తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 21:26 IST

తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌: పెట్టుబడుల సాధనలో తెలంగాణ దూసుకెళ్తోంది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ దిగ్గజ సంస్థ ట్రైటాన్‌.. తెలంగాణలో సుమారు రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్రైటాన్ సంస్థ ప్రతినిధులు కలిశారు. విద్యుత్‌ వాహనాల తయారీ ప్రణాళికలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అవకాశాలు పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నామని సంస్థ సీఈవో కేటీఆర్‌తో చెప్పారు. తెలంగాణకు ఉన్న అనుకూలతలను దృష్టితో ఉంచుకొని పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడినట్లు ప్రకటించారు. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో విద్యుత్‌ వాహన తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు ట్రైటాన్‌ సీఈవో సుముఖత వ్యక్తం చేశారు. తొలి ఐదేళ్లలో సుమారు 50వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్రి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడితో తెలంగాణలో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్‌ అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు సంస్థ ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా తెలంగాణలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ గతంలో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పెట్టుబడిని తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా కేటీఆర్‌ ప్రకటించారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ రంగంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ హైదరాబాద్‌ను భారత్‌లో తమ రెండో ఏడబ్ల్యూఎస్‌ రీజియన్‌గా ఎంచుకుంది. ఈ సెంటర్‌ను 2022 ప్రథమార్ధంలో అందుబాటులోకి తీసుకురానుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని