close

తాజా వార్తలు

Updated : 21/04/2021 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 News @ 9AM

1. వైరస్‌ ప్రభావం త్వరలో తారస్థాయికి

ప్రస్తుతానికి మన వ్యాక్సినేషన్‌ వ్యూహం వైరస్‌ విస్తరణను తగ్గించే దృష్టితో లేదు. ఎక్కువ రిస్క్‌ ఉండే వారికి ఇబ్బంది రాకుండా, మరణాలు లేకుండా చూసేలాగే ఉంది. దేశంలో 30 శాతంమందికి టీకాలు వేసి ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగిన తర్వాతే వైరస్‌ విస్తరణపై దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పగలమని ప్రముఖ వైరాలజిస్టు, వెల్లూరులోని క్రిస్టియన్‌ వైద్య కళాశాల (సీఎంసీ) ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. లాక్‌డౌన్‌ రానివ్వొద్దు

కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ను చిట్టచివరి ప్రత్యామ్నాయంగా పరిగణించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దాన్ని విధించకుండా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సూక్ష్మస్థాయిలో కంటెయిన్‌మెంట్‌పై దృష్టిపెట్టాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యాన్నీ కాపాడటం వీలవుతుందని పేర్కొన్నారు. దేశంలో కొవిడ్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మంగళవారం రాత్రి ప్రసంగించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: శ్రీరామనవమి రోజున ఏం చేయాలి

3. 18 ఏళ్లుదాటిన వారికి ఉచితం కాదు

మే 1 నుంచి టీకా తీసుకోవడానికి 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. వీరికీ ఇప్పటిలాగే ఉచితంగా వ్యాక్సిన్‌ అందుతుందేమోనని అందరూ భావించారు. కానీ ప్రభుత్వ ప్రకటనను తరిచిచూస్తే అందులో ఉన్న గూడార్థం బోధపడుతుంది. 18 ఏళ్లపైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే బహిరంగ మార్కెట్లో కొనాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనేది ఆ ప్రకటన సారాంశం. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో కేంద్రీకృతంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం కొంతమేర తప్పుకొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Corona: ముందు నెగెటివ్‌.. తర్వాత పాజిటివ్‌

ఉప్పల్‌ పరిధిలో ఫుడ్‌ కోర్టు నడిపే ఓ వ్యక్తి.. ఇటీవల రామంతాపూర్‌ హోమియోపతి కళాశాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆరోజు నెగెటివ్‌ అని తేలడంతో యథావిధిగా వ్యాపారం చేసుకున్నారు.. ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ పాజిటివ్‌ అని ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది. దీంతో వెంటనే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సొంతూరికి పంపించేసి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానమొచ్చి మళ్లీ ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తే నెగెటివ్‌ అని తేలింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: పిల్లల్లో పెరుగుతున్న ముప్పు

5. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య: పోలీస్‌ అధికారే దోషి

అమెరికాను కుదిపేసిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌(46) మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఫ్లాయిడ్‌ మృతికి మిన్నియా పోలీస్‌ మాజీ అధికారి డెరెక్‌ చౌవిన్‌ కారణమని.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. 12 మంది సభ్యులున్న జ్యూరీ 10 గంటలపాటు విచారించి ఈ ఘటనను సెకండ్‌ డిగ్రీ హత్య, థర్డ్‌ డిగ్రీ హత్య, నరహత్యగా పేర్కొంటూ తీర్పు వెల్లడించింది. శిక్షను తరువాత ప్రకటించనున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఈసారి దిల్లీ

బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న చెన్నై పిచ్‌పై ముంబయి హిట్టర్లు మూగబోయారు. మెరుపుల్లేవు.. విధ్వంసం లేదు. దిల్లీ కూడా చెమటోడ్చినా.. స్పల్ప స్కోర్ల మ్యాచ్‌లో పైచేయి సాధించింది. మిశ్రా మాయాజాలంతో రోహిత్‌సేనకు ముకుతాడు వేసిన పంత్‌ జట్టు.. ధావన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో విజయాన్నందుకుంది. టోర్నీలో దిల్లీకిది మూడో విజయం కాగా.. ముంబయికి రెండో ఓటమి. ఐపీఎల్‌లో వరుసగా ముంబయి చేతిలో అయిదు ఓటముల తర్వాత దిల్లీ గెలవడం విశేషం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఏ పరీక్షలకు చదవాలి సార్‌?

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై జూన్‌ మొదటి వారంలో సమీక్షిస్తామని వెల్లడించింది. తొలి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్‌ చేశామని ప్రకటించింది. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4.59 లక్షల మంది ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో ప్రస్తుతం అయోమయం నెలకొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. త్వరలో ఉద్యోగుల వర్గీకరణ

కొత్త జోనల్‌ విధానం ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఎంతమంది ఉద్యోగులుండాలనే దానిపైనా కసరత్తు చేయనుంది. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 2016 అక్టోబరు నుంచి 2019 జనవరి వరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. అప్పట్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: అధికారుల కళ్లుగప్పి రెండు ఉద్యోగాలు..

9. కరోనా వార్డు నుంచి వ్యక్తి జంప్‌!

కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తి ఆస్పత్రి నుంచి బయటకు పారిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుకోట్టై జిల్లా అరందాంగి పరిసర ప్రాంతాల్లో కరోనా సోకినవారు అరందాంగి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 32 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ లక్షణాలు ఉండటంతో సోమవారం పరీక్షలు చేసి కరోనా ప్రత్యేక వార్డులో ఉంచారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!

దేశంలో కరోనా వైరస్‌ ఉరుముతోంది. రోజురోజుకీ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే చికిత్సపొందుతున్న కొవిడ్‌ రోగులు 6 నిమిషాల పాటు నడకతో తమ ఆక్సిజన్‌ స్థాయిలు తెలుసుకొనేలా మహారాష్ట్రలోని పాల్గఢ్‌లోని వైద్యశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఫోన్‌ చేసి దీని గురించి వివరించడం విశేషం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని