Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 21/06/2021 20:56 IST

Top Ten News @ 9 PM

1. యాదాద్రి సందర్శనలో సీఎం కేసీఆర్‌
యాదాద్రి  శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. వరంగల్‌ పర్యటన ముగించుకొని హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న ఆయనకు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత సీఎం ఆలయ పనులను పరిశీలించారు. 

TS: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.

2. Ap news: వంశధార రెండు రాష్ట్రాలకు చెరి సగం
నదీ జలాలు, నేరడి ప్రాజెక్టుకు భూసేకరణపై వంశధార ట్రైబ్యునల్‌ ఇవాళ విచారణ జరిపింది. ఈ మేరకు రెండు మధ్యంతర పిటిషన్లపై ఉత్తర్వులు ఇచ్చింది.  ఏపీ కోరినట్లు నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌కు అవసరమైన 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించాలని పేర్కొంది. తగ్గినా, పెరిగినా వంశధార జలాలను 2 రాష్ట్రాలు చెరి సగం వాడుకోవాల్సిందేనని మరోమారు స్పష్టం చేసింది.

విశాఖ తీరప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌

3. ఏపీ అన్యాయం చేస్తే ఊరుకోం: శ్రీనివాస్‌గౌడ్‌

తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారని, అలాగని ఏపీ తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తాము మంచిని కోరుకుంటున్నప్పటికీ ఏపీ పాలకులు మాత్రం గొడవకు సిద్ధమవుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను నెల్లూరు జిల్లాకు తరలించాలని ఏపీ పాలకులు చూస్తు్న్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు

4. AP news: మహిళలకేదీ భద్రత: చంద్రబాబు
ఏపీలో మహిళలకు రియల్ టైం భద్రత కల్పించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగటం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారిక నివాసానికి సమీపంలో సీతానగరం పుష్కర్‌ ఘాట్ వద్ద యువతిపై అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దిశా చట్టం కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారు, 24గంటల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు.

5. Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్ర రద్దు
ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్‌ యాత్ర రద్దైంది. కరోనా మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా యాత్రను రద్దు చేస్తున్నట్టు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా కార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర కోసం ఏప్రిల్‌ 1నుంచి నమోదు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపంతో రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

6. ఏమిటీ డెల్టా ప్లస్‌ వేరియంట్‌? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
కొవిడ్‌-19లో రోజుకో కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో సంభవించిన సెకండ్‌ వేవ్‌ భారీ స్థాయిలో నష్టం కలిగించింది. దీనికి కారణం డెల్టా వేరియంట్‌. చైనా స్ట్రెయిన్‌తో పోలిస్తే దీని వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండడంతో దాదాపు 40 నుంచి 50 శాతం కేసులు ఈ వేరియంట్‌ మూలంగానే వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయన్న సమయంలో కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (B.1.617.2.1) వెలుగుచూసింది.

Thirdwave: సెప్టెంబర్‌-అక్టోబర్‌లో గరిష్ఠస్థాయికి..!

7. Politics: కాంగ్రెసేతర విపక్షాలతో పవార్‌ రేపు భేటీ! 
ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌  కాంగ్రెసేతర విపక్ష పార్టీల నేతలతో మంగళవారం సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపాకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీకి కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ నేపథ్యంలో కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నేతలతో భేటీపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

8. జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సొపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఎదురుకాల్పులు రాత్రంతా కొనసాగాయని కశ్మీర్‌ డీజీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

9. Gold Rate: పెరిగిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇటీవల తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం కాస్త పెరిగింది. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధరపై రూ.250లు పెరగడంతో రూ.46,277కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,027గా ఉంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పుంజుకోవడం, రూపాయి విలువ తగ్గడంతో పసిడి ధర పెరిగినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

10.WTC Final: నాలుగో రోజు ఆట వరుణుడిదే..
టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో రెండు సెషన్ల పాటు ఎదురు చూసినా వాతావరణంలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం మరోసారి మైదాన పరిస్థితులను గమనించిన అంపైర్లు నాలుగో రోజు స్టంప్స్‌ ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని