Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 27/04/2021 12:55 IST

Top 10 News @ 1PM

1. corona : కాస్త తగ్గిన ఉద్ధృతి..

దేశంలో కరోనా ఉద్ధృతి ప్రజలను ఆందోళనలోకి నెట్టేస్తోంది. సోమవారం 16,58,700 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..3,23,144 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా 2,771 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అయితే క్రితం రోజు(3.52లక్షల కేసులు...2,812 మరణాలు)తో పోల్చుకుంటే కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. TS Corona : పది వేలు దాటిన కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా 10,122 కేసులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరోవైపు మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కొవిడ్‌తో చికిత్స పొందుతూ52 మంది ప్రాణాలు కోల్పోయారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు, ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు  ఎలాంటి సంబరాలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే సయమంలో వారి వెంటనే ఇద్దరు మించి ఉండరాదని ఆదేశించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Sputnik V: మే 1న భారత్‌కు.. 

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌ వి’ అతి త్వరలో దేశానికి రానుంది. తొలి బ్యాచ్‌ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ సోమవారం వెల్లడించారు. అయితే తొలి కన్‌సైన్‌మెంట్‌లో ఎన్ని టీకాలు ఉండనున్నాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారన్న విషయాలపై ఆయన స్పష్టతనివ్వలేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. నిండా ముంచుతున్న నిర్లక్ష్యం

గ్రేటర్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల అనుభవాలివి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే ధైర్యంతో స్వేచ్ఛగా విహరించటమే తమ పరిస్థితికి కారణమంటూ వాపోయారు. ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి కార్డియాలజిస్టు తాను వైద్యం అందిస్తున్న బాధితులు చేస్తున్న తప్పిదాలను వివరించారు. తమకు వైరస్‌ సోకినట్టు గుర్తించటంలో జరుగుతున్న జాప్యం.. కొన్నిసార్లు వెంటిలేటర్‌ వరకూ తీసుకెళ్తోందని ఆందోళన వెలిబుచ్చారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే హృదయ విదారక స్థితిని మించిపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. Global Task force: భారత్‌కు అండగా అమెరికా కంపెనీలు!

కరోనా విలయానికి తల్లడిల్లుతున్న భారతావనికి అండగా నిలిచేందకు యావత్తు ప్రపంచం ముందుకు వస్తోంది. ఇప్పటికే పలు దేశాలు తమ సాయాన్ని ప్రకటించగా.. తాజాగా అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఏకమయ్యాయి. అగ్రరాజ్యంలో పేరెన్నికగన్న దాదాపు 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చాయి. ఓ కార్యదళంగా (Task force) ఏర్పడి భారత్‌కు కావాల్సిన సహకారం అందించాలని నిర్ణయించాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. భారత విమానాలపై ఆస్ట్రేలియా నిషేధాజ్ఞలు!

భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్‌ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘భారత్‌ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్‌ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు నిర్ణయించాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కాస్త ఆటగాళ్లను అరువివ్వరూ..!

వివిధ కారణాలతో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్‌ రాయల్స్‌.. వాళ్ల ఆటగాళ్లను అరువు ఇవ్వమని మిగిలిన ప్రాంఛైజీలను కోరింది. గాయాల కారణంగా స్టోక్స్‌, ఆర్చర్‌ ఆ జట్టుకు దూరమవగా.. బబుల్‌ ఆందోళనతో లివింగ్‌స్టన్‌, పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోతానేమోననే భయంతో ఆండ్రూ టై తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ జట్టుపై గట్టి ప్రభావమే పడింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ఛాతీ సీటీ స్కాన్‌ ఎప్పుడు?

కరోనా జబ్బు వచ్చిందనగానే చాలామంది మొదట్లోనే ఛాతీ సీటీస్కాన్‌ చేయించుకుంటున్నారు. ఇది కరోనా మూలంగా ఊపిరితిత్తుల్లో తలెత్తే మార్పులను పసిగట్టటానికే తప్ప జబ్బు నిర్ధారణకు కాదనే సంగతిని గుర్తించాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష పాజిటివ్‌గా ఉండి ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంటే, ఏడు రోజులైనా జ్వరం తగ్గకుండా వేధిస్తుంటే.. అప్పుడు ఛాతీ సీటీ స్కాన్‌ అవసరమవుతుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని