హాఫీజ్‌పేట భూములు ప్రైవేటువే: హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 31/03/2021 14:38 IST

హాఫీజ్‌పేట భూములు ప్రైవేటువే: హైకోర్టు

హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌ సర్వే నంబర్‌ 80లోని రూ.వేల కోట్ల వివాదాస్పద భూములపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 140 ఎకరాల భూములు వక్ఫ్‌ బోర్డు, ప్రభుత్వానివి కాదని.. ప్రైవేటు వ్యక్తులవేనని స్పష్టం చేసింది. ఆ భూములు తమవేనంటూ మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌రావుతో పాటు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించింది. పిటిషనర్లకు రూ.4లక్షలు చెల్లించాలని వక్ఫ్‌ బోర్డు, ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఆ భూమిలో 50 ఎకరాలు ప్రవీణ్‌రావు, సహ యజమానుల పేరిట నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ భూముల వివాదంలోనే ప్రవీణ్‌రావుతో పాటు మరికొంతమందిని కిడ్నాప్‌ చేశారంటూ ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ తదితరులపై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అఖిల ప్రియ అరెస్టయి జైలుకెళ్లి ఆ తర్వాత విడుదలయ్యారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని