పురుషులను లాఠీలతో చితకబాదిన మహిళలు

తాజా వార్తలు

Updated : 24/03/2021 17:29 IST

పురుషులను లాఠీలతో చితకబాదిన మహిళలు

ఉత్తరప్రదేశ్‌లోని మథురలో వింత ఆచారం

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సంప్రదాయంగా నిర్వహించే ‘లాఠీ మార్‌’ వేడుకలు అలరిస్తున్నాయి. రంగులు చల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు మహిళలు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీ మార్‌ హోలీ ప్రత్యేకత. రెండు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో లాఠీ మార్‌ వేడుకలు నిర్వహించగా బుధవారం బర్సానా, నందగావ్‌లో వేడుకలు జరుపుకొన్నారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా.. రాధా తదితరులు కృష్ణుడిని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీ మార్‌ దాడి నుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారు. లాఠీ మార్‌కు సంబంధించి దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని