Top 10 News @ 9AM

తాజా వార్తలు

Updated : 24/04/2021 09:28 IST

Top 10 News @ 9AM

1. రోజుకు 10 లక్షల కేసులు.. 5 వేల మరణాలు

భారత్‌లో కొవిడ్‌-19 విజృంభణ.. మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ పేర్కొన్నారు. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ (ఐహెచ్‌ఎంఈ) నమూనా సాయంతో ఆమె విశ్లేషించారు. ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ప్రాణవాయువు కోసం హైరానా

రాష్ట్రంలో కరోనా కేసుల తాకిడి వల్ల ప్రాణవాయువు అవసరాలు పెరుగుతున్నాయి. కొవిడ్‌ సోకి ఆయాసం, దగ్గు, జ్వరం ఇతర లక్షణాలు తీవ్రంగా ఉన్న కొందరిలో ప్రాణవాయువు స్థాయి పడిపోతోంది. వారికి ఆక్సిజన్‌ అవసరమవుతోంది. ప్రస్తుతం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌.. కొవిడ్‌ కేసుల పెరుగుదలకు తగినట్లుగా సరిపోవడం లేదు. కొవిడ్‌, నాన్‌కొవిడ్‌ చికిత్సలకు కావాల్సిన ప్రాణవాయువు కోసం యాజమాన్యాలు హైరానా పడుతున్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. నిర్లక్ష్యం ఖరీదు.. నిండు ప్రాణం

కొవిడ్‌ బారిన పడి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్న అనేకమంది రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతోపాటు ఇతరత్రా వ్యాధులున్న చాలామంది గత రెండు రోజులుగా మృత్యువాత పడ్డారు. చాలామంది ఆక్సిజన్‌ శాతం తగ్గిన తరువాతే ఆస్పత్రులకు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. చాలామంది వారం, పది రోజులపాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నా పరీక్ష చేయించుకోవడం లేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. పంజాబ్‌ పంచ్‌

హ్యాట్రిక్‌ ఓటములతో తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ మళ్లీ గాడిలో పడింది. నెమ్మదైన పిచ్‌పై మొదట బౌలింగ్‌లో ముంబయిని కట్టిపడేసి.. ఆ తర్వాత ఓపిగ్గా లక్ష్యాన్ని ఛేదించేసి స్ఫూర్తినిచ్చే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌ వైఫల్యాన్ని కొనసాగిస్తూ భారీ స్కోరు చేయడంలో మరోసారి విఫలమైన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. కరోనా సోకినా వైద్య సేవలోనే..

తాము ఆపదలో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు గుజరాత్‌కు చెందిన ఇద్దరు వైద్యులు. భావ్‌నగర్‌లోని బజరంగ్‌దాస్‌ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్‌ హిరేన్‌ కవా, డాక్టర్‌ భవేశ్‌ సోలంకిలకు కరోనా సోకింది. తీవ్ర అనారోగ్య లక్షణాలేవీ లేకపోవడంతో ఇంట్లోనో, మరో చోటో స్వీయం నిర్బంధంలో ఉండటానికి వారు ఇష్టపడలేదు. పీపీఈ కిట్లు ధరించి తమ ఆస్పత్రిలోనే కొవిడ్‌ బాధితుల వార్డులో ఉంటూ.. వారికి చికిత్స అందిస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. దూసుకుపోతున్న బుల్లెట్లు!

అతి ఎత్తైన ఘాట్‌ రోడ్లు... అటూ ఇటూ వేల అడుగుల లోయలు... అత్యంత ప్రమాదకరమైన మలుపులు... అలాంటి చోట్ల బైక్‌ ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ ఇద్దరమ్మాయిలు... ఒంటరిగానే ఈ యాత్రలు చేస్తున్నారు. అంతేనా! ఆ ప్రయాణాల్ని, అక్కడి వింతలు, విశేషాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వారి యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు లక్షల మంది ఫాలోవర్లు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. 18 ఏళ్లు దాటిన వారికి టీకా ఎలా? 

వచ్చేనెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకాలను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పచ్చజెండా ఊపడంతో.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 18-44 ఏళ్ల మధ్యవయస్కులు సుమారు 1.82 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం వీరికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత రాలేదు. దీని కార్యాచరణపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. కొత్త ఔషధం విరాఫిన్‌

కొవిడ్‌-19 వ్యాధికి ఒక కొత్త ఔషధాన్ని క్యాడిలా హెల్త్‌కేర్‌ దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. యాంటీ- వైరల్‌ తరగతికి చెందిన విరాఫిన్‌ (పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2బి) అనే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ‘అత్యవసర అనుమతి’ మంజూరు చేసింది. కొవిడ్‌-19 వ్యాధి ప్రారంభ దశలోనే ఈ మందు తీసుకున్న పక్షంలో త్వరగా కోలుకోవడంతో పాటు, ఆరోగ్యం విషమించే అవకాశాలు ఉండవని క్యాడిలా హెల్త్‌కేర్‌ వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కావద్దోయ్‌.. బెట్టింగ్‌ బంగార్రాజులు

వినోదం పంచాల్సిన క్రికెట్‌ను విషాదానికి వేదికగా మార్చేస్తున్నారు... సిక్స్‌ కొట్టినా, ఫోర్‌ బాదినా చిందులేయాల్సింది పోయి.. తీవ్ర ఒత్తిడితో చిత్తైపోతున్నారు... బంతి బంతికీ ఆస్వాదించాల్సింది పోయి పందాలు కాసి ఆర్థికంగా చితికిపోతున్నారు... రాత్రికి రాత్రే లక్షలు పోగేసుకోవాలనే అత్యాశతో  అప్పుల పాలవుతున్నారు... బెట్టింగ్‌ ఊబిలో సర్వం కోల్పోయి చివరికి ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు కొందరు... ఐపీఎల్‌ జోరు మీదున్న ఈ సమయంలో యువత ఈ మత్తులోంచి బయట పడే మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. జాగరూకత.... జాగ్రత్తతో... పనిచేస్తుంటే...!

చిత్రీకరణ ఆపకూడదన్న పట్టుదల.. సినిమా పూర్తి చేయాలన్న తపనుంటే.. ఆ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నిలువెల్ల జాగ్రత్త... అనుక్షణం అప్రమత్తత.. ఆయుధాలుగా కరోనా మహమ్మారిని దరిచేరనీయకుండా లక్ష్యం నెరవేర్చు కుంటున్నాయి సినీ బృందాలు. కష్టకాలంలో పలువురికి ఉపాధి చూపుతున్నాయి. కరోనా భయపెడుతున్నా చిత్రీకరణలో బాలకృష్ణ గర్జన కొనసాగుతోంది. అల్లు అర్జున్‌ సైతం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని