Top 10 News @ 9AM

తాజా వార్తలు

Updated : 23/04/2021 09:07 IST

Top 10 News @ 9AM

1. యువతలో వైరస్‌ విజృంభణ 

కరోనా రెండో దశ వేగంగా విజృంభిస్తోంది. బాధితుల్లో చిన్నారులు, యువత సంఖ్య పెరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల మేరకు రాష్ట్రంలో ఈ నెలలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 56.4 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇప్పటివరకు 43.2 శాతం కేసులు 21-40 ఏళ్ల యువతలో నిర్ధారణ అయ్యాయి. విద్య, ఉపాధి అవసరాలకు బయటకు రావడంతో మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా లక్షణాలు తీవ్రం కావడంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనంతరం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ వాహనంలో తీసుకెళ్లారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. ఆక్సిజన్‌ మీదే 60% మంది 

మలిదశలో కొవిడ్‌ బారిన పడుతున్న వారిలో దాదాపు 60-70% మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతోంది. బాధితుల ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ 94 కంటే తగ్గినప్పుడు బయటి నుంచి కృత్రిమంగా ఆక్సిజన్‌ అందిస్తారు. తొలిదశలో కంటే ఈసారి ఈ అవసరం ఎక్కువగా ఉంటోందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడం, ఊపిరితిత్తులకు అది నేరుగా నష్టం కలిగించడంతో ఆక్సిజన్‌ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఐసీయూ పడకలన్నీ ఫుల్‌

4. ఐసీయూలో మంటలు..13మంది మృతి

మహారాష్ట్రలోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్‌ జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో 13 మంది రోగులు మృతిచెందారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ!

దేశంలో పలుచోట్ల కొవిడ్‌ బాధితులకు ప్రాణవాయువు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో... సూరత్‌లోని న్యూ సివిల్‌ హాస్పిటల్‌ తనవంతుగా ఆ లోటును తీరుస్తోంది. ఇక్కడ గాలి నుంచి నిమిషానికి 2 వేల లీటర్ల మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నారు. సూరత్‌లో కొవిడ్‌ బాధితుల కోసం నిత్యం 250 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. బంధాలను చిదిమేసి.. బతుకుల్ని కుదిపేసి!

ప్రతి ఒక్కరినీ ఇప్పుడు రెండో దశ కరోనా ఉద్ధృతి కలవరపెడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే..నిబంధనలు పాటించకుంటే.. చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ మొత్తాన్ని చుట్టేస్తోంది. బంధాలను దూరం చేస్తూ... బతుకును ఆర్థికంగా భారంగా మారుస్తోంది. తాళ్లపూడి మండలంలో జరిగిన సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

ఇదీ చదవండి: రెండో దశ దోపిడీ!

7. ఇజ్రాయెల్‌లో ఇక మాస్కులు అక్కర్లేదు!

ఇజ్రాయెల్‌లో ఇక మాస్కులు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో మునుపటిలా స్వేచ్ఛగా తిరిగేయొచ్చు! మార్కెట్లు, మాల్స్‌, ప్రార్థనా స్థలాలు, దుకాణాలకు అవి లేకుండానే వెళ్లొచ్చు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న గత ఆదేశాలను ప్రభుత్వం ఆదివారమే రద్దు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుంటే... ఇదేం నిర్ణయం అనుకుంటున్నారా.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. పడిక్కల్‌ పిడుగల్లే..

ఏమా షాట్లు! ఏమా ఆట! కొడితే సిక్సరే.. బ్యాట్‌కు గట్టిగా తగిలితే బౌండరీనే! రాజస్థాన్‌ చేసిన 177 పరుగులు ఉఫ్‌! కష్టపడి అంతా కలిసి కూర్చిన స్కోరు వాళ్లిద్దరి దెబ్బకు దిగొచ్చింది! పిడుగల్లే శతకంతో విరుచుకుపడిన పడిక్కల్‌.. అతడికి మెరుపల్లే చేదోడుగా నిలిచిన కోహ్లి లక్ష్యాన్ని చిన్నది చేసేశారు. రాజస్థాన్‌ బౌలర్లను ఉతికి ఆరేసి ఈ ఐపీఎల్‌లో బెంగళూరుకు వరుసగా నాలుగో విజయాన్ని కట్టబెట్టారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కరోనా చిక్కుల్లో ఉన్నారా? మీకోసమే ఈ యాప్‌!

ఆహారం, ఆక్సిజన్‌, ప్లాస్మా, మందులు.. ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం. వాటికోసం చేయని ప్రయత్నం లేదు. అర్థించని చేతుల్లేవు. రోజురోజుకీ విపరీతంగా కేసులు పెరుగుతుండటంతో అన్నింటికీ కొరత ఏర్పడుతోంది. దేనికోసం ఎక్కడ, ఎవరిని, ఎలా సంప్రదించాలి అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు అంతా అగమ్యగోచరం. అవును.. ఎవరిని అడగాలి..? ఈ ప్రశ్నకు సమాధానమై.. కొవిడ్‌ బాధితులకు వెలుగు దారుల్ని చూపుతున్నారు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. సొంతిల్లు కొంటున్నారా?

సొంతిల్లు... అందరి కల. గృహరుణం వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటంతో చాలామంది ఈ కలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకోవడం ఇప్పుడు సులభమే. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. చిన్న పొరపాటు చేసినా.. మీ ఇతర ఆర్థిక లక్ష్యాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని