Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 24/04/2021 12:59 IST

Top 10 News @ 1PM

1. CoronaVirus: ఉసురు తీస్తోన్న మహమ్మారి

రెండోదశలో కరోనావైరస్‌ కనికరం లేకుండా కాటేస్తోంది. శ్వాసవ్యవస్థ మీద దెబ్బకొట్టి.. రోగుల ఉసురుతీస్తోంది. రికార్డు స్థాయిలో సంక్రమిస్తూ, వైద్య వ్యవస్థను కుప్పకూల్చుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ కల్లోల పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,53,569 మందికి కొవిడ్ నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా..3,46,786 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం

భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు నేలకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు సీజేఐగా ఉన్న ఎస్‌.ఎ.బోబ్డే పదవీకాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ రమణ 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగుతారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. వైద్యారోగ్య శాఖకు కేసీఆర్‌ కీలక ఆదేశాలు

దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీలో ఘోరం: ఆక్సిజన్‌ అందక 20మంది మృతి

దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాణవాయువు అందక పలు చోట్ల రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఆక్సిజన్‌ అందక దిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది రోగులు మృతిచెందినట్లు ఆస్పత్రి యాజమాన్యం శనివారం వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బైడెన్‌.. భారత్‌కు సాయం చేయండి!

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. భారత్‌కు వీలైనంత త్వరగా సాయం అందజేయాలని శ్వేతసౌధానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సహా ఇతర కొవిడ్‌ టీకాలు, అవసరమైన వైద్య సామగ్రి పంపాలని యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు, ప్రముఖ భారతీయ అమెరికన్లు బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మేం సేకరించిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగానే: కేంద్రం

తాము  సేకరించే కరోనా వ్యాక్సిన్లను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీకా పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. ‘‘భారత్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ. 150 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. అలా సేకరించిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నాం. ఇకపై కూడా అది కొనసాగుతుంది’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ట్వీట్‌ చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘‘మా బ్యాటింగ్ లైనప్‌లో ఏదో మిస్సయింది’’

శుక్రవారం చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్‌, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. దీంట్లో పంజాబ్ కింగ్స్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద 131 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6), సూర్యకుమార్ యాదవ్‌ (33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్.. ఒక వికెట్ నష్టపోయి 17.4 ఓవర్లలో ఛేదించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ప్రచారాలు, ప్రాజెక్టులపై కాదు..ఆరోగ్యంపై దృష్టి పెట్టండి!

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అవనసర ప్రచారాలు, ప్రాజెక్టులపై కంటే ముందు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.‘కేంద్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే.. ప్రచారం, అనవసర ప్రాజెక్టులపై ఖర్చు చేయడం కంటే వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ సహా ఇతర వైద్య అవసరాలపై దృష్టి సారించండి. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారనున్నాయి అని అన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ!

మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. ముంబయిలోని ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అధికారులు శనివారం ఉదయం సోదాలు చేపట్టారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలపై శుక్రవారం నాటికి ప్రాథమిక విచారణ పూర్తయిందని అధికారులు తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మరోసారి ఉదారత చాటుకున్న రియల్‌హీరో

రియల్‌హీరో సోనూసూద్‌ తన సేవాగుణాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్‌ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ యువతికి ప్రత్యేక చికిత్స అందించేందుకు సోనూ ముందుకు వచ్చారు. అంతేకాకుండా చికిత్స కోసం ఆమెను నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు.  మహారాష్ట్రకు చెందిన భారతి అనే యువతి ఇటీవల కొవిడ్‌ బారిన పడి నాగ్‌పూర్‌ ఆస్పత్రిలో చేరారు. వైరస్‌ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 85శాతం వరకు దెబ్బతిన్నాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని