Top 10 News @ 9AM

తాజా వార్తలు

Published : 02/05/2021 08:55 IST

Top 10 News @ 9AM

1. ఐదు అసెంబ్లీల ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. Corona: ఆలస్యం.. ప్రాణాంతకం 

రెండోదశలో కొవిడ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అప్పటి వరకూ బాగానే ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. పరిస్థితి విషమించే వరకూ ఇంట్లోనే ఉండి ఏదో ఒక వైద్యం పొందడం వల్ల ప్రాణాల మీదకొస్తోంది. ముప్పు తీవ్రమైందని తెలిసిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ పడకల కోసం తిరగడంలోనూ విలువైన సమయం వృథా అవుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Etala Rajender: అంతా కుట్రపూరితం 

‘‘ఫిర్యాదులపై విచారణ చేసి.. న్యాయం ఏమిటో, అన్యాయమేమిటో తేల్చిన తర్వాత చర్యలు తీసుకోవటం లేదు. ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని అన్నీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా వ్యక్తిత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు చూస్తున్నారు. వీటన్నింటికీ రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత పరిణామాలు కుట్రబుద్ధితో జరుగుతున్నాయని యావత్తు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు’’ అని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. Corona Cases: నిమిషానికి ముగ్గురు 

రాష్ట్రంలో ఏప్రిల్‌లో కరోనా విశ్వరూపం చూపింది. రెండో దశ మహమ్మారి విజృంభణతో కేసులు భారీగా పెరిగాయి. ఒక్కనెలలోనే 1,34,584 కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 30.35 శాతం కావడం గమనార్హం. ఏప్రిల్‌లో సగటున రోజుకు 4,486.13 మంది, గంటకు 186.92 మంది, నిమిషానికి 3.11 మంది  వైరస్‌ బారిన పడ్డారు. పాజిటివ్‌ రేటు 10 శాతానికి చేరువలో నమోదవుతోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. Australia: భారత్‌ నుంచి వస్తే అయిదేళ్ల జైలు

కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న భారత్‌ నుంచి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తే వారికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.38లక్షలు (66వేల ఆస్ట్రేలియా డాలర్లు) మేర జరిమానాలలో ఏదో ఒకదానిని లేదా రెండింటినీ విధించనున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని, మే 15 తర్వాత పునఃసమీక్షిస్తామని ఆరోగ్య మంత్రి గ్రెగ్‌ హంట్‌ను ఉటంకిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. Amara Raja: కరెంట్‌ కట్‌ 

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దాంతో శనివారం నుంచి పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్‌ నోటీసును జారీ చేసింది. విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. MI vs CSK: ఛేదంచేశారు..

మాటిమాటికి అంపైర్లు బంతి కోసం బౌండరీ లైన్‌ బయటకు చూడడం! హా.. సిద్ధంగా ఉన్నానంటూ అక్కడే ఉన్న మరో అంపైర్‌ బంతులతో కూడిన పెట్టెతో మైదానంలోకి పరుగులు పెట్టడం.. ఇదీ చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌లో తరచుగా కనిపించిన దృశ్యం! బంతి ఉన్నది బాదడానికే అన్నట్లు.. బౌలర్లు ఉన్నది పరుగులు ఇచ్చుకోవడానికే అన్నట్లు బ్యాట్‌ సాగించిన విధ్వంసానికి ఈ మ్యాచ్‌ వేదికగా నిలిచింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. టీకా తీసుకున్న వారంతా కోలుకున్నారు

టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత పలువురు కొవిడ్‌ బారిన పడినా తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇలాంటి వారు ఇటీవల 15 మంది వరకు గాంధీలో చేరారన్నారు. వీరిలో కొందరికి వెంటిలేటర్లు కూడా అవసరమయ్యాయని, అయినా ఒక్కరు కూడా ఆరోగ్యం విషమించి చనిపోలేదన్నారు. చికిత్సలతో అందరూ కోలుకొని తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. Rice Cultivation: రంగుల బియ్యం.. పోషకాలు ఘనం 

పాతకాలం పంటలు, సాగు పద్ధతులు మరుగునపడిపోయాయి. నాజూకైన బియ్యంపై మోజు పెరిగింది. పోషకాలు అందకపోయినా సన్న బియ్యం తినడమే గొప్పనుకుంటున్నాం. వాణిజ్యపరంగా అనుకూలమని రైతులూ సంకరజాతి విత్తనాలనే పండిస్తున్నారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడేస్తున్నారు. పురుగుమందులు ఎడాపెడా చల్లేస్తున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. నవ్వేద్దాం... అన్నీ మరచి..!

కరోనా రెండో దశ ఉధృతరూపం దాల్చింది. ఛానల్‌ తిప్పినా పత్రిక తిరగేసినా కేసులూ చావుల కబుర్లే. ఎవరినైనా పలకరించినా అవే కబుర్లు... ఇలాంటి తరుణంలో నవ్వులేమిటీ దినోత్సవాలేమిటీ అనిపించడం సహజం. కానీ భయాన్ని వీడి హాయిగా జీవించాలంటే నవ్వు అవసరం. ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా మెదడులో రక్తప్రసరణను పెంచుతుంది. కొవిడ్‌నే కాదు, ఏ విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్నీ స్థైర్యాన్నీ ఇస్తుంది. అందుకే నవ్వు పరమౌషధం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని