Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Updated : 25/04/2021 21:48 IST

Top 10 News @ 9 PM

1. విషమంగా మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్యం

మాజీ ఎంపీ సబ్బంహరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఈ మధ్యే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బంహరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: ఏపీలో ఒక్కరోజే 69 మరణాలు

2. Coronavirus: మరో రెండేళ్లు అప్రమత్తంగా ఉండాలి!

రెండో దశ కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ పూర్తిగా విఫలమైందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మేనేజ్‌మెంట్‌-అహ్మదాబాద్‌(ఐఐఎం-ఏ)లో ప్రముఖ ఆచార్యుడు చిన్మయ్‌ తుంబే తెలిపారు. దీనికి ఆయన రెండు కారణాలను ఎత్తిచూపారు. ఒకటి.. ప్రభుత్వంతో పాటు, ప్రజలు మహమ్మారిని తేలిగ్గా తీసుకున్నారని తెలిపారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని నెలల్లో వైరస్‌ పూర్తిగా నశించిపోతుందని అంతా భావించారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అలా చేస్తేనే ప్రాణాలు కాపాడగలం: ఈటల

కరోనా మొదటి వేవ్‌తో పోల్చితే సెకండ్‌ వేవ్‌ పూర్తి భిన్నంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇంట్లో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా అందరికీ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్లే ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరి కోసం  ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈటల తెలిపారు. వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడటమే మనందరి లక్ష్యంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మానసిక అనారోగ్యానికీ పరిహారం ఇవ్వాల్సిందే

మానసిక అనారోగ్య చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేవని చెప్పింది. పరిహారాన్ని నిరాకరించడం చట్ట లక్ష్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. బీమా సంస్థలు చట్ట ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఐఆర్‌డీఏదేనని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా ఆపేయండి: పళని

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి పెరిగిపోతుండటంతో.. మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత రోజురోజుకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు విషయంలో రాష్ట్రాల మధ్యన పొరపొచ్చాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను తమ అవసరాలు తీరిన తర్వాతనే పొరుగు రాష్ట్రాలకు పంపించాలని భావిస్తున్నాయి. ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాసిన లేఖ ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘జన్‌ కీ బాత్‌’పై మాట్లాడాలి: రాహుల్‌ గాంధీ

6. TS Corona: వైద్య సిబ్బంది భర్తీకి ఆమోదం

తెలంగాణలోని కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న మూడు నెలలపాటు సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో 449 ఉద్యోగాలు భర్తీ చేసుకోడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒప్పంద ప్రాతిపదికన 78 మంది, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 371 మందిని నియమించుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Potti Veeraiah: ఆ మరుగుజ్జు నటుడు ఇకలేరు

సినీ నటుడు పొట్టి వీరయ్య(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. విఠలాచార్య ‘అగ్గిదొర’ చిత్రంతో మరుగుజ్జు నటుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. దాసరి ప్రోత్సాహంతో తాతమనవడు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సునీల్‌ ‘వాతి కమింగ్‌’.. మాళవిక మెరుపులు

8. కొవాగ్జిన్‌ నిల్వ గడువును పెంచేందుకు అనుమతించండి!

తాము దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ నిల్వ గడువు(షెల్ఫ్‌ లైఫ్‌)ను పొడిగించాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌.. భారత ఔషధ నియంత్రణ సంస్థకు లేఖ రాసింది. 2-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద కొవాగ్జిన్‌ను తయారు చేసిన తేదీ నుంచి ఆరు నెలల పాటు నిల్వ చేసేందుకు డీసీజీఐ అనుమతించింది. ఈ ఆరు నెలల నిల్వ గడువును 24 నెలలకు పొడిగించాలని తాజాగా కోరింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను కూడా లేఖతో పాటు సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బెంగళూరును బెంబేలెత్తించిన జడేజా

 చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించడమే కాదు, పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బెంగళూరును బెంబేలెత్తించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ విజయం వైపు పరుగెడుతున్నట్లు అనిపించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ముంబయి ఇండియన్స్‌కు ప్రమాద ఘంటికలు

10. ‘ఇంటికి పోదాం లేవయ్యా..’ కలచివేసిన ఓ భార్య రోదన

కరోనా సోకడం కన్నా.. వైరస్ పట్ల ప్రజల్లో ఉన్న భయమే కొంతమంది ప్రాణాలు తీస్తోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్  మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్  పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం వేచియున్న సమయంలోనే అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఫలితం కోసం గాబరా పడుతూ.. చివరికి కరోనా లేదని తేలినా ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని