TS News: 8న తెలంగాణ కేబినెట్‌ భేటీ

తాజా వార్తలు

Updated : 06/06/2021 14:16 IST

TS News: 8న తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్‌ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలంలో సాగునీరు తదితర అంశాలపై సమీక్షించే వీలుంది. రైతుబంధు అమలు, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యతపై కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశముంది. 

ఈనెల 9న డయాగ్నస్టిక్‌ సెంటర్ల ప్రారంభం

మరోవైపు సోమవారం అన్ని జిల్లాల్లో ప్రారంభం కావాల్సిన డయాగ్నస్టిక్‌ సెంటర్లను జూన్‌ 9 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొని ఏకకాలంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు లేనిచోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని