Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/09/2021 08:57 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రైతు ఆదాయం రోజు కూలి కన్నా తక్కువ!

ఆరుగాలం శ్రమ... బండెడు చాకిరీ... ఆదాయం చూస్తే అరకొర. భూమినే నమ్ముకుని ఏటికేడూ పట్టు వదలక సాగు చేస్తే వారికి దక్కేదెంతో తెలుసా? రోజు కూలి కంటే తక్కువ. కనీస ధర లభించకపోయినా.. గత్యంతరం లేక... భవిష్యత్తుపై ఆశతో మళ్లీ మళ్లీ పంటలు వేసే రైతులు చివరకు గిట్టుబాటు కాక అప్పుల పాలవుతున్నారు. కొండంత కష్టపడినా వారికి దక్కేది గోరంతే. హెక్టారు (2.50 ఎకరాల్లోపు) భూమి ఉన్న రైతు కుటుంబానికి రోజుకు సగటున రూ.224 మాత్రమే ఆదాయం వస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

దత్తత నిబంధనల్లో మార్పులు

2. గాలి ద్వారా వ్యాపించేలా కరోనా రూపాంతరం

కరోనాలో కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్‌ బారినపడిన వ్యక్తులు.. సాధారణ రకంతో పోలిస్తే 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరల్‌ రేణువులను గాల్లోకి వెదజల్లుతారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖానికి సరిగా అమరని వస్త్ర, సర్జికల్‌ మాస్కుల వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి సగం మేర మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జైల్లో.. నరకం చూపించారు..!

‘అతనేమన్నా పేదింట పుట్టాడా... తండ్రి పంచన పార్టీ పదవులు చేపట్టి పెద్దాయన పోయాక ముఖ్యమంత్రి అయ్యాడు’ అంటూ ఒక్క మాటలో కొట్టిపారేయొచ్చు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రస్థానాన్ని ఎవరైనా. అదే నిజమైతే... సీఎం పదవి చేపట్టిన మూణ్ణెల్లకే దేశంలోనే ‘ది బెస్ట్‌’ ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకునేవారు కాదు స్టాలిన్‌. జీవితంలో ఎంతో పోరాడినవాళ్లకి తప్ప అందరికీ అలాంటి ప్రశంసలూ ప్రఖ్యాతీ దక్కవు. స్టాలిన్‌ సాగించిన ఆ పోరాటాల ప్రస్థానమిది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్‌

4. తెల్లవారి గుండెల్లో చపాతీ గుబులు!

ప్రముఖులు, సామాన్యులు, రాజులు, రాణులు... ఇలా ఎంతో మంది జాతీయోద్యమంలో తమ పాత్ర పోషించారు. వీరందరితో పాటు సామాన్యుడి భోజనమైన ‘చపాతీ’ సైతం తెల్లదొరలను గడగడలాడించింది! స్వాతంత్య్ర సమరంలో తనదైన ముద్రవేసింది. సిపాయిల తిరుగుబాటు (1857)కు కొద్దికాలం ముందే ప్రజల్లో ఒకరకమైన అశాంతి! యావద్దేశంలో అసహనం! ఎదురు తిరగాలనే ఆలోచనలు వినిపిస్తున్న దశ! దీన్ని ఈస్టిండియా కంపెనీ అధికారులు కూడా కనిపెట్టారు. కానీ ఆ తిరుగుబాటు ఎలా ఆరంభమవుతుందో అర్థం కాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్‌బ్లాగ్‌ కోసం 👆 క్లిక్‌ చేయండి

5. అవే రైళ్లు.. ప్రత్యేక బాదుడు

దేశంలో విమానాలు, బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. రైల్వేశాఖ సైతం ఏసీ, సూపర్‌ఫాస్ట్‌, ప్యాసింజర్‌, ఎంఎంటీఎస్‌.. ఇలా అన్ని రైళ్లనూ దశలవారీగా పట్టాలెక్కించింది. కొవిడ్‌కు ముందు ద.మ.రైల్వే నుంచి 196 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు 195 తిరుగుతున్నాయి. జోన్‌ మీదుగా గతంలో 100 రైళ్లు తిరిగేవి. ఇప్పుడు 83 ప్రయాణిస్తున్నాయి. వీటిని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లుగానే నడుపుతోంది తప్ప రెగ్యులర్‌గా మార్చలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లాటరీ విధానంలోనే హెచ్‌1-బి వీసాల ఎంపిక

6. మెరుపులు మళ్లీ మొదలు

ధనాధన్‌ బ్యాటింగ్‌.. పదునైన బౌలింగ్‌.. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు.. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. అలవోకగా స్టాండ్స్‌లో పడే బంతులు.. ఇలా మళ్లీ బౌండరీల జోరును.. వికెట్ల వేటను ఆస్వాదిస్తూ సంబరాల్లో మునిగిపోయేందుకు సిద్ధమైపోండి. ఎందుకంటే.. ఎన్నో సందేహాలను, అడ్డంకులను దాటుకుని ఐపీఎల్‌ 14వ సీజన్‌ మళ్లీ అభిమానులను అలరించేందుకు వచ్చేసింది. కరోనా కారణంగా మేలో భారత్‌లో అర్ధంతరంగా ఆగిపోయిన సీజన్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీఎస్‌ఈ సీట్లు... హాట్‌ కేకులే

కళాశాల ఎక్కడుందో పట్టించుకోలేదు... విద్యా నాణ్యత చూడలేదు... సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచిల్లో సీటు అయితే చాలు... విద్యార్థులు మొదటి ప్రాధాన్యంగా ఎంసెట్‌లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఫలితంగా వాటిల్లో 95.56 శాతం సీట్లు నిండాయి.  రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద కంప్యూటర్‌, ఐటీ బ్రాంచిల్లో మొత్తం 38,796 సీట్లుండగా...వాటిల్లో 37,073 విద్యార్థులకు దక్కాయి. కేవలం 1,723 మిగిలాయి. ఎంసెట్‌ కమిటీ శనివారం మొదటి విడత సీట్లను కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వాహన యంత్ర.. విద్యుత్‌ మంత్ర

ఓ వైపు కొవిడ్‌-19 పరిణామాలు చేసిన గాయాలు... మరోవైపు పర్యావరణ హితమైన విద్యుత్తు వాహనాల వైపు అడుగులు వేయాలనే ప్రణాళికలు.. ఈ నేపథ్యంలో జర్మనీలోని మ్యునిచ్‌లో అంతర్జాతీయ వాహన ప్రదర్శన 2021 జరిగింది. ఈసారి ప్రదర్శనలో విద్యుత్ వాహనాలు, ప్రత్యామ్నాయ రవాణా, కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో అత్యుత్తమైనవని చెబుతున్న 10 కొత్త వాహనాల వివరాలు ఇలా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీఎస్‌టీఆర్‌-3బీని ఒక్క నెల ఆపేసినా జీఎస్‌టీఆర్‌-1 దాఖలుకు వీలుండదు

9. AP News: పిడుగుపడి ఇల్లు దగ్ధం.. కాలిపోయిన రూ.25 లక్షలు

పిడుగుపాటుతో తాటాకిల్లు దగ్ధమై అందులో ఉంచిన రూ.25 లక్షల నగదు కాలిపోయిన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే ఉన్న గడ్డివామి నుంచి మంటలు చెలరేగాయి. ఇంటికి కూడా వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. వీరు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇటీవలే భూమిని అమ్మగా వచ్చిన రూ.25 లక్షల నగదుతో పాటు బంగారం పూర్తిగా కాలిపోయాయని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వైభవంగా బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు.. శోభాయాత్రకు ఖైరతాబాద్‌ వినాయకుడు

భాగ్యనగరంలో ఇవాళ పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. అందులో భాగంగా బాలాపూర్‌ గణేశుడి ఊరేగింపు వైభవంగా కొనసాగుతోంది. భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి నడుమ కార్యక్రమం ముందుకు సాగుతోంది. బాలాపూర్‌లోని ప్రధాన వీధుల్లో గణనాథుడిని ఊరేగిస్తున్నారు. ఊరేగింపు అనంతరం బాలాపూర్‌ ముఖ్య కూడలిలో లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని