భక్తుల్లో గుబులు!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన తితిదే ధర్మకర్తల మండలి జాబితా.. సామాన్య భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమైందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 81 మందిని నియమించడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒకే జట్టుగా టెలికాం!

నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో దేశీయ టెలికాం సంస్థలన్నీ జట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తానని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ పేర్కొన్నారు. ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగం కోసం ప్రభుత్వం బుధవారం పలు సంస్కరణలను ప్రకటించిన మరుసటి రోజే మిత్తల్‌ పై విధంగా స్పందించారు. బుధవారమే వొడాఫోన్‌ అధిపతి నిక్‌ రీడ్‌తో మాట్లాడానని.. త్వరలోనే రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీతోనూ చర్చిస్తానని పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫలించని నిజాం వేట!

‘ఆపరేషన్‌ పోలో’, ఆపరేషన్‌ క్యాటర్‌ పిల్లర్‌... హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయటానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు పెట్టిన పేర్లివి! సరిగ్గా 109 గంటల్లో భారత సేన విజయం సాధించింది. అయితే మైదానంలో పోరు కంటే కూడా తెరవెనక తీవ్రమైన దౌత్య యుద్ధమే జరిగింది. భారత్‌ చకచకా పావులు కదపకపోయుంటే ఆపరేషన్‌ పోలో కాస్త సుదీర్ఘంగా సాగేదే!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గృహరుణం.. వాయిదాల చెల్లింపు... మీకు నచ్చేలా

గత కొంతకాలంగా మహమ్మారితో అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటున్నా.. సొంతింటి కలను నిజం చేసుకుంటున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నో నెలలు ఆలోచించి, అవసరమైన నిధులను సమకూర్చుకొని, ఇంటి గురించి శోధించి.. రుణం తీసుకొని... ఇలా సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో ఎన్నో దశలుంటాయి. రుణం తీసుకునేటప్పుడు అవసరం ఎంత... ఎలా తీరుస్తాం అనేది ఆలోచించుకోవాల్సిందే. కేవలం వడ్డీ, ఇతర రుసుములను చూడటమే కాదు..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఓటీఎస్‌ పథకం పేదలపై భారమే

9. అలకబూనిన బరాదర్‌!

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అఫ్గానిస్థాన్‌ను మళ్లీ తమ వశం చేసుకున్న తాలిబన్లు ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తాత్కాలిక కేబినెట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ ఘర్షణ మరింత పెరిగినట్లు సమాచారం. 1990ల్లో అధికారంలో ఉన్నప్పుడు అఫ్గాన్‌లో తాలిబన్లు అరాచక పాలన సాగించారు. ఈ దఫా అలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించబోమని ఇటీవల దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత హామీలిచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Cash Deposit: ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు

విద్యార్థుల బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం ఉంటుంది? రూ.పదివేలో లేక రూ.ఇరవై వేలో ఉంటుందని భావిస్తాం కదా? అలాంటిది బిహార్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థుల ఖాతాల్లో ఏకంగా రూ.960 కోట్లు జమయ్యాయి. కటిహార్‌ జిల్లా బగౌరా పంచాయతీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన విద్యార్థులు.. గురుచంద్ర విశ్వాస్‌, అసిత్‌ కుమార్‌లకు ఉత్తర్‌ బిహార్‌ గ్రామీణ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. పాఠశాల ఏకరూప దుస్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని