టాప్‌ 10 న్యూస్‌ @ 9AM
close

తాజా వార్తలు

Updated : 11/04/2021 09:02 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. భారత్‌లో కొవిడ్‌ ఉద్ధృతికి కారణాలివే

భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరగడానికి అనేక కారణాలను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా.. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు దారితీసి ఉండొచ్చని చెప్పారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఎవరిదో పరపతి?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలకు మరింత పదును పెడుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైకాపా పట్టుదలగా ఉంది. తమ అభ్యర్థి గురుమూర్తి గెలుపు నల్లేరు మీద నడకేనని, ఐదు లక్షలకుపైగా మెజార్టీ సాధించడమే లక్ష్యమని వైకాపా నేతలు చెబుతున్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల్నే ఆ పార్టీ ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకుంది. వైకాపా కంటే చాలా ముందే.. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని తమ అభ్యర్థిగా ప్రకటించిన తెదేపా అప్పటి నుంచే వ్యూహరచన మొదలు పెట్టింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. కరోనా వేళ ఇదేం పద్ధతి?

సెకండ్‌వేవ్‌తో కరోనా వేగంగా వ్యాపిస్తోంది.  ఈ తరుణంలో రైలు ప్రయాణాల్లో కొవిడ్‌ నిబంధనలు సరిగా అమలుకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మాస్క్‌ ధరించని ప్రయాణికులపై జరిమానాలు వేయకుండా రైళ్లలో సూచనలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం మిగతావారిలో భయాన్ని పెంచుతోంది. హైదరాబాద్‌, విజయవాడ,  కాజీపేట, డోర్నకల్‌, గుంతకల్లు రైల్వేస్టేషన్లలో పరిస్థితులను ‘ఈనాడు’ పరిశీలించగా విస్మయం కలిగించే అంశాలు వెలుగుచూశాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. దిల్లీ దంచేసింది

పాపం చెన్నై..! అయ్యో చెన్నై..! దిల్లీ ఓపెనర్ల విధ్వంసం చూసిన వాళ్లందరూ ఇలాగే జాలిపడి ఉంటారు మాజీ ఛాంపియన్‌ గురించి. ఆరంభంలో తగిలిన ఎదురు దెబ్బల్ని తట్టుకుని, సీఎస్‌కే ఎంతో కష్టపడి 188 పరుగులు చేస్తే.. అంత పెద్ద స్కోరును అలవోకగా ఛేదించి పడేసింది దిల్లీ. చెన్నై బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా ఆడుతూ లక్ష్యంలో 80 శాతం పరుగులు దిల్లీ ఓపెనర్లే సాధించేశారు. దిల్లీ ఇన్నింగ్స్‌ సాగుతున్నపుడు.. చూస్తోంది హైలైట్లా అని అనిపించేలా ధావన్‌, పృథ్వీ చెలరేగిపోయారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. టీకాపై పెరుగుతున్న అవగాహన 

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వం, ప్రముఖులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలిస్తోంది. టీకా కోసం కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల శనివారం ఈ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా పండగకు పిలుపు ఇవ్వగా.. రాష్ట్రంలో శనివారమే ఆ సందడి కనిపించింది. ఆదివారం నుంచి టీకాల కోసం వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యఆరోగ్యవర్గాలు భావిస్తున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. గూగుల్‌ను నమ్ముకుంటే.. వధువే మారిపోయింది

గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని, పెళ్లింటి చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన వరుడు.. అదే ప్రాంతంలోని మరో వధువు చెంతకు చేరుకున్నాడు. ఇక పెళ్లే తరవాయి అనుకునేంతలోనే తాము వచ్చింది వేరొకరి ఇంటికని తెలుసుకొని నాలుక్కరుచుకున్నారు. ఇండోనేసియాలో జరిగిన ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సెంట్రల్‌ జావాలోని లొసారి హామ్లెట్‌లో వధువు ఇంటికి బయలుదేరిన వరుడు, అతని బంధువులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌?

మహారాష్ట్రలో కొవిడ్‌-19 కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున, ప్రజల ప్రాణాలను కాపాల్సిన అవసరం ఉన్నందున లాక్‌డౌన్‌ విధించే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి శనివారం వీడియో సమావేశం విధానంలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంక్షల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే పేదలు, రోజువారీ కార్మికులు, కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని స్పష్టంచేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. వానప్రస్థం... ఇక్కడ భద్రం!

రెక్కలు వచ్చి పిల్లలు ఎవరి దారిన వాళ్లు ఎగిరిపోయాక...రెక్కలు అలసిన పెద్దలు ఒకరికొకరై ఒంటరిగా మిగిలిన వేళ... వారికి నీడనిచ్చి, సేదతీర్చి, శేషజీవితాన్ని భద్రంగా, ప్రశాంతంగా గడపడానికి తోడ్పడుతున్నాయి... రిటైర్మెంట్‌ హోమ్స్‌..! ప్రొఫెసరు రామారావు ఆర్థిక శాస్త్రంలో నిపుణులు. రిటైరయ్యాక పుస్తకాలు రాస్తూ బిజీగా ఉంటున్నారు. కుమార్తెలిద్దరూ చెరో దేశంలో స్థిరపడ్డారు. ఎనభయ్యోపడిలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉండడం వారికి ఆందోళన కలిగించేది. అలాగని చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక పనిచేసే తండ్రిని వృద్ధాశ్రమంలో చేరమనడం వారికిష్టం లేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కాన్పులో.. కంటికి రెప్పలా

కష్టంలో ఉన్నప్పుడు మనసు ఓదార్చు కోరుకుంటుంది. నేనున్నాననే భరోసా ఇచ్చే వారి కోసం తహతహలాడుతుంది. అలాంటి వాళ్లు కన్పించగానే హమ్మయ్యా! అనుకుంటూ ఊరట పొందుతుంది. ఈ సూత్రం ఆధారంగానే ‘బర్త్‌ కంపానియన్‌’ అనే విధానం పురుడు పోసుకుంది. ఈ పద్ధతిలో ప్రసవ సమయంలో గర్భిణి కుటుంబ సభ్యులను పురిటిగదిలోకి అనుమతిస్తారు. ఇది విదేశాల్లో ఎప్పట్నుంచో అమల్లో ఉంది. మన దేశంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులూ అమలుచేస్తున్నాయి. తెలంగాణలో మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవలే ప్రారంభించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. సోఫా కావాలా.. అద్దెకు తెచ్చుకుందాం..

రమేష్‌, లక్ష్మి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. కొత్తగా పెళ్లయింది. ఒక టూ-బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తీసుకుని కాపురం పెట్టారు. కానీ ఫర్నిచర్‌ ఎలా. కొనాలంటే ఎంతో ఖర్చు. పైగా ఉద్యోగంలో ఎప్పుడు బదిలీ అవుతుందో, ఎక్కడికి మారాల్సి వస్తుందో తెలీదు. ఫర్నిచర్‌ కొంటే, దాన్ని తీసుకువెళ్లడం పెనుభారం కదా. పైగా కొంతకాలానికి మొహంమొత్తినా, అదే ఫర్నిచర్‌తో ఏళ్ల తరబడి నెట్టుకురావాల్సి వస్తుంది. అప్పుడు వారికొక స్నేహితుడు చెప్పాడు.. ‘కావలసిన ఫర్నీచర్‌ అద్దెకు దొరుకుతుంది, వాడుకున్నంత కాలం అద్దె కడుతూ, తర్వాత వెనక్కి ఇస్తే సరిపోతుంది’ అని. వారిద్దరికీ ఈ ఆలోచన నచ్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని