hyderabad news: జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష అక్రమ నిర్మాణాలు: హైకోర్టు

తాజా వార్తలు

Published : 04/08/2021 18:37 IST

hyderabad news: జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష అక్రమ నిర్మాణాలు: హైకోర్టు

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదులు సరైన విధంగా అభ్యంతరాలు తెలపనందునే స్టే ఆదేశాలు జారీ అవుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయని, ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు, విధివిధానాలు కాగితాల్లో బాగానే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుర్తించిన అక్రమ నిర్మాణాలు, తీసుకున్న చర్యలు, స్టేలు ఎత్తివేసేందుకు చేపట్టిన చర్యలపై నివేదికలు సమర్పించిన జోనల్‌ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్‌ కారణాలు చూపుతూ విధి నిర్వహణ నుంచి తప్పించుకోరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు .. ఖర్చుల కింద రూ.10వేలు చొప్పున చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇచ్చిన హైకోర్టు.. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని