TS Covid: 6,026 కొత్త కేసులు
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS Covid: 6,026 కొత్త కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 79,824 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6,026 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 52 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 2,579కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజు 6,551 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,115 కేసులు నమోదయ్యాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని