close

తాజా వార్తలు

Published : 12/04/2021 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. తిరుపతిలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న బహిరంగసభలో దుండగులు రాళ్లు విసిరారు. కృష్ణాపురం కూడలిలో జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ, యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ఎన్నికల ప్రచార వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు. సభకు పోలీసులు రక్షణ కల్పించలేదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మమత ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం

తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఒకరోజు పాటు ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. ఈరోజు రాత్రి 8 నుంచి 24 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేపట్టవద్దని సూచించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత ప్రాతిపదికన మమతా బెనర్జీ ఓట్లు అడుగుతున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎనిమిదిమందిని కాల్చి చంపాల్సింది..

3. ఏపీలో కరోనా.. 3,263 కొత్త కేసులు

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 33,755 నమూనాలను పరీక్షించగా 3,263 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 654, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,28,664కి చేరింది. వీరిలో 8,98,238 మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాలుగైదు రోజులు వర్షాలే!

గత రెండు, మూడు రోజుల కిందట వరకూ సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కన్నబిడ్డలతో మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సురేంద్రకు వాణి (26)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి భావన (3), అక్షయ (10) ఇద్దరు కుమార్తెలు. సురేంద్ర కొన్నేళ్లుగా గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల వ్యాపారపరంగా దెబ్బతిన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

HYD: మరదలిని చంపి సంపులో పడేశాడు!

6. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్‌చంద్ర

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సునీల్‌ ఆరోడా పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్‌గా ఉన్న సుశీల్‌ చంద్రను కొత్త సీఈసీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుశీల్‌ చంద్ర సీఈసీగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా ఎఫెక్ట్‌: విమానాల్లో ‘భోజనం’పై నిషేధం

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో భోజనసేవలలను నిలిపివేసింది. ఏప్రిల్‌ 15 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో గతేడాది కేంద్రం దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దీపక్‌ మూడు సిక్సులు

14 ఓవర్లకు పంజాబ్‌ 150/2: శ్రేయస్‌ గోపాల్ వేసిన ఈ ఓవర్‌లో దీపక్‌ హుడా(39) చెలరేగిపోయాడు. మొత్తం మూడు సిక్సులు బాది 20 పరుగులు రాబట్టాడు. అంతకుముందు రాహుల్‌(54) సింగిల్‌ తీసిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

9. ఓడిపోయానని భావించిన క్షణమే మలుపుతిరిగింది..

అవసాన దశలో ఉన్న గోడలు..గతుకుల నేల..పైకప్పుగా మారిన టార్పాలిన్ షీట్..ఆ ఆనవాళ్లను చూసే చెప్పొచ్చు. ఆ ఇంట్లో పేదరికం తాండవిస్తోందని. నాన్నది కుట్టుపని.. అమ్మ  రోజూవారీ కూలీ..తనమో నైట్ వాచ్‌మెన్. ఆ కుటుంబం పరిస్థితి ఇలా కొనసాగితే మనం చెప్పుకోవడానికి ఏముండేది కాదు. ‘ఐఐఎం ప్రొఫెసర్ పుట్టింది ఇక్కడే’ అంటూ ఆ కాపలాదారుడు షేర్ చేసుకున్న జీవిత పాఠాలు..ఇప్పుడు నెట్టింట్లో స్ఫూర్తి మంత్రంగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. #ఎన్టీఆర్‌30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్‌

గతకొంతకాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారో ఇప్పుడు ఖరారైపోయింది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో ఉన్న తారక్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రశాంత్‌నీల్‌తో మరొకటి లైన్‌లో ఉంది. దీంతో ఎన్టీఆర్‌ తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తున్నారనే దానిపై ఇంతకాలం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎట్టకేలకు ఈ ఎదురుచూపులకు తెరపడింది. #NTR30 చిత్రం ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్నట్లు ఖరారైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని