Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 20/04/2021 08:54 IST

Top 10 News @ 9AM

1. కార్చిచ్చులా కరోనా

అడవులను దహించి వేసే కార్చిచ్చులా కరోనా వైరస్‌ జనారణ్యాల్లో విజృంభిస్తోంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలను ముమ్మరం చేశాయి. ఆసుపత్రుల్లో పడకల లభ్యత, ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. దిల్లీ ప్రభుత్వం ఆరు రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించగా...రాజస్థాన్‌ సర్కారు పక్షం రోజులు ప్రజలే స్వీయ ఆంక్షలతో కొవిడ్‌పై పోరుకు సహకరించాలని పిలుపునిచ్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..

కొవిడ్‌ ఏ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలియడం లేదు. ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని సకాలంలో వైద్య సేవలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు జ్వరంతో బాధపడుతూ.. రక్త పరీక్షల్లో టైఫాయిడ్‌, డెంగీ అని వచ్చినా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. ప్రయోగాలు వద్దేవద్దు.. ప్రాణాలే ముద్దు

గ్రేటర్‌లో గత 20 రోజులుగా వేలాది మంది కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. చాలామంది పరీక్షలు చేయించుకోకుండా, వైద్యులను సంప్రదించకుండా, సొంతగా వైద్యం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆందోళనకరంగా మారిన తరువాతే పరీక్షలకు మొగ్గుచూపుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తి, జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన ఉన్నవారూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏమాత్రం చైతన్యం ప్రదర్శించకుండా తమకేం కాదులే అన్న భావనలో ఉండిపోవడం ప్రాణాపాయానికి దారితీస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. మందుల పాత్ర పరిమితమే

కరోనా చికిత్స కోసం ఉపయోగించే మందులన్నింటికీ పరిమిత పాత్ర మాత్రమే ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా చెప్పారు. వాటిని సరైన సమయంలో, సరైన మోతాదులో మాత్రమే ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా ఉపయోగించాలని సూచించారు. లేదంటే రోగులకు ప్రయోజనం కంటే కీడే ఎక్కువ జరుగుతుందని హెచ్చరించారు. దేశంలో రెమ్‌డెసివిర్‌, టొసిజొలిమాబ్‌ మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గులేరియా సోమవారం నాడిక్కడ పలు కీలక సూచనలు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. చెన్నై చెడుగుడు

ఐపీఎల్‌-2020లో పేలవమైన ఆటతీరుతో నిరాశపరిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి గాడిన పడ్డట్లే ఉంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన ఈ మాజీ ఛాంపియన్‌.. సోమవారం రాజస్థాన్‌పై తన ప్రతాపం చూపించింది. మొదట జట్టులో ఎవరూ భారీ స్కోరు చేయకున్నా సరే.. క్రీజులోకి దిగిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ దంచు దంచు అన్నట్లుగా రెచ్చిపోవడంతో భారీ స్కోరు చేసిన సూపర్‌కింగ్స్‌.. తర్వాత బంతితోనూ విజృంభించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. వచ్చే 3 వారాలు కీలకం

కొవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సంస్థ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్ర సూచించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. భారత్‌ పర్యటనకు దూరంగా ఉండండి: యూఎస్‌

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో యూఎస్‌ ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. కొద్ది రోజుల పాటు భారత్‌ పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్రయాణికులు భారత పర్యటనకు దూరంగా ఉండాలి. టీకా తీసుకున్న వారు కూడా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్‌ పర్యటనను రద్దు చేసుకోవడం మంచిది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ఆరోగ్య బీమా ప్రీమియం 15-35 శాతం భారం!

దేశ వ్యాప్తంగా రోజుకు 2.70 లక్షల కొవిడ్‌-19 కేసులు నమోదవుతున్నాయి. ఇతర వ్యాధులు, అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యకన్నా ఈ మహమ్మారి బాధితులే ఇప్పుడు అధికంగా ఉంటున్నారు. చికిత్స ఖర్చూ రూ.లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలను అందించే సాధారణ బీమా, ఆరోగ్య బీమా సంస్థలపై క్లెయింల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ప్రీమియం పెంచడంపై సంస్థలు దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని బీమా సంస్థలు ఈ దిశగా అడుగులు వేశాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఉపవాసం ఉత్తమంగా..

పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు పాటించే ఉపవాస దీక్ష (రోజా) చాలా ప్రత్యేకమైంది. ఇది ఆధ్యాత్మిక భావనలు పరిఢవిల్లటానికే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యాలు పుంజుకోవటానికీ ఉపయోగపడుతుంది. రోజులో ఎక్కువసేపు ఏమీ తినకుండా ఉండటం ఎంతో మేలు చేస్తున్నట్టు ఆధునిక పరిశోధనలు సైతం చెబుతున్నాయి. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా ఉపవాసాన్ని మరింత ఉత్తమ దీక్షగా మార్చుకోవచ్చు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. నోటితో రెమ్‌డెసివిర్‌

తీవ్రమైన కొవిడ్‌-19 వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రి పాలైన వారికి వైద్యులు సిఫారసు చేస్తున్న ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాన్ని ట్యాబ్లెట్‌ లేదా క్యాప్సూల్‌ రూపంలో తయారు చేసేందుకు దేశీయ ఔషధ కంపెనీ జుబిలెంట్‌ ఫార్మోవా లిమిటెడ్‌ ప్రయత్నాలు చేస్తోంది. జుబిలెంట్‌ ఫార్మోవాకు అనుబంధ సంస్థ అయిన జుబిలెంట్‌ ఫార్మా, ఇప్పటికే ఈ ఔషధాన్ని  జంతువుల్లో, ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లపైనా పరీక్షించింది. ఈ ఔషధాన్ని నోటి ద్వారా ఇచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని జుబిలెంట్‌ ఫార్మోవా వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని