TS Ed-CET దరఖాస్తుల గడువు పెంపు
close

తాజా వార్తలు

Published : 22/06/2021 16:01 IST

TS Ed-CET దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడ్‌ సెట్‌ దరఖాస్తులకు గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ తెలిపారు. కరోనా మహమ్మారితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. తాజా నిర్ణయంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎడ్‌సెట్‌ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని