Top 10 News @ 1PM

తాజా వార్తలు

Updated : 20/04/2021 13:02 IST

Top 10 News @ 1PM

1. India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి దేశం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ కేసులు, మరణాలు భారీ స్థాయిలో పెరుగుతుండటంతో భారత్‌ క్రమక్రమంగా ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,19,486 కొవిడ్ పరీక్షలు జరపగా.. 2,59,170 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,53,21,089కి చేరింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 5,926  కరోనా కేసులు

3. ఆ పాత గాయాలను మరిచారా..?

న్యూజిలాండ్‌లో కొవిడ్‌ తొలిసారి అడుగుపెట్టినప్పుడు అక్కడి ప్రధాని ప్రజలకు దాదాపు రెండు రోజులకు పైగా సమయం ఇచ్చి ఒత్తిడి లేకుండా నిత్యావసరాల కొనుగోలు.. ఇతర ప్రాంతాల వారు ఇళ్లకు చేరుకోవడానికి అవకాశం కల్పించారు. ఫలితంగా అక్కడ  వైరస్‌ వేగంగా అదుపులోకి వచ్చింది. జసిండా ఆర్డెన్‌ అనుసరించిన మంచి వ్యూహంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రశంసలు అందుకొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు: జగన్‌

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రబీలో(2019-20) రూ.లక్ష లోపు పంటరుణాలు తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు.. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రూ.128.47 కోట్లు మంగళవారం సీఎం విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి నిధులు విడుదల చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. 10 రోజుల్లో భారత్‌కు స్పుత్నిక్‌-వి

రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్‌-వి మరో పది రోజుల్లో భారత్‌లోకి రానుంది. వచ్చే నెలలో భారత్‌లో స్పుత్నిక్‌-వి టీకా ఉత్పత్తిని ప్రారంభించి.. ప్రతి నెలా 50 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి బాల వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు. ఈ నెల చివరిలోపు రష్యా నుంచి స్పుత్నిక్‌-వి డోసుల మొదటి దిగుమతి జరుగుతుందని.. మే నెలలో భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి క్రమంగా పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. ఈ వయసులో గ్యారంటీ ఇవ్వలేను: ధోనీ

సోమవారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు   వచ్చిన ధోనీ.. నెమ్మదిగా ఆడాడు. ఆరు బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు బాదినప్పటికీ లయను అందుకోవడానికి ఇబ్బంది పడ్డాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఇంట్లో హెల్త్‌ ఎమర్జెన్సీయా..?

అసలే కరోనా పుణ్యమా అని అనేక మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరైనా కొవిడ్‌ బారిన పడినా.. లేక ఇతర అనారోగ్యానికి గురైనా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. కానీ, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమే నిజమైన సంపద. తొలి ప్రాధాన్యం కచ్చితంగా ఆరోగ్యానికి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇంట్లో ఆరోగ్య అత్యసరసర పరిస్థితి ఏర్పడితే వీలైనంత త్వరగా నిధులు సమకూర్చుకునేందుకు ఉన్న కొన్ని మార్గాలపై లుక్కేద్దాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. రైల్వే ‘సూపర్‌ మ్యాన్‌’కు అపూర్వ సత్కారం!

మహారాష్ట్రలో ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై పడిన బాలుడిని ప్రాణాలకు తెగించి మరీ కాపాడిన రైల్వే సిబ్బంది మయూర్‌ షెల్కేకు అపూర్వ సత్కారం లభించింది. ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చప్పట్లతో అతడి సాహసాన్ని అభినందించారు. చిన్నారి ప్రాణాల్ని కాపాడి.. ఆయన చేసిన సాహసం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అనంతరం అధికారులు మయూర్‌ను ప్రశంసా పత్రంతో సత్కరించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కృతి, వైష్ణవ్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చూశారా..!

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు మేకింగ్‌ వీడియోలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరొకటి విడుదల చేసింది. ఇందులో కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కీలక సన్నివేశాల కోసం పడిన కష్టం, విజయ్‌ సేతుపతి కోపం ఇందులో చూడొచ్చు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఆ దేశాలపై నిషేధాజ్ఞలు పునరుద్ధరించండి: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని