హోంశాఖ గాఢనిద్రలో ఉందా?: హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 16/06/2021 17:48 IST

హోంశాఖ గాఢనిద్రలో ఉందా?: హైకోర్టు

హైదరాబాద్‌: సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో జాప్యంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రవిగుప్తాపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో తెలపాలని వివరణ కోరింది.

‘‘177 మంది ఏపీపీల నియామకంపై ఏప్రిల్‌ 1న ఏజీ హైకోర్టుకు తెలిపారు. రెండున్నర నెలలైనా నియమించకపోవడం ఆమోదయోగ్యం కాదు. హోంశాఖ గాఢ నిద్రలో ఉందా? న్యాయవ్యవస్థ కూడా నిద్రించాలని హోంశాఖ భావిస్తోందా?నియామకాల్లో జాప్యం.. విచారణపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీపీల నియామకంపై విచారణను జులై 7కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని