Top Ten News @ 1 PM

తాజా వార్తలు

Published : 16/07/2021 12:55 IST

Top Ten News @ 1 PM

1. బ్రహ్మంగారి మఠం తీర్మానంపై మధ్యంతర ఉత్తర్వులు

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తాత్కాలిక పీఠాధిపతిగా ప్రత్యేకాధికారిని నియమిస్తూ ధార్మిక పరిషత్‌ చేసిన తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

2. TS News: నిరసన చేపట్టి తీరుతాం: రేవంత్‌

తమ సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, పలువురు నేతలను ముందస్తుగా నిర్బంధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్నా చౌక్‌ నుంచి రాజ్‌భవన్‌కు ప్రదర్శనగా వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. 

3. వైఎస్‌ తెలంగాణ వ్యతిరేకి కాదు: షర్మిల

దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని చెప్పారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ తెలంగాణ వ్యతిరేకి కాదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని చెప్పారు.

AP News: ‘ఛార్జిషీట్ల లెక్కలో మీరే గొప్ప’

4. Corona: 100 రోజుల కనిష్ఠానికి మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు తగ్గగా.. మరణాలు సుమారు 100 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. గురువారం 19,55,910 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..38,949 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 6.8 శాతం తగ్గుదల నమోదైంది. 24 గంటల వ్యవధిలో మరో 542 మంది ప్రాణాలు కోల్పోయారు. 

5. Corona: 6 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ

కరోనా కేసులు ఎక్కువగా ఉంటున్న ఆంధప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎంలు జగన్‌ మోహన్‌రెడ్డి, పినరయి విజయన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, నవీన్‌ పట్నాయక్‌, యడియూరప్ప, స్టాలిన్‌లతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్‌ పరిస్థితులపై సీఎంలతో మోదీ చర్చించారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని అప్రమత్తం చేశారు.

6. Mumbai: ముంబయిని ముంచెత్తిన వాన

దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షంతో తడిసిముద్దయింది. శుక్రవారం తెల్లవారుజామున నుంచి కురిసిన వర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో లోకల్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జుహూలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

7. Mamata Banerjee: దిల్లీలో మమత రాజకీయాలు!

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినాయకురాలు మమతా బెనర్జీ ఈ నెలాఖరులో దిల్లీ పర్యటన చేయనుండటం జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మమత ఈనెల 25న దిల్లీకి బయల్దేరనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆమె 4 రోజుల పాటు దేశ రాజధానిలో పర్యటించే అవకాశం ఉంది.

8. SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే, బ్యాంకు మీకు ఓ ముఖ్య గమనిక జారీ చేసింది. కష్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ సేవలకు సంబంధించి పలు సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈరోజు(జులై 16) అర్ధరాత్రి సమయంలో రెండున్నర గంటల పాటు సేవలు నిలిచిపోతాయని తెలిపింది.

Paytm IPO: పేటీఎం ఐపీఓలో కీలక అడుగు!

Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు

9. రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా : సుధీర్‌

రష్మి ప్రేమ కోసం మళ్లీ జన్మిస్తా అంటున్నారు నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెర వేదికగా ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’, ‘ఢీ’ ప్రోగ్రామ్‌లతో ఈ జోడీ ప్రతి ఒక్కరికీ పరిచయమే. తాజాగా ఈ జోడీ మరోసారి ఫిదా చేసింది. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’ షోలో వీళ్లిద్దరూ తళుక్కున మెరిశారు.

Toofaan Review: రివ్యూ: తుఫాన్‌

10. Team India: కోహ్లీసేనకు ‘నెగెటివ్‌’ శుభవార్త

టీమ్‌ఇండియాకు శుభవార్త! తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో కోహ్లీసేన మొత్తానికి నెగెటివ్‌ వచ్చిందని సమాచారం. రిషభ్ పంత్‌తో సన్నిహితంగా మెలిగిన వారికీ నెగెటివ్‌ రావడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని