close

తాజా వార్తలు

Published : 21/04/2021 12:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 News @ 1PM

1. Corona: ఒక్కరోజే 2000 దాటిన మరణాలు

కరోనా సృష్టిస్తున్న ప్రళయానికి యావత్‌ భారతావని వణుకుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విస్తరిస్తోన్న ఈ మహమ్మారి.. ఒక్క రోజే దాదాపు 3లక్షల మందిపై విరుచుకుపడింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2.95లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ‘హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే’

హనుమంతుడి జన్మస్థానంపై తితిదే అధికారిక ప్రకటన చేసింది. సప్తగిరుల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని తెలిపింది. ఈ మేరకు తిరుమలలోని నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. ఆంజనేయుడి జన్మస్థానంపై అన్వేషణకు తితిదే కమిటీని ఏర్పాటు చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: వైభవంగా భద్రాద్రి రాములోరి కల్యాణం

3. కొవిడ్‌కు మరో సమర్థ ఔషధం!

కొవిడ్‌-19కు చికిత్స చేయడం కోసం మరో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ఒక ముందడుగు వేశారు. ఇన్‌ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు కరోనా వైరస్‌ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవులపైనా క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి తుది దశలో ఉన్నాయని వివరించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?

ప్రపంచదేశాల ప్రజలను నిద్ర పట్టకుండా చేసిన కరోనా మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌ సహా పలుదేశాలు ఇప్పటికే టీకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టీకాలను ఎవరు వేయించుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది మొదటి డోసు టీకాలు తీసుకొని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టీకాలు తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. రోహిత్‌ శర్మకు జరిమానా..ఎందుకంటే?

చెపాక్‌ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబయిపై దిల్లీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన..అమిత్‌ మిశ్రా (4/24) అద్భుతమైన రీతిలో బౌలింగ్‌ చేయడంతో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. లక్ష్యం చిన్నదే అయినా దీన్ని ఛేదించడానికి దిల్లీ చెమటోడ్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ప్రజలు ఏడుస్తుంటే.. ర్యాలీలా?

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్‌, కొవిడ్‌ టీకాలు, రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడిందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతితో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని ఆమె మండిపడ్డారు. మందులు, ఆసుపత్రులు అందుబాటులో లేక ప్రజలు ఏడుస్తుంటే.. కేంద్ర నాయకులు మాత్రం ఎన్నికల ప్రచార సభల్లో నవ్వుతూ కన్పిస్తున్నారని దుయ్యబట్టారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. బెంగాల్‌లో ప్రచార ఫలితం ఇదీ..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్నా లెక్కచేయకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీలు, సభలు నిర్వహించారు. మరోపక్క జోబైడెన్‌ వివేకంతో వ్యవహరిస్తూ సాధ్యమైనంత వరకు వర్చువల్‌ సమావేశాలకే పరిమితం అయ్యారు.  బాధ్యతగా వ్యవహరించి.. మార్గదర్శిగా నిల్చారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. యూకేకు AirIndia విమానాలు రద్దు

కరోనా ఉద్ధృతి దృష్ట్యా భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇంగ్లాండ్‌ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకేకు వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఏప్రిల్‌ 24 నుంచి 30 వరకు భారత్‌-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. ఈపీఎఫ్‌ఓ ఖాతాలు 20% పెరిగాయ్‌

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో ఫిబ్రవరిలో కొత్తగా 12.37 లక్షల మంది చేరారు. 2020 ఇదే నెలతో పోలిస్తే ఈసారి 20 శాతం ఎక్కువ. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ సంఘటిత రంగంలో ఉపాధి పెరిగిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జనవరి 2021తో పోలిస్తే ఫిబ్రవరి 2021లో నికర వినియోగదార్లు 3.52 శాతం పెరిగారు. గత ఆర్థిక సంవత్సరంలో (ఫిబ్రవరి 2021 వరకు) నికరంగా 69.58 లక్షల మంది చందాదారులు అదనంగా జత చేరారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ప్రియుడితో పిక్‌.. ఇన్నాళ్లు షేర్‌ చేయలేదు 

సుమారు మూడేళ్ల విరామం తర్వాత తిరిగి వెండితెరపై వెలుగులు పూయిస్తోంది నటి శ్రుతిహాసన్‌. చూపరులను ఆకర్షించే అందం.. భిన్నమైన హావభావాలతో ఎంతోమందికి చేరువైన ఈ బ్యూటీ ఇటీవల ‘క్రాక్‌’, ‘వకీల్‌సాబ్‌’లతో టాలీవుడ్‌లో వరుస విజయాలను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టా వేదికగా #Ask To Me పేరుతో అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తన ప్రియుడు శాంతానుతో దిగిన ఓ స్పెషల్‌ ఫొటోని నెట్టింట్లో షేర్‌ చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని