టాప్ 10 న్యూస్‌ @ 1PM

తాజా వార్తలు

Published : 13/04/2021 12:57 IST

టాప్ 10 న్యూస్‌ @ 1PM

1. అక్కడ గంటకు 3 కరోనా మరణాలు.. 

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 1.5లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీటిలో దాదాపు సగం కేసులు, మరణాలు ఒక్క మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ తదితర ప్రాంతాలు ఉంటున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. రాళ్లు వేసిన వారిని చూశారా?

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా తెదేపా నిర్వహించిన బహిరంగ సభలో రాళ్ల దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు ఉదయం తిరుపతిలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు వచ్చి నిన్నటి దాడి ఘటనపై భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. చంద్రబాబు వ్యక్తిగత, భద్రతా సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. రాళ్లు వేసిన వారిని చూశారా? ఎటువైపు నుంచి వచ్చాయో గమనించారా?అని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్‌ను తిరుపతి అర్బన్‌ పోలీసులు వీడియో తీశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. ఆ అమరుల త్యాగం వెలకట్టలేనిది: మోదీ

జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళి అర్పించారు. వారు కనబరచిన అద్వితీయమైన ధైర్య సాహసాలు, త్యాగం ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయన్నారు. నేటితో ఆ నరమేధం జరిగి 102 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆయన ఈ మేరకు మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జలియన్‌ వాలాబాగ్‌ దురంతంలో అమరులైన వారికి నా నివాళులు. వారి ధైర్యం, సాహసం, త్యాగం ప్రతి భారతీయ పౌరునిలో శక్తిని పెంపొందిస్తాయి’ అని  ట్వీట్‌లో పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4.‘హనుమ జన్మస్థలంపై నివేదిక సిద్ధం’

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ తితిదే పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని బలమైన ఆధారాలను సేకరించింది. తితిదే వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతాం. ఆధారాలతో నివేదిక తయారు చేశాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. నేను నమ్మా.. మాటల్లేవ్‌.. ఆఫ్‌సైడ్‌ దూరంగా..

హోరాహోరీ పోరుపై మాట్లాడేందుకు తన వద్ద మాటల్లేవని రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి సంజు శాంసన్‌ అన్నాడు. ఎక్కువ పరుగులు ఇస్తున్నప్పటికీ తన జట్టుపై విశ్వాసం వీడలేదని పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. ఒత్తిడి చంపేస్తున్నా ఆఖరి ఓవర్లో 6 బంతుల్ని సులభంగా వేయాలని నిర్ణయించుకున్నట్టు యువ పేసర్‌ అర్షదీప్‌ వెల్లడించాడు. సోమవారం మ్యాచ్‌ తర్వాత వీరు మాట్లాడారు. పంజాబ్‌ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 217/7 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా టైటిల్‌ని ప్రకటించకుండా ఆసక్తిని పెంచింది చిత్ర బృందం. ఉగాది పండగని పురస్కరించుకుని ఆ ఉత్కంఠకు తెరదించుతూ అభిమానులకు సర్‌ప్రైజ్‌ అందించింది. ఈ చిత్రానికి ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఇందులో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ అదరగొడుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. టిబెట్‌ వద్ద 5జీ స్టేషన్‌..!

భారత్‌ సరిహద్దుల సమీపంలోని టిబెట్‌ వద్ద  చైనా సరికొత్త 5జీ కమ్యూనికేషన్‌ సిగ్నల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. గన్‌బాల రాడార్‌ స్టేషన్‌లో భాగంగా దీనిని కూడా ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో (5,374 మీటర్లు) నిర్వహిస్తున్న రాడార్‌ స్టేషన్‌ ఇదే.  ఈ విషయాన్ని చైనా మిలటరీ వెబ్‌సైట్‌ పేర్కొంది. టిబెట్‌లోని నగార్జే కౌంటీలో ఇది ఉంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. కరోనాతోఆందోళన, పక్షవాతం!

రోనా జబ్బును తేలికగా తీసుకుంటున్నారా? ఇదేం చేస్తుందిలే అనుకుంటున్నారా? అలాంటి భ్రమలేవైనా ఉంటే వెంటనే బుర్రలోంచి తీసేయండి. కొవిడ్‌-19 జబ్బు తగ్గినా దాని దుష్ప్రభావాలు ఏళ్ల కొద్దీ వెంటాడే ప్రమాదముందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. కరోనా జబ్బు బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతుండటమే దీనికి నిదర్శనం. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తిన ఆరు నెలల్లోనే సుమారు 34% మంది వీటి కోరల్లో చిక్కుకు పోతుండటం గమనార్హం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఎక్స్‌యూవీ 700కు రంగం సిద్ధం

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎక్స్‌యూవీ700గా వ్యవహరిస్తున్న  కారును ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ సరికొత్త డబ్ల్యూ601 ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేశారు.  దీనిని ప్రస్తుతం ఉన్న ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 500తో భర్తీ చేస్తారని భావిస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఉగాది వేళ.. సినీ  పోస్టర్ల కళ కళ

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్ర బృందాలు కొత్త పోస్టర్లని విడుదల చేశాయి. నాయకానాయికల సరికొత్త లుక్‌ని పరిచేయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశాయి. ‘పండగలు చాలా ఉంటాయి. కానీ, ప్రేమ ఒక్కటే’ అంటూ ‘రాధేశ్యామ్‌’ నుంచి ప్రభాస్‌.. గుమ్మానికి పసుపు రాస్తూ ‘విరాట పర్వం’ నుంచి సాయి పల్లవి దర్శనమిచ్చారు. ‘ఎఫ్‌ 3’.. మరో షెడ్యూల్‌ ప్రారంభమైంది అంటూ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌ సందడి చేశారు. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని