ts news: ఆదాయ మార్గాలపై అన్వేషణ
close

తాజా వార్తలు

Published : 17/06/2021 20:40 IST

ts news: ఆదాయ మార్గాలపై అన్వేషణ

హైదరాబాద్‌: ఆదాయం పెంపు మార్గాలపై తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. నిధుల సమీకరణపై వచ్చిన ప్రతిపాదనలను సంబంధిత భాగస్వామ్యులతో చర్చించి సీఎం కేసీఆర్‌కు ప్రాథమిక నివేదిక అందించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పురపాలక, ఐటీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 

నిధుల సమీకరణపై అధికారులు సమావేశంలో వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించి, వివిధ స్టేక్‌ హోల్డర్స్‌తో సంప్రదింపుల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించాలని ఉప సఘం నిర్ణయించింది. కరోనా రెండోదశ ఉద్ధృతి, లాక్‌డౌన్‌తో ఖజానాకు రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. ఒక్క మే నెలలోనే రూ.4,100 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు రాష్ట్ర ప్రభత్వం ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ తరుణంలో నిధుల సేకరణ కోసం ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థ వద్ద నిరుపయోగంగా ఉన్న భూములు విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ భూముల వేలానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని