Top 10 News @ 1PM

తాజా వార్తలు

Published : 30/04/2021 12:58 IST

Top 10 News @ 1PM

1. Corona: మూడో రోజు 3వేలకు పైనే మరణాలు

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయానికి యావత్ భారతావని చిగురుటాకులా వణికిపోతోంది. చాపకింద నీరులా దేశం నలుమూలలకు విస్తరించిన కొవిడ్‌.. లక్షల మందిపై ప్రతాపం చూపిస్తోంది. నిత్యం వేల మందిని బలితీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన గణాంకాలు వైరస్‌ ఉద్ధృతిని కళ్లకు కడుతున్నాయి. తాజాగా మరో 3.86లక్షల మంది కొవిడ్‌ బారినపడగా.. వరుసగా మూడో రోజు 3వేల మందికి పైనే మృత్యువాతపడ్డారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. EC: ‘వాటిని ప్రచురించకుండా నిలువరించండి’

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతికి ఎన్నికల సంఘమే(ఈసీ) కారణమంటూ మద్రాస్‌ హైకోర్టు చేసిన పదునైన వ్యాఖ్యలపై మీడియా ప్రచురించిన కథనాలపై ఈసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కరోనా విజృంభణకు ఈసీయే ఏకైక కారణమన్నట్లుగా మీడయా వార్తల్ని ప్రచురించిందని వాపోయింది. ఈ నేపథ్యంలో కోర్టు చేసే మౌఖిక వ్యాఖ్యల్ని ప్రచురించకుండా మీడియా సంస్థల్ని నిలువరించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టులో ఈసీ పిటిషన్‌ వేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Amaravati: 5వేల రోజులైనా పోరాడతాం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మహిళలు, రైతులు రోడ్లపైకి వచ్చి గత కొన్నిరోజులుగా తమ నిరసన తెలియజేస్తున్నారు. రైతుల పోరాటం శుక్రవారం 500 రోజులకు చేరింది. ఈ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Proning: కరోనా జయించిన 82 ఏళ్ల బామ్మ

రెండో దశలో కరోనా నేరుగా శ్వాసవ్యవస్థపై దెబ్బకొడుతుంటడంతో ప్రాణవాయవుకు డిమాండ్‌ పెరుగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 82 ఏళ్ల బామ్మ ఆక్సిజన్‌ అవసరం లేకుండానే వైరస్‌ను జయించారు. ‘ప్రోనింగ్‌’ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుకుని కేవలం 12 రోజుల్లోనే కరోనా నుంచి క్షేమంగా బయటపడ్డారు. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని అలీనగర్‌ ప్రాంతానికి చెందిన 82ఏళ్ల విద్య శ్రీవాస్తవ ఇటీవల కరోనా బారినపడ్డారు. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. ‘ఓ ఎమ్యేల్యే అయి ఉండి ఏమీ చేయలేకపోతున్నా’

దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. TS Corona : 7646 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,091 నమూనాలను పరీక్షించగా.. 7646 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో పోరాడుతూ 53 మంది మృతి చెందడంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2261కి చేరింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. భారత్‌ చేరిన అమెరికా సాయం!

అమెరికా నుంచి బయల్దేరిన  అత్యవసర సహాయం, పరికరాలు నేడు భారత్‌ చేరుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది. ‘‘కొవిడ్‌తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఇతర సాయంలో అవసరమైన తొలివిడత షిప్‌మెంట్‌ భారత్‌కు చేరింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. Sehwag: ‘మ్యాచ్‌లు బోర్‌ కొడుతున్నాయి’

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా కథ మారలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన మోర్గాన్‌ సేనలో రసెల్ (45), శుభమన్‌ గిల్ (43) రాణించడంతో 154 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (82), శిఖర్ ధావన్ (46) పరుగులతో మెరవడంతో దిల్లీ క్యాపిటల్స్‌ 21 బంతులు మిగిలుండగానే విజయతీరాలను చేరింది.ఈ నేపథ్యంలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. వాళ్లకి ఉచిత విద్య అందించండి

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ కోరారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేస్తోన్న ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. దేశంలో నానాటికీ విజృంభిస్తోన్న కరోనా బారిన పడి ఎంతోమంది మృతి చెందుతున్నారని.. దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. Corona: భారత ఉద్యోగుల్లో ఆందోళన.. ఆశాభావం!

కరోనా కారణంగా ఉద్యోగుల్లో ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరిగాయని.. అయితే భవిష్యత్‌పై భారతీయులు సానుకూలంగానే ఉన్నారని ఓ సర్వేలో తేలింది. నవంబరు 17 నుంచి డిసెంబరు 11, 2020 మధ్య జరిపిన సర్వేలో 17 దేశాలకు చెందిన మొత్తం 32,471 సిబ్బంది పాల్గొన్నారు. కరోనా సమయంలో తమ ఆర్థిక, ఉద్యోగ భద్రతపై ఆందోళనగా ఉన్నామని 95 శాతం భారతీయ సిబ్బంది పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని