Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Updated : 26/04/2021 21:30 IST

Top 10 News @ 9 PM

1. ఏపీ: ఏవేడుకైనా 50 మందికే అనుమతి

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మహమ్మారి నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇకపై రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీ ప్రజలకు ఉచితంగా బియ్యం!

2. ఆక్సిజన్‌ స్టాక్‌ ఉంది.. కానీ రవాణానే సమస్య! 

కరోనా ఉద్ధృతి దేశంలో నానాటికీ పెరిగిపోతుండటంతో కొవిడ్‌ రోగులు ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్నారు. దిల్లీ, ముంబయి సహా దేశంలోని పలుచోట్ల సకాలంలో ఆక్సిజన్‌ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న విషాద ఘటనలు కలిచి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆక్సిజన్‌ నిల్వ సరిపడా ఉందని, రవాణాలోనే సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mask: ఇంట్లో ఉన్నా పెట్టుకోవాల్సిన సమయం! 

కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇంట్లో ఉన్నా మాస్క్‌లు ధరించాల్సిన సమయమిదని తెలిపింది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. మాస్క్‌లు ధరించినప్పుడు వ్యక్తుల మధ్య కొవిడ్‌ వ్యాపించదని పేర్కొంది. ప్రజలు అనవసర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Reliance సాయం: 775 పడకలు ఉచితంగా..!

4. చిన్నారిపై అత్యాచారం..దోషికి 20ఏళ్ల జైలు

చిన్నారిపై అత్యాచారం కేసులో నాంపల్లిలోని మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు, రూ.25వేల జరిమానా విధించింది. ఈ మేరకు దోషి చెన్నయ్యకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబరులో బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై చెన్నయ్య (50)అత్యాచారానికి పాల్పడ్డాడు. బొమ్మలు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో కొత్తగా 9,881 కరోనా కేసులు

ఏపీలో ప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,041 నమూనాలను పరీక్షించగా.. 9,881 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా  కరోనా మహమ్మారితో 51 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Mankind: వారికి రూ.100కోట్లు సాయం

6. Pat Cummins: దాతృత్వంలోనూ ‘స్టార్’‌!

గత గురువారం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటుతో విరుచుకుపడ్డ కోల్‌కతా నైట్‌ రైడర్స్ స్టార్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ క్రికెట్ అభిమానులకు నిజమైన వినోదాన్ని పంచాడు. కమిన్స్‌ బ్యాటుతోనే కాదు.. తన దాతృత్వంతోనూ  భారతీయుల ప్రేమకు పాత్రుడయ్యాడు. కోట్ల మంది భారతీయుల చూపిస్తున్న ప్రేమకు బదులుగా ఏదైనా తిరిగివ్వకపోతే లావైపోతాననుకున్నాడేమో ఏమో? ఆక్సిజన్‌ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సాయం ప్రకటించాడు. పీఎం కేర్స్‌కు 50వేల డాలర్లు విరాళంగా ఇచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వందమంది అతిథులు.. పెళ్లి కొడుకు అరెస్ట్‌

జలంధర్‌లో కొవిడ్‌-19 నిబంధనలను పాటించకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఒక ఆలయంలో జరుగుతున్న రిసెప్షన్‌కి వంద మందికి పైగా అతిథులు పైగా హాజరైనట్లు పోలీసులకు సమాచారం అందింది.  తక్షణమే అక్కడకు చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకును, అతడి తండ్రిని అరెస్టు చేశారు. సదరు వ్యక్తులు వారంతపు కర్ఫ్యూను ఉల్లంఘించారనీ, పైగా కార్యక్రమానకి తమవద్ద నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదనీ, జలంధర్‌ డిప్యూటీ కమీషనర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తల్లిని కడసారి చూసేందుకు.. ఓ యువకుడి సాహసం

8. సామ్‌ సూత్రం.. హిమజ సీక్రెట్‌.. మలైక యోగా

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు- ఆశ, సానుకూల దృక్పథం.. ఈ రెండు మాత్రమే మనకు ఇప్పుడు సహాయం చేయగలవంటోంది నటి సమంత. కొంతమంది ఫేమస్‌ కాకపోయినా గొప్పవాళ్లే అంటూ.. తన తల్లితో దిగిన సెల్ఫీని పంచుకుంది నటి పూనమ్‌కౌర్‌. చంద్రుడి సోదరిని అంటూ నటి శోభిత దూళిపాళ్ల ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Corona: కేటీఆర్‌కు అభ్యర్థనల వెల్లువ

ఆపదలో ఉన్న వారికి చేయూతనిచ్చే మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ వేదికగా సహాయం కోసం అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌ బారినపడి చికిత్స కోసం అవసరమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావాలని, ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదంటూ, ఆక్సిజన్‌ సిలిండర్‌, ప్లాస్మా, ఆఖరికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు సైతం మంత్రి కేటీఆర్‌ను సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉందని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణకు ఆక్సిజన్‌ ట్యాంకర్లు

10. ఆల్‌రౌండర్‌గా ఉండటం చాలా కష్టం: జడేజా

ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక ఆటగాడు రవీంద్ర జడేజా అన్నాడు. ఆదివారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ‘వన్‌ మ్యాన్‌ షో’ చేసిన సంగతి తెలిసిందే. బ్యాట్‌తో 62 పరుగులు, బంతితో మూడు వికెట్లు తీసి ఈ సీజన్‌లో బెంగళూరుకు తొలి షాక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఆల్‌రౌండర్‌గా ఉండటం అంత తేలిక కాదన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని