Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 17/10/2021 09:04 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Sourav Ganguly: అలా ఆడితే మనదే కప్‌: గంగూలీ

భారత క్రికెట్‌ జట్టులో నైపుణ్యానికి కొదవ లేదని.. పరిణతితో ఆడితే కప్‌ మనదేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ‘‘ఏ జట్టయినా సులభంగా ఛాంపియన్‌ అయిపోదు. ఒక టోర్నీలో బరిలో దిగినంత మాత్రాన విజేతగా నిలవలేదు. ఇందుకు పరిణతి ప్రదర్శించాలి. భారత జట్టుకు కూడా ఇదే వర్తిస్తుంది. టీమ్‌ఇండియాలో నైపుణ్యానికి లోటు లేదు. పరుగులు చేసే సామర్థ్యం.. వికెట్లు తీసే సత్తా రెండూ ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌ గెలవాలంటే మానసిక దృఢత్వం అవసరం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* T20 World Cup: ధోని ఉంటే చాలు : విరాట్‌

2. తక్కువ నిర్వహణ కార్లే ‘నడుస్తాయ్‌’

ఇంధన ధరలు గత 15 నెలల్లో 35% మేర ప్రియం కావడంతో వాహన నిర్వహణ వ్యయాలపై ప్రభావం పడుతోంది. అధిక ఇంధన సామర్థ్యం, తక్కువ నిర్వహణ వ్యయాలున్న కార్లపై కొనుగోలుదార్లు ఆసక్తి చూపవచ్చని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ రీసెర్చ్‌ అంటోంది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు విభాగంపై దృష్టి ఉండొచ్చని చెబుతోంది. ‘భారత మార్కెట్లో 70% ప్యాసింజరు వాహనాల ధర రూ.10 లక్షలలోపే ఉంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Sleep: రోజుకి అరగంటే నిద్రపోతాడట!

మనకు రెండు మూడు రోజులు వరుసగా ఓ గంటా రెండు గంటల నిద్ర తగ్గితే ఒంట్లో ఉత్సాహం కూడా తగ్గినట్లనిపిస్తుంది. జపాన్‌కి చెందిన డాయ్‌సుకె హొరి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇతగాడు గత పన్నెండేళ్లుగా రోజుకి కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నాడట. స్థానిక ‘షార్ట్‌ స్లీపర్‌ అసోసియేషన్‌(తక్కువగా నిద్రపోయే సంఘం)’కి ఛైర్మన్‌ అయిన హొరి ఎన్నో ఏళ్లుగా తన నిద్రా సమయాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ చివరికి అరగంటకు తెచ్చాడట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సర్దుకుపోదాం రండి

4. కేంద్రం వైపు.. కృష్ణా బోర్డు చూపు

ఒక రాష్ట్రం ప్రాజెక్టులను స్వాధీనం చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది, కానీ,, నిబంధన పెట్టింది. ఇంకో రాష్ట్రం నుంచి సమాచారం లేదు. దీంతో తదుపరి కార్యాచరణ ఏంటన్నదానిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. వచ్చే వారంలో జల్‌శక్తి అధికారులు కృష్ణా, గోదావరి బోర్డుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అక్టోబరు 14 నుంచి రెండో షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులు బోర్డుల నిర్వహణలోకి రావాల్సి ఉంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Cyber Crime: ఎడారి నేలలో ‘సైబర్‌ పిండారీలు’

అదో దొంగల రాజ్యం.. అరాచకమే అక్కడి రాజ్యాంగం.. ఊళ్లన్నీ నేరగాళ్ల మయం. దేశమంతా వారికి భాండాగారం.. ఫోన్‌ చేసి దోచుకుంటారు. పట్టుకునేందుకు  పోలీసులు వస్తే తుపాకులు ఎక్కుపెడతారు. అక్కడి ఒక్క నేరగాణ్ని పట్టుకోవాలన్నా పోలీసులు యుద్ధానికి వెళ్తున్నట్లుగా సన్నద్ధం కావలసిందే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాలి. చట్టానికి అక్కడ విలువలేదు. పోలీసుల్నే పట్టి బంధించే ఘరానా నేరగాళ్ల స్థావరమది. ‘కాల్‌’ నేరాలకు అదే రాజధాని. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం

అంతరిక్షంలోకి విహారయాత్రలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. సెలవులను ఆస్వాదించడానికి లేదా స్థిరపడటానికి ఇతర గ్రహాలకు వెళ్లే రోజులు భవిష్యత్‌లో రాబోతున్నాయి. అంటే.. అంతరిక్షంలో జీవించడం ఎలా అన్నదానిపై మనం ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే అక్కడ చనిపోతే పరిస్థితి ఏంటి? భూమిపై మరణించాక మానవ దేహం దశలవారీగా కుళ్లిపోతుంది. కానీ రోదసిలో పూర్తిగా కుళ్లిపోదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 12 ఏళ్లు.. 630 కోట్ల కిలోమీటర్లు..

7. మూడేళ్లుగా పనిలేకుండా జీతాలు

వయోజన విద్య విభాగానికి గత మూడున్నర సంవత్సరాలుగా పనిలేకుండా పోయింది. ఆ విభాగం చేపట్టిన ఏకైక కార్యక్రమం సాక్షర భారత్‌ పథకం 2018 మార్చితో ముగిసింది. ఆ తర్వాత మరో పథకాన్ని చేపట్టలేదు. ఫలితంగా రాష్ట్ర కార్యాలయం, జిల్లాల్లోని 51 మంది సిబ్బంది మూడున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్నారు. వారి వేతనాలు, కార్యాలయ ఖర్చుల కోసం మాత్రం ఏటా రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వ్యయమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సరికొత్త పెళ్ళిళ్ల పేరయ్యలు...

పెళ్ళి సంబంధాలు కుదర్చడమనేది ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక కళాత్మకమైన బాధ్యత. ఒకప్పుడు పెళ్ళిళ్ల పేరయ్యలు, కొన్నాళ్లుగా మ్యారేజి బ్యూరోలు నిర్వహిస్తున్న పాత్ర అదే. పూర్వం రాచరిక వ్యవస్థలో శృంగార నాయకులైన ప్రభువులకు అందమైన స్త్రీలతో పొత్తు కుదిర్చేందుకు- విటుడు, విదూషకుడు, చేటుడు, పీఠమర్దుడనే నలుగురు సహాయకులు ఉండేవారని అలంకార శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మధ్యవర్తులకు మంచి మాటకారితనం నేర్పు లోకజ్ఞానం జాణతనం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విప్రో.. విలువల బాటలో 75 ఏళ్లు..!

9. ఒత్తిడిని పోగొట్టుకుంటామిలా..

ఒత్తిడి సామాన్యులకే కాదు... ప్రముఖులకీ - ముఖ్యంగా వెండితెరమీద తళుక్కున మెరిసే హీరోహీరోయిన్లకూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులైతే టెన్షన్‌గా ఉందని బయటకు చెప్పేస్తారు.. కానీ హీరో హీరోయిన్లు అలా చెప్పుకోలేరు కాబట్టి దాన్నుంచి బయటపడేందుకు తమకు నచ్చిన పనులు చేస్తారట. ఇంతకీ ఆ పనులేంటంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. T20 World Cup: ఒమన్‌ జట్టులో కవాడిగూడ క్రికెటర్‌

హైదరాబాద్‌ కవాడిగూడకు చెందిన శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌ ఆదివారం ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 29 ఏళ్ల సందీప్‌.. 2005-08 మధ్య హైదరాబాద్‌ అండర్‌-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డ సందీప్‌.. అక్కడ దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి, జాతీయ జట్టుకు ఆడే అవకాశం అందుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వారెవ్వా ఎంత సులువు!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని