Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 20/10/2021 09:02 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సమర్థ పాలనకు 60 సూత్రాలు

పరిపాలన ప్రక్రియను పదునెక్కించడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) 60 సూత్రాల ప్రణాళికను సిద్ధం చేసింది. అన్ని మంత్రిత్వ శాఖల, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో జరిపిన సుదీర్ఘ సమావేశానంతరం ఈ కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. దీన్ని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాలన సామర్థ్యాన్ని పెంచడం, సివిల్‌ సర్వీసులను మరింత ఆధునికీకరించడం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. AP News: ఏపీ వ్యాప్తంగా తెదేపా నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను  పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తెదేపా నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అల్లరి మూకల విధ్వంసం

3. మహారాజుకూ ప్రవేశం లేదు

భారతీయ సమాజంలో వివక్ష గురించి మాట్లాడే ఆంగ్లేయులు అడుగడుగునా తాము మాత్రం ఆ వివక్షనే పాటించారు. అనేక ప్రదేశాల్లో కుక్కలు, భారతీయులకు ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టి మరీ తమ ఆధిపత్యాన్ని, అనాగరికతను చాటుకున్నారు. చివరకు తమ గవర్నరే ఆశ్చర్యపోయేలా వివక్షను ప్రదర్శించారు. 1913లో ముంబయి గవర్నర్‌గా వచ్చారు లార్డ్‌ వెల్లింగ్డన్‌. లండన్‌ నుంచి ముంబయికి వచ్చే క్రమంలో... ఓడలో ఆయనకు పాటియాలా మహారాజు భూపీందర్‌సింగ్‌తో పరిచయమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. T20 World Cup: ధోని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే..

ధోని ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు ధోనీకి మించిన మెంటార్‌ ఉండడని వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌లో రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 * బరిలోకి రోహిత్‌!

5. Tollywood: విడుదలెప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ దాదాపు అదుపులోకి వచ్చింది. థియేటర్‌ సమస్యలు ఒకొక్కటిగా తొలగుతుండటంతో.. విడుదలకు సిద్ధమైన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ ముందుకు వరుస కడుతున్నాయి. ప్రేక్షకులూ నెమ్మదిగా థియేటర్లకు అలవాటు పడుతుండటంతో.. సినీ వ్యాపారం క్రమంగా జోరందుకుంటోంది.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల సమస్య ఇప్పటికీ కొలిక్కి రాకున్నా..  డిసెంబరు కల్లా అన్ని సమస్యలు తొలగుతాయన్న ఆశాభావం సినీ వర్గాల్లో కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Sleep: హాయిగా నిద్రపోతే పాతిక లక్షలు.. బ్రిటన్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌

‘ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!’ అంటాడు బాపు తీసిన ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ ‘పాతిక లక్షలు వస్తాయి’ అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి పోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం.. విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్‌ చూస్తూ కాలక్షేపం చేయడమే. ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బిల్‌గేట్స్ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు చూస్తారా..!

7. పన్ను ఎగవేతలో పోటాపోటీ

దేశదేశాల్లో ఉత్పత్తి, విక్రయాలు జరిపే బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో సవ్యంగా పన్నులు కట్టకుండా తప్పించుకొంటున్నాయి. దీన్ని నివారించాలని ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)’, జీ20 దేశాలు నిశ్చయించాయి. బహుళజాతి కంపెనీల వ్యాపారంపై అన్ని దేశాలూ కనీసం 15 శాతం అంతర్జాతీయ కార్పొరేట్‌ పన్ను వసూలు చేయాలని అమెరికా చొరవతో 38 దేశాలతో కూడిన ఓఈసీడీ ప్రతిపాదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆడుకోండి ఆండ్రాయిడ్‌తో

మొబైల్‌ ఫోన్ల రంగాన్ని ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కొత్త పుంతలు తొక్కించింది. విడుదలైనప్పట్నుంచీ వినూత్న ఫీచర్లతో ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇటీవలే ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటికీ సరికొత్త ఫోన్లు చాలావరకు ఆండ్రాయిడ్‌ 11తోనే పనిచేస్తున్నాయి. యాపిల్‌ పరికరాలు చేతిలో లేవనే బాధను ఇది చాలావరకు మరిపించింది. ఐఓఎస్‌14 మాదిరిగానే క్విక్‌ సెటింగ్‌ బాక్స్‌, అసిస్టెంట్‌ కృత్రిమ గొంతును మార్చుకోవటం వంటి అధునాతన కంట్రోళ్లతో కట్టి పడేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎయిరిండియా సవాళ్లకు టాటా చెప్పేనా!

9. డ్రాగన్‌కు దీటుగా..!

కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు భారతసైన్యం సిద్ధమైంది. సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా గల్వాన్‌ ఘటన తర్వాత గత సంవత్సర కాలంలో చైనా సరిహద్దుల్లో భారత్‌ తన కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించడానికి అదనంగా సాధన సంపత్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చదువుకోకపోయినా...ఏటా కోటి వ్యాపారం

భర్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు.. ఒక్కొక్కటిగా చుట్టుముట్టినా కుంగిపోలేదామె! ప్రయత్నిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడగలనన్న నమ్మకం ఆమెది. అందుకే ఇత్తడి వస్తువుల తయారీ నేర్చుకుంది. మార్కెటింగ్‌పై అవగాహన తెచ్చుకుంది. ఆధునిక పోకడలకు తగ్గట్టుగా మార్పులు చేస్తూ.. రంగంలో తనదైన ముద్ర వేసింది. ఏటా రూ.కోటికిపైగా సంపాదించే స్థాయికి ఎదిగింది. ఇదంతా ఏమీ చదువుకోకపోయినా ఒక మహిళ సాగించిన విజయప్రస్థానం. ఆమే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అద్దాల సూర్యకళ! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీవితంపై తరుగుతున్న సంతృప్తి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని