Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 22/04/2021 08:55 IST

Top 10 News @ 9AM

1. టీకాయే రక్ష 

దేశ జనాభాలో ఎనభై శాతంమందికి టీకా ఇస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ వృద్ధి చెంది కరోనాను పూర్తిగా అదుపులో వస్తుందని అమెరికాలో అంటురోగాలకు సంబంధించిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ అమేశ్‌ ఏ అడల్జా అంటున్నారు. భారత్‌లో కనిపిస్తున్న ‘డబుల్‌ మ్యుటేషన్‌ వేరియంట్‌’పై భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌లలో డబుల్‌, అంతకంటే ఎక్కువ మ్యుటేషన్లే కనిపించాయని తెలిపారు. కరోనా లేని ప్రపంచాన్ని చూడలేమని, ప్రమాదకర స్థాయి నుంచి దగ్గు, జలుబులా మారిపోయి మనతోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ప్రాణవాయువుకు తిప్పలు 

కరోనా చికిత్సలో కీలకంగా మారిన ఆక్సిజన్‌ కోసం పాట్లు అంతకంతకూ అధికమవుతున్నాయి. వారం, పది రోజులుగా డిమాండ్‌ పెరగడంతో చాలామంది డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తామని, ఎలాగైనా ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటిదాకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు వాడుతుంటే ఇప్పుడు కరోనా కారణంగా ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. నెలవారీ అద్దె సిలిండర్‌ పరిమాణం మేరకు రూ.5వేల వరకు ఉంటోంది. రీఫిల్లింగ్‌ ధర క్యూబిక్‌ మీటరుకు రూ.1,000 వరకు ఉంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Corona: ఒకే టీకాస్త్రం.. డోసు రూ.75కే!

కొవిడ్‌ మహమ్మారికి ముకుతాడు వేసే సరికొత్త టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌లతో పాటు భవిష్యత్తులో జన్యుక్రమాన్ని మార్చుకోవడం ద్వారా పుట్టుకొచ్చే కొత్తరకం వైరస్‌లనూ నిలువరించగల ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసింది. ఒక్కో డోసు కేవలం రూ.75కే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటం దీని మరో ప్రత్యేకత.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. కాష్ఠం.. కష్టం

భగభగమండే చితిమంటలు ఓవైపు.. ఆప్తులను కోల్పోయిన ఆవేదన, ఆర్తనాదాలు మరోవైపు.. మరుభూమికి సైతం అంతులేని వేదన మిగులుస్తున్నాయి. శ్మశానాలు సైతం వైరాగ్యం వదిలి భోరున విలపిస్తున్నాయి. వెల్లువలా వస్తున్న మృతదేహాలను చూసి వల్లకాడు సైతం తన వల్లకాదంటూ రోదిస్తోంది. గుంటూరు జిల్లాలో కొన్నిరోజులుగా అసాధారణ రీతిలో మరణాలు నమోదవుతున్నాయి. వీటిలో ఎక్కువభాగం కొవిడ్‌ మరణాలే అయినప్పటికీ అధికారులు సాంకేతికంగా వీటిని ధ్రువీకరించడం లేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ప్రాణ భయం.. మందులమయం 

కొవిడ్‌ దెబ్బకు ఉపాధి కోల్పోయి.. వ్యాపారాలు డీలాపడి విలవిలలాడుతున్నా సరే.. ‘బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు’ అనుకుంటున్న జనం మందుల కోసం కోట్లాది రూపాయల సొమ్ము ధారపోస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో.. కరోనా ఔషధాల విక్రయం ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగింది. కేవలం గత నాలుగు వారాల్లోనే రాష్ట్రంలో దాదాపు రూ. 1500 కోట్ల విలువైన వివిధ రకాల మందుల్ని ప్రజలు కొనేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

6. బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో భాగంగా మొత్తం 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 43 స్థానాల పరిధిలో మొత్తం 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. పదివేల మందిలో నలుగురికే!

టీకాలు తీసుకున్న వారిలో పదివేల మందిలో ఇద్దరి నుంచి నలుగురికి మాత్రమే మళ్లీ కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల రెండు డోసులు తీసుకున్నవారిలో ఎంతమందికి మళ్లీ వైరస్‌ సోకిందన్నదానిపై అధ్యయనం చేసినట్టు తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్లు రోగ తీవ్రతతోపాటు, మరణాలను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గినట్లు పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. కోల్‌కతా భయపెట్టినా.. చెన్నైకే చిక్కింది

చెన్నై చేసింది 220 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌ అవ్వగానే ఆ జట్టుదే విజయం అని తేలిపోయింది. చివరికి గెలిచింది కూడా ఆ జట్టే. కానీ అంత స్కోరు చేసి, 31 పరుగులకే ప్రత్యర్థి వికెట్లు సగం పడగొట్టిన జట్టుకు ఓటమి భయం పుడుతుందని.. అవతలి జట్టు విజయానికి చేరువగా వెళ్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా? కానీ వాంఖడెలో ఊహించనిదే జరిగింది. ఏకపక్షంగా ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేసిన ఘనత ఆండ్రి రసెల్‌, దినేశ్‌ కార్తీక్‌, ప్యాట్‌ కమిన్స్‌లదే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. సూపర్‌విమెన్‌కు ఆహారం!

మహిళలు ఆరోగ్యంగా, మరింత శక్తిమంతంగా మారాలంటే ఆహారం కూడా చాలా బలవర్థకంగా ఉండాలి. అందుకు ఏం తీసుకోవాలంటే. మీగడ లేని పెరుగు. దీంట్లో శరీరానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం మెండుగా ఉంటుంది. ఎక్కువ పనులు చేసే మహిళలకు ఎముక సామర్థ్యం బాగుండాలి కదా! అందుకే రోజూ పెరుగు తీసుకోవాలి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. కొవిడ్‌ చికిత్సకు మోల్నుపిరవిర్‌!

మోల్నుపిరవిర్‌... ఇన్‌ఫ్లుయంజా వ్యాధికి వినియోగించే ఈ ఔషధం ఇప్పుడు శాస్రతవేత్తల నోళ్లలో నానుతోంది. కొవిడ్‌-19 వ్యాధిని అదుపు చేసే శక్తి ఈ మందుకు ఉందనే నమ్మకం వారిలో బలపడుతోంది. కొవిడ్‌ తీవ్రతను గణనీయంగా తగ్గించే శక్తి దీనికి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో, దీనిపై తదుపరి ఔషధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం ఒక ఆశారేఖ మాదిరిగా కనిపిస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని