TS Corona: తెలంగాణలో 638 కొత్త కేసులు.. 3 మరణాలు

తాజా వార్తలు

Published : 26/07/2021 19:58 IST

TS Corona: తెలంగాణలో 638 కొత్త కేసులు.. 3 మరణాలు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 1,14,105 నమూనాలను పరీక్షించగా.. 638 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,41,791కి పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,787కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,325 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు 97.95 శాతం కాగా.. మరణాల రేటు 0.59గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 59 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని