ఇంటర్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు: సబిత

తాజా వార్తలు

Updated : 09/06/2021 15:53 IST

ఇంటర్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు: సబిత

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల రద్దుపై  ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు  చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. కేబినెట్‌ భేటీ తర్వాత దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంటర్‌ పరీక్షల రద్దు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం తెలిపారు. ఇంటర్‌ పరీక్షల రద్దుపై సమీక్ష తర్వాతే ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని