టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

తాజా వార్తలు

Updated : 18/04/2021 13:06 IST

టాప్‌ 10 న్యూస్‌ @ 1PM

1. Corona India : ఒక్కరోజే 1501 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు రెండు లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15.66లక్షల టెస్టులు చేయగా 2,61,500 కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది. కొత్తగా 1,38,423 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,28,09,643 చేరి .. ఆ శాతం 87.23కి తగ్గింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ‘‘దొంగ ఓట్లపై జగన్ సమాధానం చెప్పాలి’’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దొంగ ఓట్లు- నోట్లు రాజ్యంగా చేశారని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని ఆరోపించారు. దొంగ ఓట్ల అంశంపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నకిలీ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పోలింగ్‌ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. వ్యాక్సిన్‌ కొరతను పరిష్కరించాలి: ఈటల

కొవిడ్‌ వ్యాక్సిన్‌ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బీఆర్కే భవన్‌ నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 10లక్షల మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ.. టీకాలు అందుబాటులో లేక  ఇవాళ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇవాళ రాత్రికి 2.7లక్షల డోసులు వస్తాయని సమాచారమిచ్చారు.. వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Double Maskతో మరింత మేలు!

కరోనా స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఒక్క మాస్క్‌ పెట్టుకుంటే సరిపోదా? ప్రతి ఒక్కరూ రెండు మాస్క్‌లు ధరించాల్సిందేనా? కొవిడ్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ ఈ జిత్తులమారి వైరస్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నవేళ కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మాస్క్‌ ధరించడంపై యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా హెల్త్‌ కేర్‌ జరిపిన కొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌కు కళ్లెం వేయాలంటే ఒక్క మాస్క్‌ చాలదని, డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్లే వైరస్‌ దరిచేరకుండా ఉంటుందని నిర్ధారణ అయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. రాహుల్‌ పంజాబ్‌ కింగ్‌ మేకర్‌!

ఐపీఎల్‌లో ఇప్పటివరకు టైటిల్‌ సాధించని జట్లలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. ఆ జట్టుకు కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు ఎంతమంది మారినా విజేతగా నిలవలేకపోతోంది. బ్యాటింగ్‌ విభాగంలో బలమైన హిట్టర్లున్నా ఏదో ఒక కారణంతో చతికిల పడుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒంటి చేతి పోరాటం చేస్తున్నాడు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌. గత మూడు సీజన్లలో టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 14వ సీజన్‌లోనూ రాజస్థాన్‌పై 91 పరుగులతో చెలరేగి ఫామ్‌లో ఉన్నాననే సంకేతాలిచ్చాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఆసుపత్రి నుంచి 860 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ చోరీ

విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రాణాధార మందులకున్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ ఇటీవల తీవ్ర కొరత ఏర్పడింది. కొందరు స్వార్థపరులు దీనిని అవకాశంగా మలచుకొని నల్లబజారులో అధిక ధరలకు వాటిని విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసం అడ్డదారులు తొక్కుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ప్రభుత్వ హమిదియా ఆసుపత్రిలో నిల్వచేసిన 860 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ కనిపించకుండా పోవడం వెనుక ఇలాంటి వారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఆర్‌టీజీఎస్‌ సేవల్లో అంతరాయం!

అధిక మొత్తంలో లావాదేవీల కోసం జరిపే ఆర్‌టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌) సేవలకు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగనుంది. నెఫ్ట్‌ సేవలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) గురువారమే ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతోనే ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ‘నావల్నీ ఏ క్షణమైనా చనిపోవచ్చు’

జైల్లో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ మరణించే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్య బృందం తెలిపింది. మూడు వారాలుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వారు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వైద్య నివేదికలను పరిశీలిస్తే ఆయనలో పొటాషియం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు తెలుస్తోందన్నారు. ఇది ఏ క్షణంలోనైనా గుండెపోటుకు దారితీయొచ్చని పేర్కొన్నారు. అలాగే క్రియాటినైన్‌ స్థాయిలు సైతం విపరీతంగా పెరిగిపోయాయని.. ఇది కిడ్నీలు దెబ్బతిన్నాయడానికి సంకేతమని తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఆక్సిజన్‌ కొరతతో ఆరుగురి మృతి!

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోంది. షాదోల్‌ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ప్రాణవాయువు‌ కొరతతో ఆరుగురు రోగులు మృతిచెందినట్లు సమాచారం. ఆక్సిజన్‌ లేకనే వారు మరణించినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఆ ఆరోపణలను ఆసుపత్రి యాజమాన్యం తోసిపుచ్చింది. కరోనాతోనే వారు మృతిచెందారని యాజమాన్యం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదయ్యాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. చైతన్యకు నాగబాబు ఖరీదైన గిఫ్ట్‌

తన అల్లుడు చైతన్యను నటుడు నాగబాబు సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఖరీదైన కారును బహుమతిగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ‘మా అల్లుడు చైతన్యకు ఇప్పటివరకూ ఎలాంటి బహుమతులివ్వలేదు. ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇటీవల ఉగాదికి ఓ బహుమతి ఇద్దామనుకున్నాను.. కుదరలేదు. ఇప్పుడు అతడి కోసం ఓ రేంజ్‌రోవర్‌ డిస్కవరీ తీసుకున్నాం’ అని నాగబాబు తెలిపారు. నిహారిక-చైతన్య దంపతులను నాగబాబు దంపతులు కలిసి.. ఆ కారుని బహూకరించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని