Top 10 News @ 5PM
close

తాజా వార్తలు

Published : 15/06/2021 17:00 IST

Top 10 News @ 5PM

1. ల్యాబ్‌ లీకా? ఎలా నమ్మారో జనం: బ్యాట్ ఉమన్‌

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ముమ్మాటికీ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే లీకైందనే వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ల్యాబ్‌ లీక్‌ వివాదంలో ముందు నుంచి కేంద్రబిందువుగా మారిన చైనా ప్రముఖ వైరాలజిస్టు, బ్యాట్‌ ఉమన్‌ షీ ఝెంగ్లీ ఎట్టకేలకు ఈ వాదనలపై స్పందించారు. అయితే యథావిధిగా ల్యాబ్‌ నుంచి ఎలాంటి వైరస్‌ లీక్‌ కాలేదని చెప్పడం గమనార్హం.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. Covaxin: ప్రైవేటులో ధర ఎక్కువే.. ఎందుకంటే..!

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా ప్రైవేటులో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు గల కారణాలను పేర్కొంటూ భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి కొవాగ్జిన్‌ టీకా ఒక డోసును రూ. 150కే ఇస్తున్నామని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీర్ఘకాలం ఇలా తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యపడదని అభిప్రాయపడింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Galwan : గల్వాన్‌లో ఏడాది తర్వాత కూడా..!

2020 జూన్‌ 15న దాదాపు 45 ఏళ్ల తర్వాత వాస్తవాధీన రేఖ రక్తమోడింది.16 బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఏడాది పూర్తికావడంతో సైన్యం నేడు వారికి నివాళులర్పించింది.‘‘దేశ భూభాగాన్ని కాపాడేందుకు అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు. వీరి త్యాగాలను దేశప్రజలు ఎన్నటికి మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. మరోపక్క ఏడాదిపాటు 11 విడతలు కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు.  మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. మాన్సాస్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి

మాన్సాస్‌ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.పదవులు ముఖ్యం కాదని.. అభివృద్ధి చూడాలని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని వెల్లంపల్లి చెప్పారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. అవయవ మార్పిడి వారికి మూడో డోసుతో రక్షణ?

కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకున్న వారికి వైరస్‌ నుంచి పూర్తి రక్షణ కలుగుతోందని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారితోపాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలున్న వ్యక్తులు రెండు డోసులు తీసుకున్నా.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వారిలో అభివృద్ధి కాకపోవడమో లేదా త్వరగా క్షీణించిపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. Delhi: ఇప్పుడు తిరగండి..తరవాత నిందించండి

రోనా రెండో దశతో ఆంక్షలతో బందీ అయిన రాష్ట్రాలు..ప్రస్తుతం సడలింపుల దిశగా పయనిస్తున్నాయి. వైరస్ ఉద్ధృతి తగ్గడంతో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. దాంతో మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్ జనాలతో నిండిపోవడంతో..వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో జనాలు గుమిగూడితే మరోసారి వైరస్ ఉద్ధృతి తప్పదని హెచ్చరిస్తున్నారు. పూర్తిస్థాయిలో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసే దిశగా దిల్లీ ప్రభుత్వం పయనిస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. Twitter: ట్విటర్‌కు సమన్లు..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విటర్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వీటిని జారీ చేసింది. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో జూన్‌ 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విటర్‌ ప్రతినిధి ప్రణాళికతో రావాలని కమిటీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. WTC Final: కేన్‌ వచ్చేశాడు.. కివీస్‌ జట్టిదే

న్యూజిలాండ్‌కు శుభవార్త! ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ పూర్తిగా కోలుకున్నాడు. టీమ్‌ఇండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనున్నాడు. ఈ కీలక పోరుకు ముందు అతడికి తగినంత విశ్రాంతి దొరికిందని ఆ జట్టు కోచ్‌ గ్యారీ స్టీడ్‌ అన్నాడు. 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించాడు. ఎడమ మోచేతికి గాయం కావడంతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు విలియమ్సన్‌ దూరమయ్యాడు. అతడి స్థానంలో టామ్‌ లేథమ్‌ నాయకత్వం వహించాడు. జట్టుకు 1-0తో విజయం అందించాడు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. వీళ్లు అంత ఈజీగా స్టార్లు అయిపోలేదు!

అందమైన శిల్పాన్నే చూస్తారంతా... అలా మారడానికి అది తిన్న దెబ్బలు ఎన్నో ఎవరికి తెలుసు? మెరిసే బంగారాన్నే చూస్తారంతా.. అది అలా జిగేల్‌ మనడానికి ఎంత వేడిని తట్టుకుందో ఎవరికైనా తెలుసా? ఇప్పుడు శిల్పాల్లా ఆకట్టుకుంటున్న, బంగారంలా మెరుస్తున్న మన సినీతారలు ... ఎన్నో కష్టాలు పడినవారే. ప్రస్తుతం సక్సెస్‌బాటలో పరిగెడుతూ.. వందల కోట్లను ఆర్జిస్తున్న బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, షారుఖ్‌ఖాన్, గోవిందా జీవితాల్లో ఎన్నో ఆర్థిక కష్టాలు దాటుకొని ఈ స్థాయికి చేరుకున్నారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. China: చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు

ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో సోవియట్‌ యూనియన్‌ను నిలువరించేందుకు ఏర్పడిన  నాటో కూటమి.. తర్వాత ఆ యుద్ధ ఛాయలు ముగిసినా ఆ దేశాన్నే ప్రథమ శత్రువుగా భావించాయి. నిన్న మొన్నటివరకు రష్యానే ప్రత్యర్థిగా చూశాయి. అయితే తొలిసారి నాటో వైఖరిలో మార్పు వచ్చింది. బ్రసెల్స్‌లో సోమవారం నాటో ప్రధాన కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహ 30 దేశాధినేతల సమావేశం.. చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. సైనికపరంగా ఆ దేశంతో ప్రపంచ భద్రతకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని