Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 30/04/2021 08:56 IST

Top 10 News @ 9AM

1. Corona.. వద్దు హైరానా!

కరోనా కమ్ముకుంటోంది. రెండో విడతలో విరుచుకుపడుతోంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది దీని బారిన పడుతున్నారు. కుటుంబంలో ఒక్కరికి వైరస్‌ సోకితే మిగతా వారికీ సులభంగా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో జనంలో ఎన్నో భయాలు నెలకొంటున్నాయి. కొందరైతే పాజిటివ్‌ వచ్చిన వెంటనే లక్షణాలతో పని లేకుండా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. చాలామందిలో వ్యాధి కంటే భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. నిబ్బరం చెదరలేదు... జెండా దించలేదు! 

రాజధాని అమరావతి కోసం అక్కడి ప్రజలు, రైతులు, రైతు కూలీలూ గాంధేయమార్గంలో చేస్తున్న పోరాటం శుక్రవారానికి 500వ రోజుకి చేరుతోంది...! ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో వారు న్యాయం కోసం, సాయం కోసం తొక్కని గడపలేదు... కలవని రాజకీయ నాయకుడు లేడు... తమ గోడును విన్నవిస్తూ దేశ ప్రధాని మొదలు అనేక మంది నాయకులకు లేఖలు రాశారు. దిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని, వివిధ పార్టీల నాయకుల్ని కలసి మద్దతివ్వాలని అభ్యర్థించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. తెలంగాణలో మినీ పుర పోరు ప్రారంభం

తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. వరంగల్‌ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్‌, జడ్చర్ల, కొత్తూరు పురపాలక సంఘాలకు ఓటింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. మొత్తం 11,34,032 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. మూడు పొరల వస్త్ర మాస్కు మంచిదే 

కొవిడ్‌-19 నుంచి రక్షణ పొందడానికి సర్జికల్‌ మాస్కులు మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం లేదని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖానికి సరిగా అమరిన, మూడు పొరలు కలిగిన వస్త్ర మాస్కునూ పెట్టుకోవచ్చని చెప్పారు. ఇది కూడా సర్జికల్‌ మాస్కు స్థాయిలో పనిచేస్తుందన్నారు. మాస్కుల సమర్థతను పరీక్షించే ఉద్దేశంతో బ్రిస్టల్‌, సరే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ఆలస్యం.. ప్రాణాంతకం! 

రాష్ట్రాన్ని కరోనా టీకాలు, వ్యాధి నిర్ధారణ కిట్ల కొరత వేధిస్తోంది. పలు జిల్లాలు, మండలాలకు గురువారం వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోగా.. కరోనా పరీక్ష కిట్లూ అరకొరగా వచ్చాయి. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో ‘టీకా నోస్టాక్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. అక్కడికి వచ్చినవారు నిరాశగా వెనుదిరిగారు. కొన్ని రోజులుగా వీటి కొరతతో ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. చిన్నోడు చితక్కొట్టేశాడు

అలా ఇలా కొట్టలేదు పృథ్వీ షా! కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడతను! ఈ కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తేలిపోయింది.. ఆ జట్టు బౌలర్లను ఆటాడేసుకున్న షా.. దిల్లీని అలవోకగా గెలిపించాడు. అంతేకాదు గత మ్యాచ్‌లో ఓడిన తమ జట్టును మళ్లీ గాడిలో పెట్టాడు. మరోవైపు వరుసగా నాలుగు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌ నెగ్గి ఊపిరి పీల్చుకున్న కోల్‌కతా మరోసారి ఓటమి బాట పట్టింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌ కన్నుమూత

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్‌(54) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కె.వి.ఆనంద్‌ మృతితో తమిళ చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇటీవల కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ సైతం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. ఇజ్రాయెల్‌లో తొక్కిసలాట.. 40 మంది మృతి

ఉత్తర ఇజ్రాయెల్‌లోని మౌంట్‌మెరోన్‌ పవిత్ర స్థలం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. యూదుల పండగ లాగ్‌ బౌమర్‌ సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రార్థనలు చేస్తుండగా.. మౌంట్‌ మెరోన్‌లోని పైకప్పు కూలింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుని 40 మంది మృతి చెందినట్లు సమాచారం. వంద మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కొరత అని వారు.. లేదని వీరు

పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి కరోనా టీకా వేయడానికి ఉద్దేశించిన తేదీ (మే 1) దగ్గర పడినా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం మాత్రం కొలిక్కిరావడం లేదు. ప్రస్తుతం ఉన్న అరకొర నిల్వలతో అందరికీ టీకాలు వేయడం తమ వల్ల కాదని ఒక్కో రాష్ట్రం చేతులెత్తేస్తున్నాయి. కేంద్రం మాత్రం.. రాష్ట్రాల వద్ద ఇంకా కోటి డోసులు అందుబాటులో ఉన్నాయని చెబుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. బీమా ఉన్నా.. చెల్లదంటే..

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వస్తోందో చెప్పలేని పరిస్థితి. ఆరోగ్య బీమా ఉందన్న ధీమాతో.. ఆసుపత్రికి వెళ్తే.. డబ్బు కడితే కానీ చేర్చుకోం అంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ..ఏం ఉపయోగం అనే సందేహం వస్తోంది.. ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో ఏం చేయాలి? తెలుసుకుందాం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని