Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 28/04/2021 12:59 IST

Top 10 News @ 1PM

1. Corona విలయం..3,293 మరణాలు

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు..వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు కరోనా విపత్కర పరిస్థితులను కళ్లకుకడుతున్నాయి. దేశంలో తొలిసారిగా మరణాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో 3 వేలు దాటింది. తాజాగా 3,293 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దాంతో మరణాల సంఖ్య రెండు లక్షల మార్కు(2,01,187)ను దాటింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. ఒక్క డోసు చాలు.. ఇంట్లోవ్యాప్తి 50% తగ్గినట్లే!

కరోనా వ్యాప్తి విషయంలో ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు కీలక విషయం వెలుగులోకి తెచ్చారు. వ్యాక్సిన్‌.. కరోనా వైరస్‌ నుంచి రక్షించడమే కాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహిస్తాం

రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.  రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని.. విపత్కర సమయంలోనూ అగ్గిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  విద్యార్థుల భవిష్యత్‌ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని.. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదని జగన్‌ అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని వివరించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. CovidVaccine: సాయంత్రం నుంచి రిజిస్ట్రేషన్‌

కరోనా మహమ్మారిని తరిమికొట్టే మరో బృహత్తర కార్యక్రమం ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకా పంపిణీ మొదలవనుంది. ఇందుకోసం అర్హులైన వారందరూ తమ పేర్లను ఏప్రిల్‌ 28 నుంచి కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే.. మూడో దశ టీకా పంపిణీకి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సమయాల్లో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. బుధవారం సాయంత్రం  4 గంటల నుంచి నమోదు ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. Allu Arjunకి కరోనా పాజిటివ్‌
తెలుగు చిత్రపరిశ్రమలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లు, ఇతర నటీనటులు వైరస్‌ బారినపడగా తాజాగా కథానాయకుడు అల్లు అర్జున్‌ సైతం ఆ జాబితాలో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవసరమైన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటిస్తూ ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేట్‌ అయ్యాను అని తెలిపారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. Delhi: ఇక నుంచి ప్రభుత్వం అంటే ఎల్జీనే

దేశ రాజధాని దిల్లీలో ఇక నుంచి ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. ఈ మేరకు వివాదాస్పద ‘ది గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ(సవరణ) చట్టం-2021’ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త చట్టం ప్రకారం.. దిల్లీలో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎల్జీ అనుమతి తప్పనిసరి. ఏప్రిల్‌ 27 మంగళవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. TS Corona : కొత్తగా 8061 కేసుల నమోదు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8061 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో పోరాడుతూ మరో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2150కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం 72,133 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82,270 పరీక్షలు నిర్వహించారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1508 కేసులు వెలుగులోకి వచ్చాయి.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ‘రిషభ్ పంత్‌ భవిష్యత్ కెప్టెన్‌’

భుజం గాయం కారణంగా ఐపీఎల్ 14 సీజన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అతని స్థానంలో దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు రిషభ్ పంత్. ఇప్పటివరకు పంత్ ఆరు మ్యాచులకు నాయకత్వ బాధ్యతలు వహించగా.. నాలుగు మ్యాచుల్లో దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో దిల్లీ పరాజయం పాలైంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కనీసం 17 దేశాల్లో భారత్‌ రకం కరోనా

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన కరోనా బి.1.617 వైరస్‌ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో ఈ వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. బి.1.617 జంట ఉత్పరివర్తనాల వైరస్ రకం. తొలిసారిగా ఇది భారత్‌లో బయటపడగా.. యూకే, సింగపూర్‌ సహా పలు దేశాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తన వీక్లీ అప్‌డేట్‌లో తెలిపింది. అయితే ప్రస్తుతానికి ఇది ప్రాణాంతకం అని ప్రటించలేమని పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. ధ్యానానికి యాప్‌ సాయం!

అసలే ఉరుకుల పరుగుల జీవితాలు. ఆపై కరోనా భయం. దీంతో ఎంతోమంది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. వీటికి యాప్‌లు ఓ ‘మెడిటేషన్‌’ మార్గం చూపెడుతున్నాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఇవి ఉచితంగా, రుసుముతో అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ప్రయాణాలు చేస్తున్నా కూడా ఇట్టే ధ్యానంలో మునిగిపోవచ్చు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని