Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 26/04/2021 08:59 IST

Top 10 News @ 9AM

1. పాజిటివిటీ 10% దాటితే మినీ లాక్‌డౌన్‌లు 

కరోనా వైరస్‌ విశృంఖల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన; ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో విషాదం

విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఇద్దరు కొవిడ్‌ రోగులు మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో ఇద్దరు మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. కార్యాలయాల్లో కరోనా కలకలం 

వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు, జూనియర్‌ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు... ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో స్థాయి అధికారి కరోనాతో ప్రాణాలు విడుస్తున్నారు. ఐదు రోజులుగా పదిమంది రెవెన్యూ సిబ్బంది కన్నుమూశారు. 30 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ధరణి రిజిస్ట్రేషన్లు, భూముల వ్యవహారాలు, సర్వే విధుల్లో పాల్గొంటున్న వారిపై కరోనా పంజా విసురుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Oscars 2021: విజేతలు వీరే

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు నేడు కన్నుల పండువగా జరుగుతోంది. కొవిడ్‌ కారణంగా మొట్టమొదటిసారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. కాటికి చేర్చలేం.. ఇంటికి తీసుకెళ్లలేం!

ఇంటిమనిషి దూరమైన బాధలో ఉన్న కుటుంబాలను ప్రైవేటు ఆసుపత్రులు, దళారుల దోపిడీ మరింత కుంగదీస్తోంది. రాత్రిపూట ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు మరణిస్తే అటు ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని తీసుకెళ్లమని ఒత్తిడి చేస్తున్నాయి. ఆ సమయానికి శ్మశానాలకు కూడా తరలించలేని పరిస్థితి ఉండటంతో శవాగారాలు, ఫ్రీజర్ల కోసం కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. బెంగాల్‌లో మొదలైన ఏడో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం ఏడో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 34 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 34 స్థానాల పరిధిలో 86లక్షల ఓటర్లు ఉండగా.. 12,068 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. పిల్లలపై కొవిడ్‌ పిడుగు 

తెలంగాణలో విజృంభిస్తున్న కొవిడ్‌ పసిపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొదటి దశతో పోల్చితే రెండో దశ వారి పాలిట పిడుగుపాటులా పరిణమిస్తోంది. రాష్ట్రంలో పదేళ్లలోపు బాలబాలికల్లో రోజురోజుకు నమోదవుతున్న కేసులే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 3,95,232 కేసులు నమోదవగా.. అందులో 2.7శాతం (10,671) పదేళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. రక్షించేది సూక్ష్మ పోషకాలే! 

మన చుట్టూ విష వలయం.  తప్పించుకునే దారి లేదు. ఎదుర్కోవడమే మనముందున్న మార్గం. కరోనా మహమ్మారిని జయించడానికి శరీరాన్ని ఓ ఆయుధగా మార్చుకోవాలి. దాన్ని శక్తి సంపన్నం చేసుకోవాలి. అందుకు మంచి ఆహారమే మార్గం. ఏది మంచి ఆహారం? వైరస్‌తో పోరాడాలంటే ఏం తినాలి..? తదితర అంశాలపై జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డా.ఎ.లక్ష్మయ్య సూచనలు చూద్దాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. మూడో దశను.. ముందే గుర్తించొచ్చు! 

కొవిడ్‌ రెండో దశ (వేవ్‌) కోరలు చాస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఒక్కడే ఓడించాడు

బ్యాటింగ్‌లో జడేజానే.. బౌలింగ్‌లోనూ అతనే! అరె.. ఫీల్డింగ్‌లో కూడా అతనే.. ఇలా ఎక్కడ చూసినా జడ్డూనే. నిఖార్సైన ఆల్‌రౌండర్‌కు నిర్వచనంలా.. అసలైన క్రికెటర్‌కు పర్యాయపదంలా అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన అతను.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఐపీఎల్‌-14లో అజేయంగా సాగుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు తొలి ఓటమి రుచి చూపించాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని