Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 20/09/2021 09:00 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. పింఛను పెంచుకోవచ్చు!

ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులకు పింఛను చెల్లించేందుకు ఉద్దేశించిన పథకంలో మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తోంది. జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించి, అందులోని మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత మెరుగైన పింఛను పొందేందుకు వీలుగా సంస్కరణలు చేపట్టాలన్న ఆలోచన సాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. IPL 2021: 140 సాధిస్తే గొప్ప అనుకున్నా.. కానీ..: ధోనీ

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ ప్రారంభమైంది. ఆసక్తిగా సాగిన ముంబయి, చెన్నై పోరులో ధోనీసేన 20 పరుగుల తేడాతో గెలిచింది. ధోనీ మాట్లాడుతూ తాము ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో గౌరవప్రదమైన స్కోర్‌ సాధిస్తే బాగుంటుందని అనుకున్నట్లు చెప్పాడు. అయితే, రుతురాజ్‌, బ్రావో అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఆడారన్నాడు. 140 పరుగులు చేయడమే అత్యద్భుతమని భావిస్తే 156 పరుగులు సాధించామన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* IPL 2021: రుతురాజ్‌ సూపర్‌

3. పరిషత్తు ఏకపక్షమే

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైకాపా అలవోకగా గెలిచింది. 13 జిల్లా పరిషత్తుల్నీ వైకాపానే చేజిక్కించుకోనుంది. ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ భారీ ఎత్తున గెలిచింది. మొత్తం 515 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా ఆదివారం అర్ధరాత్రి వరకూ వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ 462 స్థానాల్ని కైవసం చేసుకుంది. 7,219 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయానికి వైకాపా 5,916 స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.21,500 కోట్ల రుణంపై మరింతగా ఆరా!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.21,500 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థికశాఖ లోతుగా ఆరాతీస్తోందని తెలిసింది. దీనిపై సమగ్ర సమాచారం పంపాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ నియంత్రణ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన తీరు, గ్యారంటీలు, పొందిన రుణాల సమాచారం, ఆ ఏడాది రుణపరిమితిలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రెండేళ్లు... 2,400 సీట్లు

5. చిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది.. ప్రభుత్వాలు ఆదుకోవాలి

‘‘ఎక్కడ ఏ విపత్తు వచ్చినా.. ఏ సమస్యలొచ్చినా ముందుగా స్పందించేది మా చిత్ర పరిశ్రమే. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున సంక్షోభంలో పడిపోయింది. సినిమా వ్యయాలు పెరిగిపోయాయి. ఎక్కడా రాజీ పడే పరిస్థితులు లేవు. అందుకే ఇండస్ట్రీని ఆదుకునేందుకు ముందుకు రావాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని వినమ్రంగా కోరుతున్నా’’ అన్నారు కథానాయకుడు చిరంజీవి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘లవ్‌స్టోరీ’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పిల్లల్లో కొవిడ్‌ తీవ్రత తక్కువ

పిల్లల్లో కొవిడ్‌ వ్యాప్తి, సోకాక తలెత్తే తీవ్రత.. రెండూ తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే.. మొత్తం బాధితుల్లో అయిదేళ్లలోపు చిన్నారులు 1.8 శాతం మాత్రమేనని తేల్చిచెప్పింది. చిన్నారుల్లో తక్కువ కేసులు నమోదవుతుండగా.. వయసు పెరుగుతున్న కొద్దీ కేసుల వృద్ధీ కనిపిస్తోందని విశ్లేషించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

చిన్నారులకు కొవిడ్‌ టీకా

7. అవుతారా.. అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి?

డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఇప్పటికే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు సిద్ధంగా ఉన్నాయి! కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 300 ఏవో పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. విధుల్లో చేరినవారికి రూ.60 వేల వేతనం అందుతుంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 170 కి.మీ. వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి

 దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే పనులు సమీక్షించిన కేంద్ర రహదారులు, రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అక్కడ స్పీడ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయారు. డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న మంత్రి..  పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటూ అకస్మాత్తుగా కారు వేగాన్ని పెంచమని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను కూల్చండి

9. కెప్టెన్‌ తొలగింపుతో సంకేతాలెన్నో!

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అర్ధాంతర నిష్క్రమణ కాంగ్రెస్‌ నేతలకు పలు సంకేతాలు పంపిస్తోంది. ఎమ్మెల్యేలంతా తమకే విధేయులుగా ఉంటారే తప్ప రాష్ట్ర నాయకులకు కాదన్న సందేశాన్ని అధిష్ఠానం వారికి పంపగలిగింది. తమను విస్మరించడంగానీ, తమ మాటను కాదనడంగానీ చేయలేరన్న సూచనలు ఇవ్వగలిగింది. అందుకే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ పంజాబ్‌ విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పేదింటి బిడ్డలు.. బంగారు కొండలు

అమ్మాయిలకు ఆటలేంటి అన్నా... ఆర్థిక ఇబ్బందులు అడ్డంపడినా... క్రీడల్లో తమ ప్రతిభతో రాణించారు ఈ ఇద్దరూ. వారి ఒలింపిక్స్‌ కలలపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది.  దాంతో ఒకరు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరగా, మరొకరి కన్నతండ్రి ఈ వైరస్‌తోనే కన్నుమూశారు.  ఈ పరిస్థితులతో టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. అయినా ఆత్మవిశ్వాసాన్ని వదల్లేదీ యువతులు. తాజాగా హనుమకొండలో జరిగిన 60వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలను పండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎయి‘డెడ్‌’తో ఫీజులుం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని