Top 10 News @ 9PM
close

తాజా వార్తలు

Published : 15/06/2021 20:56 IST

Top 10 News @ 9PM

1. Lockdown: ఆంక్షల ఎత్తివేత మంచిదేనా..?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు కొవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య తగ్గుతోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తున్నాయి. కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సమంజసమేనా..?మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

2. విశాఖ ఉక్కు అంశం... ఆర్థిక రహస్యం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై గందరగోళం కొనసాగుతోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు కేంద్ర ఆర్థికశాఖలోని డీఐపీఏఎం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌) నిరాకరించింది. విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్‌ అడిగిన సమాచారం ఇచ్చేందుకు అంగీకరించలేదు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

3. Corona: మే 7తో పోలిస్తే 85% కేసులు తగ్గాయ్‌..

దేశాన్ని ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టు కేంద్రం వెల్లడించింది.  మే 7న దేశంలో భారీగా నమోదైన కొత్త కేసులతో పోలిస్తే రోజువారీ కేసుల్లో దాదాపు 85% మేర తగ్గుదల ఉన్నట్టు తెలిపింది. మే 4 నాటికి 531 జిల్లాల్లో 100కు పైగా కొత్త కేసులు నమోదుకాగా.. జూన్‌ 13 నాటికి ఆ సంఖ్య 165 జిల్లాలకు తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

4. TS NEWS: పాఠశాలలకు సెలవులు పొడిగింపు

కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు మరో ఐదు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొడిగించిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దీంతో ఈనెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈనెల 19 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

5. Vaccine: ముందస్తు రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు: కేంద్రం

వ్యాక్సిన్‌ కోసం ముందుగా ఎవరూ రిజిస్టర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్లు దాటినవారెవరైనా దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో నమోదు చేసి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. టీకా కోసం ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

6. ఇది రాజకీయ పరి‘వార్‌’

సామ్రాజ్యం.. అధికారం కోసం అన్నదమ్ములు, కుటుంబసభ్యుల కొట్లాట రాజుల కాలానికే పరిమితం కాలేదు. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ పదవుల కోసం సొంతవారిపైనే తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నో రాజకీయ పార్టీలు ‘కుటుంబ పోరు’తో సతమతమవుతూనే ఉన్నాయి. నాటి గాంధీ-నెహ్రూ కుటుంబ పోరు నుంచి నేటి ఎల్‌జేపీ చీలిక వరకు జరిగిన రాజకీయ పరిణామాల విశ్లేషణే ఈ రాజకీయ పరి‘వార్‌’.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

7. Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు రోజురోజుకీ గణనీయంగా తగ్గుతున్నాయి. రికవరీల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ తగ్గుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకొంటోంది. కొత్త టీకాలు దేశంలోకి వస్తున్నాయి. రెండు దశల్లోనూ కరోనా వైరస్‌ చిన్నారులపై స్వల్ప ప్రభావమే చూపించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీకి సిక్మా 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగాఅందజేసింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

8. WTC Final: టీమ్‌ఇండియా జట్టు ఇదే..

ఈనెల 18 నుంచి సౌథాంప్టన్‌ వేదికగా ఏజీయస్‌ మైదానంలో టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌ జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుంది. ఇందులో భాగంగా బీసీసీఐ కొద్దిసేపటి క్రితం 15 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెతో పాటు ఓపెనర్లుగా రోహిత్‌, శుభ్‌మన్‌గిల్‌ను ఎంపిక చేసింది. అలాగే వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా ఇద్దరి పేర్లను చేర్చింది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

9. కియారా కిక్‌.. ఫ్యామిలీతో సాయిపల్లవి.. 

సాయిపల్లవి తన ఫ్యామిలీ ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోల్లో తెగ అల్లరి చేస్తూ కనిపించిందామె. బాలీవుడ్‌ చిన్నది కియారా.. ఎదురుగా నిల్చున్న వ్యక్తి తల మీదున్న టోపీని కాలితో తన్ని పడేసింది. ‘ఒకవేళ నా ఫోన్‌లో ఏం ఉందో మీకు తెలిస్తే..’ అంటూ నటి సన్నిలియోన్‌ షూట్‌కు సంబంధించిన ఒక ఫొటో పోస్టు చేసింది. వ్యాక్సినేషన్‌ ముగియగానే గాయని శ్రేయఘోషల్‌ సెల్ఫీకి పోజిలుచ్చింది. ఉంగరాల జుట్టును మిస్‌ అవుతున్నా అంటూ సొనాలిబింద్రే ఒక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పంచుకుంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి

10. EV scooter: ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125కి.మీ. వెళ్లొచ్చు!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ హాప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మంగళవారం విపణిలోకి రెండు కొత్త ఇ-స్కూటర్‌లను తీసుకొచ్చింది. మొత్తం ఐదు వాహనాలను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ఇందులో ఒక ఇ-బైక్‌ కూడా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అంతేకాదు, వివిధ నగరాలు, పట్టణాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని హాప్‌ భావిస్తోంది.మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని