TSPSC: ఛైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం

తాజా వార్తలు

Published : 19/05/2021 11:12 IST

TSPSC: ఛైర్మన్‌ను నియమించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి ఛైర్మన్‌, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ప్రస్తుత వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఈఎన్సీ రమావత్‌ ధన్‌సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కోట్ల అరుణకుమారి, ప్రొఫెసర్‌ సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు డాక్టర్‌ అరవెల్లి చంద్రశేఖర్‌రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సత్యనారాయణలను ప్రభుత్వం నియమించింది. 

నాలుగు వారాల్లోపు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమించాలని ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమించింది. దీంతో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని