TS news: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి

తాజా వార్తలు

Updated : 05/07/2021 19:31 IST

TS news: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి

హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)ని ఆశ్రయించింది. ఈ మేరకు ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ పనులు చేస్తోందని ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు రాయలసీమ ప్రాజెక్టును సందర్శించాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అధికారులను ఏపీ అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఎన్జీటీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించాలని విజ్ఞప్తి చేసింది. పర్యటనకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని చెప్పింది.

రాయలసీమకు అనుమతులివ్వొద్దు

ఆంధ్రప్రదేశ్‌ చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ  కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌ బయటకు నీరు తీసుకెళ్లేందుకే రాయలసీమ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వివరించింది. కృష్ణాబోర్డుకు డీపీఆర్‌ ఇవ్వకుండా పనులు చేయవద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పింది. అదేవిధంగా సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చేవరకు పనులు ఆపాలని కేంద్రం చెప్పినట్లు గుర్తు చేసింది. ఈ లేఖతో పాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వివరాలను తెలంగాణ ప్రభుత్వం జతపర్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని