టాప్‌ 10 న్యూస్ @ 9AM
close

తాజా వార్తలు

Published : 18/04/2021 08:56 IST

టాప్‌ 10 న్యూస్ @ 9AM

1. కట్టడిలేని కరోనా 

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వైరస్‌ రెండో విడత ఉద్ధృతి కొనసాగుతోంది. మహమ్మారి సోకిన బాధితులు, మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కొత్త గరిష్ఠాలకు చేరుకుంటోంది. వైద్య వసతులు, ఔషధాల కొరత కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేసులు అధికమవడంతో దాని ప్రభావం ఆసుపత్రుల పడకలు, అత్యవసర మందులు, ఆక్సిజన్‌ సరఫరాలపై ఒత్తిడిని అధికం చేస్తోంది. 16 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. దొంగ ఓట్ల దందా! 

వారెవరూ స్థానికులు కారు... ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ తిరుపతి లోక్‌సభా స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ వేళ ఒక్కసారిగా తిరుపతికి వెల్లువెత్తారు. ప్రైవేటు బస్సులు, కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. తీర్థయాత్రకని కొందరు, ఆసుపత్రి పనిపై అంటూ ఇంకొందరు, స్నేహితులు, బంధువుల ఇళ్లకు వచ్చామని మరికొందరు ఇలా ఏవేవో సాకులు చెబుతూ నగరంలోకి చేరుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: ఈ లాఠీకి ఏమైంది..!

3. టీకాతో ఇన్‌ఫెక్షన్‌ ఆగదు..!

కొవిడ్‌-19 టీకా పొందిన వ్యక్తికి ఆ ఇన్‌ఫెక్షన్‌ సోకదని చెప్పలేమని ఆరోగ్య, అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ అనుప్‌ మలానీ పేర్కొన్నారు. అయితే అతడిలో వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, వేగంగా నయం కావడానికి వ్యాక్సిన్‌ దోహదపడుతుందని తెలిపారు. భారత్‌లో ఇటీవల కొవిడ్‌ కేసులు భారీగా పెరగడానికి.. రీఇన్‌ఫెక్షన్లే కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. ఉన్నదంతా ఊడ్చేసి.. కొన ఊపిరితో వదిలేసి..

అతనో ప్రభుత్వ విభాగంలో పని చేసే వ్యక్తి. పదిరోజుల కిందట కరోనా పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారం రోజులపాటు చికిత్స చేసినా.. రోగి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. అతను  తమ ఆస్పత్రిలో చనిపోతే తమకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో సంబంధిత రోగిని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చేరిన కొన్ని గంటల్లోనే అతను చనిపోయాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. మళ్లీ ఢమాల్‌

లక్ష్యం చిన్నదైనా, పెద్దదైనా.. ఛేదనను ఘనంగా ఆరంభించడం.. లక్ష్యం దిశగా పరుగులు పెట్టడం.. ఇక గెలుపు లాంఛనమే అనుకున్నాక ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం.. ఇదీ ఈ ఐపీఎల్‌ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరబాద్‌ వరస! తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. మూడో మ్యాచ్‌లోనూ కథ ఏమీ మారలేదు. భారీ స్కోరు సాధించేలా కనిపించిన ప్రత్యర్థిని బౌలర్లు పుంజుకుని కట్టడి చేసి స్వల్ప లక్ష్యాన్ని నిలిపితే.. బెయిర్‌స్టో అందించిన మెరుపు ఆరంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్‌ ఉపయోగించుకోలేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!

సందేహమే అక్కర్లేదు... దక్షిణాదికి దక్కిన మరో సూపర్‌స్టార్‌ అతను! మన ఐదు రాష్ట్రాలవాళ్లూ తమ భాషలకతీతంగా ప్రేమిస్తున్న నటుడు. స్టార్‌ అంటే తమ ఇమేజ్‌ని ఆకాశమంత పెంచే ‘సూపర్‌హీరో’గానే కనిపించాల్సిన అవసరం లేదంటూ తనదైన పాత్రలతో కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. విలన్‌, సహాయ నటుడు, హిజ్రా... ఏది చేసినా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల జాతీయ అవార్డు కూడా అందుకున్న విజయ్‌ సేతుపతి జీవిత గమనం ఏ సినిమా స్క్రిప్టుకీ తీసిపోదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఊరినే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు! 

ఆదివాసీల గ్రామాన్నే ఏకంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడో వ్యాపారి. నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం 19 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. 2000లో ఆ ఊరి నుంచి పెంబి వెళ్లే మార్గంలో రహదారి పక్కనే మందపల్లికి చెందిన దేవ నడ్పి పెద్దులు, చిన్న పెద్దులు, దేవ బక్కన్నల వద్ద సర్వే నం.55/2లో 4.32 ఎకరాల అసైన్డ్‌ (వ్యవసాయ) భూమిని రూ.60 వేలకు కొనుగోలు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. రెమ్‌డెసివిర్‌ మంత్రదండం కాదు

కొవిడ్‌-19 చికిత్స కోసం వాడుతున్న రెమ్‌డెసివిర్‌ వల్ల బాధితులు ఆసుపత్రిలో ఉండాల్సిన రోజులు మాత్రమే తగ్గుతాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. మరణాలను అది ఆపలేదని అధ్యయనాల్లో తేలినట్లు చెప్పారు. ‘‘అది త్వరగా కోలుకునేలా చేసే మంత్ర దండమేమీ కాదు. ఆక్సిజన్‌ స్థాయి తక్కువై, ఆసుపత్రుల్లో చేరిన వారికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. స్వల్పస్థాయిలో వ్యాధి లక్షణాలున్న వారికి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు...

ఇన్‌స్టాగ్రామ్‌... సామాజిక మాధ్యమమే కాదు.. కాసులు కురిపించే కామధేనువు... అందమైన ఫొటోలతో ఫాలోవర్లనే కాదు... అంతులేని ఫేమ్‌ను సంపాదించుకోవచ్చు... మంచి వీడియో పెడితే లైక్‌లతోనే సరిపెట్టుకునే పనిలేదు... సినిమా, రియాలిటీ షో అవకాశాలనూ ఎగరేసుకుపోవచ్చు... ఉబుసుపోక పెట్టే పోస్ట్‌తోనే కంపెనీలతో యాడ్‌ కాంట్రాక్టులు పట్టేయొచ్చు... అలా ఇన్‌స్టాలో మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ని కూడగట్టుకొని ఆదాయం, అవకాశం, సెలెబ్రెటీ హోదా అందుకున్న వారిలో భాను, రవళిలతో వసుంధర ముచ్చటించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. వాట్సప్‌లోభద్రతపరమైన లోపాలు

విస్తృతంగా వాడకంలో ఉన్న మెసేజింగ్‌ యాప్‌ ‘వాట్సప్‌’లో భద్రతపరమైన కొన్ని ముప్పులు పొంచి ఉన్నాయని భారత సైబర్‌ భద్రతా సంస్థ ‘సెర్ట్‌-ఇన్‌’ హెచ్చరించింది. వీటివల్ల సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. దీని తీవ్రత రేటింగ్‌ చాలా ‘అధికం’గా ఉందని తెలిపింది. వీ2.21.4.18 (ఆండ్రాయిడ్‌), వీ2.21.32 (ఐవోఎస్‌)కు ముందున్న వాట్సప్‌ వెర్షన్లలోని సాఫ్ట్‌వేర్‌లో ఈ ముప్పులను గుర్తించినట్లు పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని